కరోనా మహమ్మారి మరో రాజకీయనేతను బలితీసుకుంది. తెలంగాణలో కరోనా కారణంగా కాంగ్రెస్ నేత నరేంద్ర యాదవ్ మృతి చెందారు. ఇటీవల ఆయనకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో నరేంద్ర యాదవ్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా కొద్దిసేపటి క్రితం నరేంద్ర యాదవ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇటీవల నరేంద్ర యాదవ్ కరోనా బాదితుల సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయనికి కూడా కరోనా వ్యాధి సోకింది. ఇక నరేంద్ర యాదవ్ మృతితో కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆందోళణ చెందుతున్నాయి. ఈ క్రమంలో ఆయన కుంటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించాయి.