జెఎన్టీయు లో మదమెక్కిన ప్రొఫెసర్ ఏం చేసిండంటే ? (వీడియో)

హైదరాబాద్ జెఎన్టీయు అనగానే మనందరికి గుర్తొచ్చేది విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పే దేవాలయం అనే కదా. అక్కడ ఉండే పంతుళ్లు విద్యార్థులకు పాఠాలు చెప్పి భావి భారత ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దుతారనేగా మనం అనుకుంటాం. కానీ అక్కడ ఉన్న మిగతా ప్రొఫెసర్లు ఏమో కానీ ఒక ప్రొఫెసర్ మాత్రం పశువు కంటే హీనంగా రెచ్చిపోయి పుచ్చిపోయిండు. వివరాలు చదవండి. వీడియోలో చూడండి.

జులై 7, ఉదయం జెఎన్టీయులో ఒక సంఘటన జరిగింది. యూనివర్శిటీలఅని స్పందన బ్లాక్ ఎంట్రన్స్ ఎదురుగా కారు పార్కు చేయకూడదు.. పార్కింగ్ స్థలం లో పెట్టుకోండి అని కాశి రాములు అనే సెక్యురిటి గార్డ్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర రావుకు, ఆయన భార్యకు సూచించాడు. పార్కింగ్ లో కారు పార్కు చేయాలని చెప్పి తన డ్యూటీ తాను చేసిన పాపానికి ఆ కాశిరాములుపై ప్రొఫెసర్ ధౌర్జన్యం చేశాడు. ఎంతగా అంటే ఆఫీసు రూములోకి పిలిపించి మరీ ఎగిరెగిరి కొట్టిండు. ఆ ప్రొఫెసర్ ఒకవైపు దెబ్బలు కొడుతుంటే తన భార్య నోటికి పనిచెప్పి గలీజు మాటలు తిడుతూ రెచ్చిపోయింది.

నోట్లో నాలుక లేని ఆ సెక్యూరిటీ కాశిరాములు ను ఉరికించి కొట్టిండు ఆ పశు ప్రొఫెసర్. రక్తం కారేటట్లు కొట్టి తన పవరేంటో చూపించిండు. సెక్యూరిటీ గార్డు నాకు చెబుతాడా అని స్థాయి మరచి బజారు రౌడీ మాదిరిగా విరుచుకుపడి కొట్టిండు. తనను కొట్టొద్దు అని చేతెలెత్తి మొక్కుతున్నా వినలేదు. తప్పైందని బతిలాడినా ఆ ప్రొఫెసర్ మనసు కరగలేదు.

లాస్టుకు ఆ ప్రొఫెసర్ కాళ్లు మొక్కడంతో శాంతించి వదిలేసిండు. పక్కవాళ్లు ఆపుతుంటే కూడా మదమెక్కిన దున్నపోతు మాదిరిగానే దాడి చేసిండు మన ప్రొఫెసర్ గారు. చేతులతో కొడుతూ, బూటు కాళ్లతో తంతూ తన ఉగ్రరూపాన్ని సెక్యూరిటీ గార్డ్ మీద చూపించడం పట్ల సహచర ప్రొఫెసర్లు కూడా షాక్ అయ్యారు. సెక్యూరిటీ గార్డ్ మీద ఎట్ల దాడి చేసిండో పైన సిసి పుటేజీ తాలూకు వీడియో ఉంది చూడండి. సెక్యూరిటీ గార్డు మీద దాడి చేసిన ప్రొఫెసర్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.