ఇక వెళ్లిపోవచ్చు, డిఎస్ కు కెసిఆర్ మెసేజ్

టిఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు డిశ్రీనివాస్ (డిఎస్ గా పాపులర్) పార్టీ నివీడక తప్పని పరిస్థితి వచ్చింది. అయితే, రాజ్యసభకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. రాజీనామా చేసి ఆయన తన దారి తాను చూసుకోవచ్చని ఆయన పార్టీ బాస్ నుంచి సమాచారం వచ్చిందని విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ (కెసిఆర్) ఆయనను వారించే పరిస్థితే లేదు. అసలు డిఎస్ తో ఆయన సమావేశానికి ఏమాత్రం సుముఖంగా లేరు. నిజానికి డిఎస్ అంటే ఆయనకు ఎపుడూ ఇష్టం లేదు. రాజకీయ వ్యూహంలో భాగంగా ఆయనను డిఎస్ కు పింక్ కండువా తప్ప, డిఎస్ రాజకీయ యోధుడని, పార్టీకి అండగా ఉంటాడని కాదు. అయితే, పార్టీకి డిఎస్ కుటుంబం అండగా ఉంటుందన్న భరోసా కనిపించకపోవడంతో సమస్య ఎదురవుతూ ఉంది. డిఎస్ విధానాలతో హర్ట్ అయింది కెసిఆర్ కాదు. కెసిఆర్ కూతురు నిజాంబాద్ ఎంపి కవిత. ఇది చాలా సీరియస్ వ్యవహారం. ఎందుకంటే తిరుగుబాటు కూడా ఆమె ఆధ్వర్యంలో ఆమెనివాసంనుంచే మొదలయింది.అందువల్ల ఇక డిఎస్ తో సంప్రదింపులేమిటి?

‘సమావేశం, గిమావేశం ఎందుకయ్యాడు. పొయ్యే వాడు, రాజీనామా చేసి పోవచ్చుగా,’ అని కెసిఆర్ ఈసడించుకున్నారని, ఇది ‘శీనన్న’కు తెలిసిందని, ఆయన చాలా బాదపడ్డాడని డిఎస్ సన్నిహితులు చెప్పుకుంటున్నారు. ఇపుడు డిఎస్ యోచిస్తున్నది టిఆర్ఎస్ కు రాజీనామాచేసి, కాంగ్రెస్ లో చేరడం గురించి కాదు, రాజ్యసభ సీటు రాజీనామా చేయాలా వద్దా అనే విషయం గురించి. రాజీనామా చేయకపోతే, టిఆర్ ఎస్ వాళ్లు వూరికే వదిలేలా లేరు. జనరల్ పార్లమెంటు సభ్యులు పార్టీమారినా, పార్టీ వాళ్లని బహిష్కరించినా పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయరు. ఈ విషయాలను లోక్ సభ స్పీకర్ గాని, రాజ్యసభచెయిర్మన్ గాని అంత సీరియస్ గా తీసుకోరు. ఇలాంటి సభ్యడు అన్ అటాచ్డ్ (ఏ పార్టీకి చెందని) సభ్యులుగా కొనసాగుతూ ఉంటారు.

Aravind Dharmapuri

అయితే, ఇపుడు డిఎస్ వదిలేస్తున్నది టిఆర్ ఎస్ ని, చేరాలనుకుంటున్నది కాంగ్రెస్ లో. అందువల్ల ఆయన హుందాగా రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాల్సిందే. లేకపోతే, నవ్వుల పాలే. ఎందుకంటే, రాష్ట్రంలో బిజెపిఅధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ‘2019’లో అధికారం మాదే నని యాత్రలు మొదలుపెట్టినా, కేంద్రంలో టిఆర్ ఎస్ కు ,ప్రధాని మోదీకి మంచి సంబంధాలున్నాయి. ఎవరేమన్నా కెసిఆర్ మోదీ మనిషే. విభజన చట్టంలో తెలంగాణకు చెందిన అంశాలను, హామీలను అమలు చేయకపోయినా, అపుడపుడు ఒక మెమొరాండం ఇవ్వడం మినహా ఎలాంటి యాగీ చేయకుండా ఉంటున్న నాన్ ఎన్డీయే పార్టీ టిఆర్ ఎస్సే. అందువల్ల రాజ్యసభకు రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరితే, యాంటి డిఫెక్షన్ చట్టం ప్రకారం చర్య తీసుకోవాలని టిఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ రాజ్యసభ ఛెయిర్మన్ కు లేఖ రాస్తారు. అరగంటలో అది ఆమోదం పొందుతుంది. ఆ తర్వాత అరగంటలో డిఎస్ ను డిస్ క్వాలిఫై చేస్తూ నోటిఫికేషన్ వెలువడుతుంది. రాజకీయాల్లో తలనెరిసిన, డిఎస్ కు తలతీసేసినంత పనవుతుంది. అందువల్ల ఆయన రాజీనామాచేయకతప్పదని కాంగ్రెస్ వాళ్లు కూడా అభిప్రాయపడుతున్నారు.

రాజకీయాల్లో విధేయత చాలా చీప్ సరుకు. చస్తే నాశవం మీద పార్టీ జండా ఉంటుంది తప్ప పార్టీ మారననే వాళ్లకూడా దర్జగా పార్టీ మారడం మనం చూస్తుంటా. అదేవిధంగా ప్రపంచంలో రక్తాన్ని మించిన చిక్కటి పదార్థం లేదు. అందుకే రక్తసంబంధం కోసం పార్టీలను ముంచడం, పార్టీ క్రమశిక్షణను కాలదోయడం, మోసాలు, వంచనలు చేయడం రాజకీయాల్లో మామూలు. కూతరు కొడుకుల కోసం కాకుంటే ఇంత వ్యవహారం నడిపేది ప్రజలకోసం కాదు.

TRS MP Kavitha

ఇపుడ కెసిఆర్ కు, డిఎస్ కు ఇదే సమస్య వచ్చింది. డిఎస్ కొడుకు అరవింద్ బిజెపినుంచి నిజాంబాద్ ఎంపిగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అంటే టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూతురు కు పోటీ గా తయారవుతున్నాడన్నమాట. ఈ పోటీలు డిఎస్ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అరవింద్ గెలవాలని కోరుకుంటాడుగా. ఏ తండ్రీ తన కొడుకు వోడిపోయి, పార్టీ విధేయత పేరతో సొంత పార్టీ లీడర్ కూతురు గెలవాలనుకుంటాడా. అలా ఆశించడం రాజీకీయ అజ్ఞానమే. అందుకే కెసిఆర్ ‘ నాకొడుకు వేరు, నా పార్టీ వేరు,’ అని డిఎస్ అంటున్నా వినేందుకు సిద్ధంగా లేడు. అసలు నడవడమే కష్టంగా ఉన్న డిఎస్ ని పార్టీలోకి తీసుకుని, రాజ్యసభ సభ్యుని చేయించింది ఎందుకు? ఎలాంటి పరిస్థితుల్లో డిఎస్ నుంచి గాని, డిఎస్ కుటుంబం నుంచి గాని కవిత ఎన్నికలకు ఆటంకం రాకూడదనేగా. డిఎస్ టిఆర్ ఎస్ వుప్పు తింటూ కొడుకు అరవింద్ గెలవడానికి పని చేస్తే ఊరుకుంటారా?

ఇలాంటివి కాంగ్రెస్ లో జరుగుతాయి. ప్రాంతీయ పార్టీలలోసాధ్యం కాదు. కాంగ్రెస్ లో ఉంటూ పార్టీకి ముంచడం అనే రాజకీయ కళ రూపొందింది కాంగ్రెస్ నుంచే. అంతెందుకు దేశంలో ఉన్న ప్రతిరాజకీయ అవలక్షణానికి కాంగ్రెస్ నేతలే కారణం. అన్నింటిని చూసిచూడనట్లు పోవడం ఆ పార్టీ గొప్పదనం. పార్టీని ముంచి బయటికి పోయినోడు, పార్టీకి ద్రోహం చేసినోడు, పార్టీకి ఏమాత్రం పనికిరానోడు… ఎవరైనా మళ్లీ పార్టీలోకి వస్తానంటే, చక్కగా స్వాగతం పలికేది కాంగ్రెసే. అందుకే కాంగ్రెస్ మాజీ నేతల కోసం ఎలా అర్రులు చాస్తున్నదో చూశారుగా.
కాబట్టి డిఎస్ కాంగ్రెస్ లోకి ‘హోం కమింగ్ ’ పండగే.