హార్ధిక్ పాండ్యా తండ్రి మృతి ..!

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంట విషాదం చోటు చేసుకుంది. అతని తండ్రి హిమాన్షు పాండ్యా శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. అతని సోదరుడు కృనాల్ పాండ్యా కూడా క్రికెటర్‌కాగా.. ప్రస్తుతం అతను సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో బరోడా తరఫున మ్యాచ్‌లు ఆడుతున్నాడు. తండ్రి మృతి విషయం తెలియగానే హుటాహుటిన అతను ఇంటికి పయనమయ్యాడు.

హార్ధిక్ పాండ్యా తండ్రి క‌న్నుమూత‌..

ఇక త్వరలో ఇంగ్లండ్‌తో సిరీస్‌ ఆరంభమయ్యే క్రమంలో హార్దిక్‌ పాండ్యా ట్రైనింగ్‌ సెషన్‌లో ఉన్నాడు. ఇటీవల ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ తర్వాత ఇంటికి వచ్చిన హార్దిక్‌.. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సన్నద్ధం అవుతున్నాడు. తండ్రి హిమాన్షు పాండ్యా అంటే హార్దిక్ పాండ్యాకి చాలా ఇష్టం.

అన్న కంటే ముందు టీమిండియాకి ఆడిన హార్దిక్ పాండ్యా.. తన సంపాదనతో హిమాన్షు పాండ్యాకి ఖరీదైన కారుని బహూకరించాడు. అప్పట్లో ఓ విదేశీ టూర్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా.. కారుని బుక్ చేసి షోరూమ్‌కి తండ్రిని తీసుకెళ్లాల్సిందిగా కృనాల్‌, తన కజిన్‌ని కోరాడు. అక్కడ హిమాన్షుకి అందరూ కలిసి సర్‌ప్రైజ్ ఇచ్చారు.