Rohit Sharma: దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌ నుండి రోహిత్ శర్మ ఔట్

Rohit Sharma was ruled out of the upcoming three-match Test series against South Africa

Rohit Sharma: దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ కు రోహిత్ శర్మ దూరమయ్యాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) ట్విట్టర్ లో ధృవీకరించింది. ఆదివారం నాడు ముంబైలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ ఎడమ కాలికి గాయం అయ్యింది. ఈ కారణంగా రోహిత్‌కు టెస్ట్ సిరీస్‌ నుండి తప్పుకున్నారు. భారత జట్టులోకి రోహిత్ స్థానంలో ఓపెనర్ ప్రియాంక్ పంచల్‌ చోటు దక్కించుకున్నాడు.

రోహిత్ దూరమవ్వటం ఇండియాకు చాలా మైనస్ గా కనిపిస్తుంది. మరో ఓపెనింగ్ బ్యాటర్ శుభమన్ గిల్ గాయంతో ఇప్పటికే దక్షిణాఫ్రికా టూర్‌ కు దూరమైనందున రోహిత్ కూడా దూరమవ్వటం భారత జట్టును కలవరపరుస్తుంది. ఇటీవలనే రోహిత్ ను భారత వన్డేలకు కెప్టెన్‌గా, టెస్ట్‌ లకు వైస్ కెప్టెన్‌ గా BCCI నియమించింది. వైస్ కెప్టెన్‌ గా ఆడబోయే తొలి టెస్ట్ సిరీస్ నుండి హిట్ మాన్ అవుట్ అవ్వటం అభిమానులకు చేదు వార్త.

భారత టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, ప్రియాంక్ పంచల్, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్-), అశ్విన్కీ, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మొహమ్మద్. షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, ఎండీ సిరాజ్.