fbpx
Home Cinema నో గ్యారంటీ కథ! (`ఎన్‌.జి.కె` మూవీ రివ్యూ)

నో గ్యారంటీ కథ! (`ఎన్‌.జి.కె` మూవీ రివ్యూ)

 తమిళ స్టార్ సూర్య – దర్శకుడు సెల్వరాఘవన్ ల తొలి కాంబినేషన్ లో సుదీర్ఘ కాలం నిర్మాణం జరుపుకున్న ‘ఎన్ జి కే’ కే మొత్తానికి విడుదలైంది. ఎంత ఆలస్యానికి అంత వయసు మీద పడుతుందన్నట్టు సినిమా తీరుతెన్నులు సాక్ష్యంగా నిలిచాయి. ఒక స్టార్ మూవీ ఏజి బార్ అయి బాక్సాఫీసు ముందుకు  రావడం కన్నా దురదృష్టం వుండదు. అసలే ఇది సెల్వ రాఘవన్ కి మొట్ట మొదటి పెద్ద స్టార్ మూవీ. దీంతో అదృష్టవంతుడు కాలేకపోయాడు.

అనారోగ్యం బారిన పడి తను మాత్రమేం చేస్తాడు. ఫ్లాప్ కి సిద్ధపడీ  దీన్ని పూర్తి చేసిన సూర్య సహకార గుణాన్నికూడా మెచ్చుకోవాలి. అన్నట్టు సినిమాలో తన పాత్ర కూడా ప్రజలకి సహాయ సహకారాలందిస్తూ పాటు పడేదే. కాకపోతే సినిమా కథే సహాయ నిరాకరణ చేసింది. కథ సహాయ నిరాకరణ చేస్తే ఎంత స్టార్ అయినా, ఎన్ని అరుపులు అరిచీ సినిమాని హిట్ చేయలేడనేది తెలిసిన వాస్తవం.  అసలేమిటీ కథ, ఏమిటా సహాయ నిరాకరణ, ఒకసారి చూద్దాం…

కథ
          నంద గోపాల కృష్ణ, అంటే ఎన్ జి కే (సూర్య) ఎం టెక్ చదివిన టెక్కీ. కానీ ఆ ఉద్యోగం మానేసి ఆర్గానిక్  వ్యవసాయం చేస్తూంటాడు. దీనికి వూళ్ళో ప్రోత్సహిస్తూంటాడు. అదే సమయంలో ఎవరికే కష్టం వచ్చినా తీరుస్తూ వుంటాడు. దీంతో అతడికి మంచి పేరొస్తుంది. ఇంట్లో భార్య గీతా కుమారి (సాయి పల్లవి), తల్లీ వుంటారు. అయితే తను  ప్రోత్సహిస్తున్న  ఆర్గానిక్ వ్యవసాయం వల్ల కొన్ని వర్గాలకి ఇబ్బందులొస్తాయి. ఎరువుల వ్యాపారులు, క్రిమిసంహారక మందుల వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, పోలీసులూ వీళ్ళందరికీ ఆదాయాలు పోతాయి. దీంతో పంటలు నాశనం చేసేస్తారు.

ప్రజలు వ్యతిరేకమవుతారు. ఏం చేయాలో పాలుపోని గోపాల్ ఒక పార్టీ కార్యకర్త మాటలు విని ఎమ్మెల్యే (బాలా సింగ్) ని కలుస్తాడు. ఎవరూ నీ జోలికి రాకుండా చూస్తా గానీ, నువ్వు మాత్రం నీకున్న ఐదువందల మంది యువబలంతో మా పార్టీలో చేరాలంటాడు ఎమ్మెల్యే. గోపాల్ అలాగే చేస్తాడు. పార్టీ బలం పెరిగిందని సీఎం మెప్పు పొందుతాడు ఎమ్మెల్యే. కానీ కార్యకర్తగా గోపాల్ చేత ఇంటి పనులు చేయించుకుంటూ హీనంగా చూస్తాడు. దీంతో ఆ ఎమ్మెల్యేకి ఎసరుపెట్టి తను సీఎం దాకా ఎదిగిపోవాలని ప్రయత్నాలు ప్రారంభిస్తాడు గోపాల్. ఇందులో భాగంగా పరిచయమైన వనిత (రకుల్ ప్రీత్ సింగ్) అనే అమ్మాయితో సంబంధం పెట్టుకుంటాడు…

ఎలావుంది కథ 

          రొటీన్ రాజకీయ ఫార్ములా కథ. హీరో సీఎం అయ్యే అదే పాత మాస్ కథ. 2016 లో ఈ కథ రాసుకోవడంతో ఇప్పుడు పాతబడిన ఫ్లాప్ కథ. సీఎం అవడానికి హీరో ఏం చేశాడనే కన్నా, సీఎం అయి ఎలా పాలించాడనే కథగా వుంటే ఆసక్తి వుండేదేమో. ఇందులో చూపించిన సేంద్రియ వ్యవసాయం సామాన్య ప్రజానీకానికి ఉపయోగ పడేది కాదు. ఈ ఆహారోత్పత్తుల ధరలు సామాన్యులు భరించలేరు. ప్రజల చేత సేంద్రియ వ్యవసాయాలు చేయించి వ్యవస్థ కన్నెర్ర జేయడానికి కారకుడయ్యాడు తప్పితే ఈ కథతో ఒరిగిందేమీ లేదు.  దుష్టుల వల్ల కోల్పోయిన ఈ సేంద్రియ వ్యవసాయం కోసమైనా సీఎం అవ్వాలన్న గోల్ పెట్టుకుని వుంటే, అందుకు ఆర్గానిక్ ఉత్పత్తులు వాడే సంపన్న వర్గాల సపోర్టు చూపిస్తే, ఈ కథకి ఓ అర్ధం పర్ధమైనా  వుండేదేమో. కథని ఏ మాత్రం రీసెర్చి చేయకుండా చుట్టేద్దామ
నుకున్నారు. 


ఎవరెలా చేశారు       

          ముందుగానే చెప్పుకున్నట్టు సూర్య ఎన్ని అరుపులు అరిచీ సినిమా కేం లాభం. కథ లాభ పడితేగా తను లాభ పడేది, సినిమా లాభ పడేది. నటనతో ఇరగ దీశాడనే మాస్ భాషలో చెప్పవచ్చు. సినిమా మాత్రం ఇరగ దీయలేదు. పాటలు కూడా డిటో. ఇంత సూర్యకి సరైన విలన్ కూడా లేకపోవడం చూస్తే ఈ స్టార్ మూవీ రేంజ్ ఏమిటో తెలిసిపోతుంది. దాదాపు 40 – 50 నిమిషాలు డల్ గానే వుంటాడు సూర్య రాజకీయాల్లో అక్రమాలకి బాధ పడుతూ. ఆ తర్వాతే కర్తవ్యం తెలుసుకుని చురుకుగా తయారవుతాడు. కానీ సీఎం అవడానికి చేసే పనులకే ఓ అర్ధంపర్ధం, క్రమం వుండవు. ఒక స్టార్ గా సూర్య ఫెయిల్ కాలేదు, కథ సహకరించక కథే ఫెయిలైంది.

 
          ఈ సినిమాలో సాయిపల్లవి ఎందుకుందో అర్ధంగాదు. ఇంట్లో కూర్చుని భర్తని అనుమానించే పాత్ర. భర్తనుంచి ఫెర్ఫ్యూమ్ వాసనకి తిరుగుళ్ళు అంటగట్టి గొడవ పెట్టుకునే పాత్ర. రాజకీయంగా ఎదగడానికి అతను పాల్పడుతున్న పద్ధతుల్ని వ్యతిరేకించే చాలా పాత కాలపు పాత్ర. రకుల్ ప్రీత్ సింగ్ ఆధునిక ఎన్నికల వ్యూహకర్త పాత్ర ఎంట్రీ వరకే ధూంధాం. ఆ తర్వాత తలా తోకా వుండవు. సూర్య, సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ అనే ముగ్గురు స్టార్లు కలిసి స్టార్ మూవీని ఎంత అపహాస్యం చేయాలో అంతా చేసి సంతృప్తి పడ్డారు. 


          ఇక యువన్ శంకర్ రాజా ఏం మ్యూజిక్ కొట్టాడో అర్ధం గాదు. పాత రోజుల్లో సినిమా బాగా లేకపోయినా పాటల తోనే హిట్టయ్యేవి వుండేవి. ఇప్పుడలాటి హిట్ మ్యూజిక్ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇక శివకుమార్ విజయన్ కెమెరా వర్క్ ఫర్వాలేదు. ఎడిటింగ్ అదుపులో లేదు. ఏం కథో అర్ధం గాకపోతే ఏ సీను తీసేసి నిడివి తగ్గించాలో అర్ధంగాదు. అందుకనే  రెండు గంటల 40 నిమిషాల మోతబరువు నిడివికి వదిలేశాడు. 
          సెల్వ రాఘవన్ ఒకప్పటి దర్శకత్వపు క్వాలిటీ ఇప్పుడు లేదు. ఆరేళ్ళ సుదీర్ఘ కాలం తర్వాత తనకి ఇదే సినిమా. ఈ గ్యాప్ పనితనాన్ని పలచ బారేట్టు చేసినట్టుంది. అతి పేలవంగా తయారయింది ప్రొడక్టు.

చివరికేమిటి 


          యాభై నిముషాలు నీరసం, ఆ తర్వాత గంటా యాభై నిమిషాలు గంరగోళంతో ఇది నో గ్యారంటీ కథ (ఎన్ జి కే).  ఫస్టాఫ్ యాభై నిమిషాలు ఇంట్లో భార్యతో తల్లితో, బయట రకరకాల ప్రజా సేవలతో కమర్షియల్ ఎంటర్ టైనర్ కి వ్యతిరేకంగా ఆర్ట్ సినిమా చూస్తున్నట్టు నీరసంగా వున్నాక, ఆ తర్వాత నుంచి ముగిసే దాకా గంటా యాభై నిమిషాలు అర్ధం లేని సీన్లతో, కథ ఎక్కడి కెళ్తోందో అంతుబట్టని సీన్లతో,  గందరగోళంగా తయారైపోతుంది. ఇంత గందరగోళంగా వున్న సినిమాలో మంచి విషయాలని వెతడం అసాధ్యం. దర్శకుడిని, స్టార్ ని మన్నించి ఇలాటి అర్ధం లేని సినిమా  తీసిన నిర్మాతల సాహసానికి మాత్రమే మెచ్చుకోగలం.

<

p style=”font-weight: 400″>―సికిందర్

తెలుగురాజ్యం ప్రత్యేకం

రాయలసీమలో తెలుగుదేశంని ముందుండి నడిపే రెడ్డి ఎవరు?

37 ఏళ్ల సుధీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని చెప్పక తప్పదు. గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా మారిపోయిన టీడీపీ ఇకపై ఎలా ప్రస్థానం కొనసాగిస్తుందోనన్న...

తెలియకుండానే బీజేపీని బలపరుస్తున్న కేసిఆర్?

తెలియకుండానే బీజేపీని బలపరుస్తున్న కేసిఆర్? తెలంగాణ ప్రాంత వాసుల సుదీర్ఘ కల తెలంగాణ రాష్ట్రం. అది 2004 సంవత్సరంలో సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడింది? కెసిఆర్ పోరాటం వలన? లేక కాంగ్రెస్ ఇచ్చిందా??...

మల్టిపుల్ తికమక- ‘గేమ్ ఓవర్’ రివ్యూ

ఈ రెండేళ్లుగా ముల్క్, నీవెవరో, మన్మర్జియా, బద్లా అనే రియలిస్టిక్ సినిమాల్లో మరిన్ని బలమైన పాత్రలు నటించిన తాప్సీ సోలో ప్రయాణం, 2016 లో ‘పింక్’ తో ప్రారంభమయ్యింది. మళ్ళీ ‘పింక్’ లాంటి...

అత్యంత ప్రజాధారణ

తాజా వార్తలు

సీక్రెట్ గా మర్డర్స్ తో శృతిహాసన్ కు వరల్డ్ వైడ్ గా గుర్తింపు

ఇన్నాళ్లూ టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌లో నటిగా సందడి చేసిన శృతిహాసన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ వెబ్‌సిరీస్‌లో నటించబోతున్నారు. అమెరికాకు చెందిన ‘ట్రెడ్‌స్టోన్‌’లో శ్రుతి కీలక పాత్రను పోషించబోతున్నారు. ఇందులో ఆమె వెయిట్రెస్‌గా కనిపిస్తూ సీక్రెట్...

రానా ‘విరాటపర్వం’లీకైన స్టోరీ..ఇంట్రస్టింగ్

రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా పొలిటికల్ థ్రిల్లర్ విరాటపర్వం సినిమా మొదలైన సంగతి తెలిసిందే. నీదీ నాది ఒకటే కథ వంటి డిఫరెంట్ సినిమాతో పరిచయమైన దర్శకుడు వేణు ఊడుగల డైరక్ట్ చేస్తున్న...

రెజీనా కి సీక్రెట్ గా చేసుకోవాల్సిన అవసరం ఏమిటో

స్టార్ హీరోయిన్ రెజీనా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తమిళ చిత్ర పరిశ్రమలో ప్రచారం సాగుతోంది. తమిళనాడుకు చెందిన ఓ నేషనల్‌ న్యూస్‌ మ్యాగజైన్‌ రెజీనా నిశ్చితార్థం గురించి వార్తలు ప్రచురించడం వైరల్‌గా మారింది. ఈ...

తెలుగు టీవి సీరియల్ నటిపై మూకుమ్మడి దాడి

గొలుసు విషయంలో తలెత్తిన ఓ వివాదం టీవీ సీరియల్ నటిపై మూకుమ్మడి దాడికి కారణమైంది. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారనే నెపంతో మాధురిపై కోపం పెంచుకున్న హెయిర్‌ డ్రెసర్‌ జ్యోతిక తన అనుచరులతో...

మూడో ఎంఎల్సీ వైసిపిలో ఎవరికో ?

తొందరలో భర్తీ అయ్యే మూడు ఎంఎల్సీల్లో మూడో అవకాశం ఎవరికి వస్తుందో అన్న సస్పెన్స్ పెరిగిపోతోంది.  మొన్నటి ఎన్నికల్లో ఐదు ఎంఎల్సీ పదవులు ఖాళీ అయ్యాయి. ఇందులో రెండు స్ధానిక సంస్ధలకు చెందినవైతే...

షాకింగ్ : ‘సాహో’ ప్రి రిలీజ్ బిజినెస్

ప్రభాస్ సాహో చిత్రం ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ దగ్గర పడుతుండటంతో.. ప్రీ బిజినెస్ కూడ ఊపందుకుంది. దాదాపు ప్రి రిలీజ్ బిజినెస్ అన్ని ప్రాంతాలకు...

అచ్చెన్నకు గట్టి షాక్ ఇచ్చిన స్పీకర్

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు స్పీకర్ తమ్మినేని సీతారామ్ గట్టి షాకే ఇచ్చారు. ప్రత్యేకహోదా అంశంపై అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నపుడు పదే పదే అచ్చెన్న అడ్డు తగిలేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా స్పీకర్ నే...

స్టార్ హీరో కొడుకుని లాంచ్ చేస్తున్న శేఖర్ కమ్ముల

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయటం చాలా మంది అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఓవర్ నైట్ లో గుర్తింపు వస్తుంది. మినిమం సెన్సిబులిటీస్ తో సినిమా చేస్తారు. రీసెంట్ గా...

చంద్రబాబుకు షాకులిస్తున్న సుజనా

చంద్రబాబునాయుడుకు కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి షాకులిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓటమి తర్వాత బహిరంగంగా చంద్రబాబును తప్పు పట్టిన నేతలు ఎవ్వరూ లేరు. అలాంటిది సుజనా మాత్రం...

బిజెపిలో చేరిన మాజీ ఎంపి..ఎంత కాలం ఉంటారో ?

రాష్ట్రంలో బలపడేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలు కొత్తా గీతతో మొదలైనట్లుంది. అరకు పార్లమెంటు మాజీ సభ్యురాలు కొత్తా గీత బిజెపిలో చేరారు. కేంద్ర హోం శాఖమంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా...
 Nate Gerry Jersey