టాస్ గెలిచిన భారత్ … ఆదిలోని ఎదురుదెబ్బ !

ఇంగ్లాండ్, భారత్ మధ్య చపాక్ స్టేడియం వేదికగా శనివారం రెండో టెస్టు మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ ‌లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో ‌ఇంగ్లాండ్ 1-0 ముందంజలో ఉంది. తొలి టెస్టులో ఘోరంగా ఓడిన టీమిండియా ఇప్పుడు బదులు తీర్చుకోవాలని చూస్తోంది. ఇక ప్రపంచ టెస్టు చాంపియన్‌ షి‌ప్ ఫైనల్లో నిలవాలంటే భారత్‌ ఖచ్చితంగా మిగిలిన 3 టెస్టుల్లో కనీసం 2 మ్యాచ్‌ లో అయినా గెలవాల్సిందే. . చాలా రోజుల తర్వాత భారత్‌లో క్రికెట్ మ్యాచ్‌ ను చూసేందుకు ప్రేక్షకులకు అనుమతి ఇస్తోంది బీసీసీఐ.

Imageహ్లి సేన పలు మార్పులతో బరిలోకి దిగింది. ముగ్గురు స్పిన్నర్లను ఎంచుకోగా.. స్టార్‌ పేసర్‌ బుమ్రాకు తుది జట్టులో చోటుదక్కలేదు. హైదరాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కు‌ స్థానం లభించింది. కరోనా కాలం తర్వాత ప్రేక్షకులను అనుమతిస్తున్న తొలి మ్యాచ్‌ ఇదే కావడం విశేషం.

తుది జట్ల వివరాలు..

భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), గిల్, రోహిత్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, అక్షర్, ఇషాంత్, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్ యాదవ్‌‌.

ఇంగ్లండ్‌: రూట్‌ (కెప్టెన్‌), సిబ్లీ, బర్న్స్, లారెన్స్, స్టోక్స్, పోప్, ఫోక్స్, అలీ, బ్రాడ్, లీచ్, స్టోన్‌.