బాక్సింగ్ డే టెస్ట్ …రెచ్చిపోయిన భారత బౌలర్లు , టీ బ్రేక్ కి ఆసీస్ 136/5 !

ఆస్ట్రేలియా-భారత్ ‌ల మధ్య జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టు మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బ్యాటింగ్ ఎంచుకున్న కంగారులను మన బౌలర్లు కంగారు పెట్టించారు. మన బౌలర్లు రెచ్చిపోవడంతో ఆసీస్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్ జో బర్న్స్ డకౌట్ అయ్యాడు.

Ind Vs Aus: ఆరంభంలోనే ఆసీస్ షాకిచ్చిన భారత బౌలర్లు.. నిలకడగా రాణిస్తున్న లబుషేన్

దీంతో ఆసీస్ జట్టు 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మొత్తంగా ఆసీస్ టీ బ్రేక్ సమయానికి 136 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక, భారత బౌలర్లలో బుమ్రాకు ఒక రెండు, అశ్విన్ రెండు , సిరాజ్ కి ఒక వికెట్ దక్కింది.

బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆసీస్ 1-0తో టెస్ట్ సిరీస్‌లో అధిక్యంలో ఉంది. టీమిండియా ఈ మ్యాచ్‌లో ఓడితే టెస్ట్ సిరీస్ గెలిచే అవకాశాన్ని కోల్పోతుంది. మరోవైపు భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ 100వ టెస్ట్‌ మ్యాచ్‌ కావడం విశేషం.