భారత్‌, ఇంగ్లాండ్‌ ఫస్ట్ టెస్ట్ .. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ , బుమ్రాకి ఫస్ట్ మ్యాచ్ !

గత ఏడాది కాలంగా స్వదేశంలో మ్యాచ్‌ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న అభిమానుల కల నేరవేరింది. భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరిగే నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ శుక్రవారంతో ప్రారంభమవుతుంది. చెన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా మెుదటి సమరం మెుదలైంది. ఈ మ్యాచ్‌లో భాగంగా మెుదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.

India vs England: భారత్‌, ఇంగ్లండ్‌ తొలి టెస్టు.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్!

ఇక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ రేసు కోసం ఇరు జట్లు ఈ సిరీస్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. న్యూజిలాండ్‌ జట్టు ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరింది. ఫైనలో రేసులో ఉన్న ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా పర్యటనను రద్దు చేసుకొవడంతో రెండు జట్లు ఫైనల్ చేరే మార్గం మరింతగా సులభమైంది. రెండో బెర్త్‌ దక్కించుకునేందుకు భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు తహతహలాడుతున్నాయి. ఈ కీలకమైన పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

టీమిండియా తుది జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), అజింక్య రహానే, రిషభ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇషాంత్‌, బుమ్రా, షాబాజ్‌ నదీం
ఇంగ్లండ్‌: బర్న్స్‌, సిబ్లీ, లారెన్స్‌, జో రూట్‌(కెప్టెన్‌), స్టోక్స్‌, ఓలి పోప్‌, బట్లర్‌, బెన్‌, ఆర్చర్‌, జాక్‌లీచ్‌, అండర్సన్‌

ఇప్పటివరకు బుమ్రా టీమిండియా తరపున 17 టెస్టులకు ప్రాతినిధ్యం వహించగా.. అవన్నీ విదేశాల్లోనే ఆడడం విశేషం.2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన బుమ్రా ఇప్పటివరకు 21 సగటుతో 79 వికెట్లు తీశాడు.కాగా రేపు ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు మ్యాచ్‌తో బుమ్రా స్వదేశంలో తొలి టెస్టు ఆడడం ప్రత్యేకతను సంతరించుకొంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇప్పటికే స్వదేశంలో తనదైన మార్క్‌ చూపిన బుమ్రా టెస్టులో తన ముద్రను ఎలా వేయనున్నాడనేది తేలిపోనుంది.