Home Cinema బ్రేకింగ్ :తెలుగులో 'స్టార్‌స్పోర్ట్స్'..రేపటి నుంచే

బ్రేకింగ్ :తెలుగులో ‘స్టార్‌స్పోర్ట్స్’..రేపటి నుంచే

స్టార్ స్పోర్ట్స్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ఆ ఛానెల్ ఇంగ్లీష్ లో వస్తూంటుంది. కానీ ఇప్పుడు స్టార్ గ్రూప్ రీజనల్ లాంగ్వేజెస్ పై దృష్టి పెట్టింది. తెలుగులోనూ స్టార్ స్పోర్ట్స్ ని అందించటానికి రెడీ అయ్యింది. స్టార్స్ స్పోర్ట్స్ ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు చానెల్‌గా మరో అడుగు ముందుకేసింది.

ఈ స్టార్‌స్పోర్ట్స్ 1 తెలుగు రెండు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి లైవ్ చానెల్‌గా మొదలుకాబోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో క్రీడలను ఎక్కువగా ఇష్టపడేవారికోసం ఇను నుంచి తెలుగు భాషలోనే అన్ని కార్యక్రమాలను ప్రసారం చేయబోతుంది. ఈ చానెల్ వివో ప్రో కబడ్డీ లీగ్‌తో కలిసి తన ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించింది. దేశంలో, స్థానికంగా జరిగే అన్ని క్రీడల కార్యక్రమాలను ఇక నుంచి తెలుగు భాషలోనే ప్రసారం చేయబోతుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలుగు టైటాన్స్ లీడింగ్ రైడర్ రాహుల్ చౌదరి మాట్లాడుతూ… ‘ గత కొన్ని సీజన్ల నుంచి నాకు ఇక్కడి ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోంది. నన్ను, నా టీమ్ తెలుగు టైటాన్స్ జట్టుని ఇక్కడి ప్రజలు బాగా ప్రోత్సహిస్తున్నారు. మాపై వారు చూపే అభిమానం వెలకట్టలేనిది. ఇప్పటీవరుకు స్టార్ స్పోర్ట్స్‌ని నేను హిందీలో చూసి ఎంజాయ్ చేసేవాడ్ని.

ఇక నుంచి స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగులో వస్తోంది. తెలుగు అభిమానులు ఇక నుంచి మనకు నచ్చిన భాషలోనే మ్యాచ్‌లు చూసి ఆనందించవచ్చు. ఇది మనందర్ని ఒకటి చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు’ అని రాహుల్ అన్నారు.

అత్యంత ప్రజాధారణ

తెలుగురాజ్యం ప్రత్యేకం

తాజా వార్తలు

పవన్ హీరోయిన్ పై ఛీటింగ్ కేసు

అమీషా పటేల్ గుర్తుందా.. అప్పట్లో పవన్ కళ్యాణ్ సరసన “బద్రి”, మహేష్ బాబుకు జతగా నాని సినిమాలో నటించిన బాలీవుడ్ భామ అమీషా పటేల్.   గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ...

బోయపాటి కు బాలయ్య 2 కండీషన్స్..ఒప్పుకుంటేనే సినిమా

సినిమా హిట్ అయితే తదుపరి సినిమాకు ఎన్ని డిమాండ్స్ చేసినా సెలంట్ గా భరిస్తారు నిర్మాత, హీరో. ఎందుకంటే తమకు ఆ రేంజి హిట్ ఇస్తాడనే నమ్మకంతో. అదే ప్లాఫ్ అయితే సీన్...

తల్లికి దాహం తీర్చలేదు గాని పినతల్లికి పట్టు చీరనా?

  (వి. శంకరయ్య)   అన్న దాత సుఖీభవ తంతు ఇలాగే వుంది.        రైతు రుణ మాఫీపథకం దిక్కు మొక్కు లేకుండా పడి వుంది. రెండు కంతులు ఎపుడు ఇస్తారని రైతులు ఎదురు చూస్తుంటే దానిని పట్టించుకోకుండా ‘అన్న...

రిలీజ్ కాకముందే రచ్చ వద్దని వారించిన మోహన్ బాబు

లక్ష్మీస్  ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ అయిన నాటి నుంచీ తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా గురించే చ‌ర్చ న‌డుస్తోందనటంలో అతిశయోక్తి లేదు. వాస్తవానికికి ఎన్టీఆర్ క‌థానాయకుడు విడుద‌లైన‌పుడు కూడా ఇంత‌గా చ‌ర్చ...

‘యన్‌టిఆర్‌ – మహానాయకుడు’ ట్రైలర్

‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు, మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చాను’ అంటూ మహానాయకుడు వచ్చేసాడు.  నటుడు, రాజకీయనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యన్‌టిఆర్‌’....

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు కోటి వ్యూస్..వెనక సీక్రెట్ ఇదే

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం...

రకుల్ రెమ్యునేషన్ ఎంతో తెలుసా?

సిని పరిశ్రమలో లెక్కలు క్రేజ్ ని బట్టే ఉంటాయి. హిట్ పడితే ఓవర్ నైట్ లో రెమ్యునేషన్ రెట్టింపు అవుతుంది. ప్లాఫ్ వస్తే ..అడ్వాన్స్ లు కూడా వెనక్కి తిరిగి ఇచ్చేయమంటారు. అంతా...

రెబెల్ ర్యాపర్ గా రణవీర్ గుర్తుండిపోయే నటన: గల్లీ బాయ్ (మూవీ రివ్యూ)

16.2.19 రివ్యూ స్లమ్ డాగ్ కళా విజయం!  ‘గల్లీబాయ్’ దర్శకత్వం : జోయా అఖ్తర్  తారాగణం : రణవీర్ సింగ్, ఆలియాభట్, కల్కి కొష్లిన్, సిద్ధాంత్ చతుర్వేది, విజయ్ రాజ్, విజయ్ వర్మ, అమృతా సుభాష్ తదితరులు  రచన : జాయా...

తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని ఉరేసుకున్న సాఫ్ట్ వేర్ అమ్మాయి

 హైదరాబాద్ లో దారుణం జరిగింది. మాదాపూర్ లోని అరుణోదయ లేడిస్ హాస్టల్ లో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీవిద్య(25)   శనివారం ఆత్మహత్య కు పాల్పడింది. గదిలో లోపలి నుంచి గడియ పెట్టుకున్న...

జవాన్ల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు 

ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఒక్కో అమర జవాను కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అమరుల త్యాగాలను దేశం ఎప్పటికి గుర్తుంచుకుంటుదని...