మరికాసేపట్లో ఐపీఎల్ మినీ వేలం … ఏ జాభితా లో ఏ ఆటగాళ్లు ఉన్నారంటే ?

ఐపీఎల్ వేలానికి రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలం కాసేపట్లో ప్రారంభం కానుంది. చెన్నైలోని గ్రాండ్ ఛోలా హోటల్ వేదికగా ఈ ఆక్షన్ జరగనుంది.దమ్మున్న ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపించి ఓవర్‌నైట్‌లో వాళ్ల రాత మార్చేందుకు ఎనిమిది ఫ్రాంచైజీలు సిద్దమయ్యాయి. కరోనా కారణంగా గతేడాది యూఏఈకి తరలిన లీగ్.. ఈ సారి భారత్‌కు తిరిగొస్తుండడంతో ఇక్కడి పిచ్‌లపై చెలరేగే క్రికెటర్లను ఎంచుకునేందుకు.. తమ బలాన్ని మరింత పెంచుకునేందుకు.. ఇప్పటికే అన్ని లెక్కలు వేసుకున్నాయి.

ఇప్పటికే ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్ల లిస్ట్ సిద్ధం చేసుకున్నాయి. టీమ్స్ బ్యాలెన్స్ కోసం కావాల్సిన ప్రణాళికలను రచించాయి. మొత్తం 292 మంది ఈ వేలంలో పాల్గొంటున్నారు. ఇందులో 164 మంది భారత ఆటగాళ్లు కాగా, 125 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. మరో ముగ్గురు అసోసియేటేడ్ దేశాలకు చెందినవారు. అత్యధిక ధర 2 కోట్ల జాబితాలో 10 మంది ఉండగా మార్క్ వుడ్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో ఏ లిస్ట్ లో ఎంతమంది ఉన్నారో చూద్దాం.

2 కోట్లు జాబితా :

హర్భజన్ సింగ్​, కేదార్ జాదవ్, మ్యాక్స్​వెల్, స్టీవ్ స్మిత్, షకిబ్ ఉల్ హసన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లియామ్ ప్లంకెట్, జాసన్ రాయ్.

1.5 కోట్లు జాబితా :

అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్, అలెక్స్ కారే, నాథన్ కౌల్టర్​ నీల్, జే రిచర్డ్​సన్, ముజిబ్ ఉర్ రెహ్మన్, ఆదిల్ రషీద్, షాన్ మార్ష్, టామ్ కరన్, డేవిడ్ విల్లే, లూయిస్ జార్జీ, మోర్నీ మోర్కెల్.

1 కోటి జాబితా :

ఆరోన్ ఫించ్, ఎవిన్ లూయిస్, హనుమ విహారి, షెల్డన్ కాట్రెల్, ముస్తఫిజుర్ రెహ్మన్, ఉమేశ్ యాదవ్, మోసెస్ హెన్రిక్స్, మార్నస్ లబుషేన్, జాసన్ బెహ్రండాఫ్, బిల్లీ స్టాన్​లేక్, మాథ్యూ వేడ్.

75 లక్షలు జాబితా :

క్రిస్ మోరిస్, కోరే ఆండర్సన్, డారెన్ బ్రావో, బెన్ కటింగ్, కైలీ జేమిసన్, ఫాబియాన్ అలెన్, డాన్ క్రిస్టియన్, లివింగ్​స్టోన్, టిమ్ సౌథీ, కీమో పాల్, ఫిడెల్ ఎడ్వర్ట్స్, మహ్మద్ మహ్మదుల్లా, షెర్ఫేన్ రూథర్​ఫర్డ్, హిల్టన్ కాట్ రైట్, జేమ్స్ ఫాల్క్​నర్.