టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ … ఎవరంటే ?

దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ డుప్లెసిస్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ఇన్​స్టాగ్రామ్​లో​ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టేందుకు ఇదే సరైన సమయమని తన మనసు చెబుతున్నట్లు రాసుకొచ్చాడు. ఇటీవల పాకిస్తాన్ పర్యటనలో సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ కోల్పోయింది.

Image result for డుప్లెసిస్

ఆ పర్యటనలో విఫలమనప్పటి నుంచి డుప్లెసిస్ ఫామ్‌పై విమర్శలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికా ఇటీవలి శ్రీలంక పర్యటనలో, డు ప్లెసిస్ అద్భుతమైన సెంచరీ సాధించాడ. గత సంవత్సరం నుంచి అతని ఫామ్‌ని ప్రశ్నిస్తున్నవారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. కానీ సడన్‌గా ఈ నిర్ణయం అతడి అభిమానులను షాక్‌కు గురిచేసింది.

2012 నవంబరులో ఆస్ట్రేలియాలోని అడిలైడ్​ వేదికగా టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఫాఫ్​ డుప్లెసిస్​.. చివరిగా పాకిస్థాన్​తో జరిగిన టెస్టు సిరీస్​లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆడిన 69 టెస్టుల్లో.. 4 వేలకు పైగా రన్స్ చేశాడు. అందులో 10 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 36 టెస్టుల్లో సౌతాఫ్రికా జట్టుకు డుప్లెసిస్​ కెప్టెన్​గా వ్యవహరించాడు.