భక్తులు లేకుండానే భద్రాద్రి రామయ్య కళ్యాణం

ప్రతి ఏడాది కన్నుల పండుగగా జరిగే భద్రాద్రి సీతారాముల కళ్యాణం ఈ సారి వెలవెలబోనుంది. ప్రతి ఏడాది దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే ఈ వేడుక ఈ సారి కరోనా మహమ్మారి కారణంగా భక్తులెవరూ లేకుండా కేవలం అర్చకులు మాత్రమే పాల్గొని జరిపించనున్నారు.

శ్రీ సీతారాముల కళ్యాణం ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. ఆరు బయట అందరికీ కనిపించేలా.. ఈ క్రతువు సాగుతుంది. కానీ ఈసారి ఆ అదృష్టం భక్తులకు దక్కడం లేదు. రాష్ట్రంలో కరోనా విస్తరణను దృష్టిలో పెట్టుకుని.. ఈ ఏడాది స్వామివారి కళ్యాణానికి ఎవరినీ అనుమతించట్లేదని.. కాబట్టి భక్తులెవరూ రావొద్దని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా తెలిపారు. కళ్యాణం బాధ్యతలను ప్రభుత్వ సలహాదారు రమణాచారికి అప్పగించారు.

అలాగే కళ్యాణ మహోత్సవానికి ఈ ఏడాది ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఎవరు తీసుకొస్తారనే దానిపైన ఇంకా నిర్ణయం జరకగ పోవడంతో ఈ ఏడాది ముఖ్యమంత్రి ఇవ్వకపోవచ్చు అని తెలుస్తోంది.