కుత్బుల్లాపూర్ టిఆర్ఎస్ రేస్ లో ఆ నలుగురు.. మరి సీటెవరికి ?

 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం  నేతల  వేట అప్పుడే మెదలైంది. ఒక పార్టీ నుండి నియోజకవర్గంలోఒక అభ్యర్ధి పోటి చెస్తే అంత సజావుగానే సాగుతుంది. కానీ కొన్ని స్థానాల్లో ఒక అభ్యర్థి కంటే ఎక్కువ మంది పోటికి సిద్దం అవుతున్నారు.

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్  నియెజక వర్గంలో రానున్న ఎన్నికల్లో  టికెట్ కోసం ప్రయత్నాలు మెదలు పెట్టారు కొందరు టిఆర్ఎస్ పార్టీ నాయకులు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత జరిగిన ఎన్నికల్లో ఇక్కడ  టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించలేక పోయింది. టిఆర్ఎస్ పార్టీ నుండి పోటి చేసిన కె.హన్మంత్ రెడ్డి టిడిపి అభ్యర్థి కేపీ. వివేకానంద చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో కేపీ.వివేకానంద 39,021 ఓట్ల మెజారిటి తో గెలుపొందారు.  తదనందతర కాలంలో బంగారు తెలంగాణ నిర్మాణం కొసం  కేపీ.వివేకానంద్ టీఆర్ఎస్ పార్టీ  లో చేరిండు. కాని ఈ సారి వివేక్ కు టికెట్ వస్తుందా రాదా అన్న చర్చను యూటి (ఉద్యమ తెలంగాణ) బ్యాచ్ బలంగా తేచ్చింది.  దీంతో వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరా అన్న దానిపై కుత్బుల్లాపూర్  నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది.

k hanmanth reddy

ఈ నియోజకవర్గం లో  టీఆర్ఎస్ పార్టీ తరుపున నలుగురు అభ్యర్థులు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.  2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి  నుంచి పోటీ చేసిన  కె.హన్మంత్ రెడ్డి  ప్రస్తుతం నియోజక వర్గ ఇన్ చార్జి గా కొనసాగుతున్నాడు. ఈ సారి   హన్మంత్  రెడ్డి  టికెట్ కోసం ప్రయత్నంచేస్తున్నాడు.

kp vivekanandh

 

ఇక ప్రస్తుత ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ఎలాగైన మళ్లీ తనకే  టికెట్ దక్కుతుందన్న ధీమాతో ఉన్నాడు. సిట్టింగ్ అందరికి సీట్లు ఇస్తాం అని పలుమార్లు  కేసిఆర్  చేసిన ప్రకటను వివేక్ అనుచరులు గుర్తుచేస్తున్నారు.

Shambipur-Raju

తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుండి రాజకీయాల్లోకి  వచ్చిన నాయకుడు శంభీపూర్ రాజు ఈ నియోజక వర్గం పైను కన్నేసాడు. రాజు ముఖ్యమంత్రి కుటుంబానికి సన్నిహితమైన వ్యక్తి కావడం, ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొనడంతో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పొటి చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని అనుచరుల మాట.

MallaReddyMp

మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంలో అంతర్భాగం కుత్బుల్లాపూర్  నియోజకవర్గం. ఈ పార్లమెంట్ స్థానానికి ఎంపీ మల్లారెడ్డి టిడిపి నుండి గెలుపొంది బంగారు తెలంగాణ కోసం  టీఆర్ఎస్ లో చేరాడు. ఈయన కూమారుడు మహేందర్ రెడ్డి,అల్లుడు రాజశేఖర్ రెడ్డి లలో ఎవరో ఒకరికి టికెట్ దక్కించుకునేందుకు ఎంపీ  తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నట్లు సమాచారం.

కుత్బుల్లాపూర్  నియోజకవర్గం టికెట్ కొసం ఈ నాలుగురు నేతల ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. ఈ అసెంబ్లీ స్థానంలో రాజకీయ కదలికలు చుస్తూంటే టీఆర్ఎస్ లొ  గ్రూపు రాజకీయాలు ఏ స్థాయిలొ కొనసాగుతున్నాయో అర్ధం అవుతున్నది.

ఈ గ్రూప్ రాజకీయాల్లో ఏదైన తేడా వస్తే సందట్లో సడేమియా అన్నట్లు కాంగ్రేస్ పార్టీ  ఈ నేతలకు వల వేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది.  కుత్బుల్లాపూర్  సీటు ఎవరికి అనేది ఎన్నికల నాటికి తేలే అవకాశం ఉంది.