Home News తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయుల మీద అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అనుచితం:కేటీఆర్

తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయుల మీద అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అనుచితం:కేటీఆర్

Akbaruddin-Owaisi
akbaruddin-owaisi

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. రెచ్చగొట్టే ప్రసంగాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో.. హైదరాబాద్‌లో వాతావరణం వేడెక్కింది. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యలను మరవకముందే.. తాజాగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ కట్టడాల పేరుతో పేదలను ఇబ్బందులు పడుతున్న టీఆర్ఎస్‌ ప్రభుత్వానికి దుమ్ముంటే… హుస్సేన్ సాగర్ కట్టపై ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చేయాలని బాంబు పేల్చారు. ఇప్పుడీ వ్యాఖ్యలపై తెలంగాణలో రచ్చ జరుగుతోంది. అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ మరియు బీజేపీ పార్టీ నాయకుడు బండి సంజయ్ తీవ్రంగా తప్పుబట్టారు.

Akbaruddin Challenges Trs Govt To Demolish Samadhis Of Pv Narasimha Rao And Sr.ntr
KTR

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్‌పై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అనుచితమని మంత్రి కేటీఆర్ అన్నారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. పీవీ, ఎన్టీఆర్ తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులని ఆయన కొనియాడారు. ఒకరు ప్రధానిగా, మరొకరు సీఎంగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారని.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు చోటు లేదని కేటీఆర్‌ అన్నారు.

అక్బురుద్దీన్‌పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తనదైన స్టైల్లో  విరుచుకుపడ్డారు. మీకు దుమ్ముంటే ఎన్టీఆర్, పీవీ ఘాట్‌లను కూల్చాలని.. వాటిని కూల్చిన మరుక్షణమే దారుస్సలాంని బీజేపీ కార్యకర్తలు కూల్చేస్తారని హెచ్చరించారు. అంతేకాదు గురువారం ఉదయం ఎన్టీఆర్, పీపీ ఘాట్లలో నివాళులర్పిస్తానని ఆయన అన్నారు. ఈ మహా నాయకుల ఘాట్‌లకు రక్షణగా ఉంటానని ప్రమాణం చేయనున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Posts

వెంకటేష్ నారప్ప రిలీజ్ ఎప్పుడు ..?

వెంకటేష్ నారప్ప సినిమా నుంచి అభిమానులు ఎదురు చూస్తున్న అప్‌డేట్స్ అంతగా రావడం లేదన్న టాక్ వినిపిస్తోంది. రీమేక్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన వెంకటేష్ మరోసారి తమిళ సూపర్ హిట్...

రవితేజ కాదు ఇప్పుడు శృతి హాసన్ కెరీర్ విజయ్ సేతుపతి చేతిలో ఉందా ..?

రవితేజ క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. 2017 లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మళ్ళీ రవితేజ కి హిట్ దక్కలేదు. దాదాపు మూడేళ్ళ తర్వాత...

అఖిల్ 6 కి ఇద్దరు డైరెక్టర్స్ ..మరిది కోసం సాలీడ్ ప్రాజెక్ట్ సెట్ చేసిన సమంత ..?

అఖిల్ 4 గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. సమంత గెస్ట్ రోల్...

కొండను ఢీకొడతానంటున్న బండి.. కళ్ళు తిరిగి పడిపోరు కదా !

భారతీయ జనతా పార్టీలు దక్షిణాదిలో కర్ణాటక తర్వాత అంతగా వెలిగిపోతున్న రాష్ట్రం తెలంగాణ.  ఉద్యమం నుండి ముఖ్యమంత్రిగా ఎదిగిన కేసీఆర్ ను కిందకు లాగడం అంత ఈజీగా అయ్యే పని కాదని, ఇంకో 10 సంవత్సరాలు పడుతుందని  అంతా అనుకున్నారు.  కానీ భారతీయ...

Latest News