కొబ్ బ్రయంట్ గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. అందులోనూ స్పోర్ట్స్‌లో ఇంట్రస్ట్ ఉన్న ప్రతిఒక్కరికి ఈయన పేరు పరిచయమే. ప్రముఖ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు కొబ్ బ్రయంట్. ఈయన అనుకోకుండా ఓ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. కొబ్ బ్రయంట్ యూఎస్‌లో జరిగిన ఓ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన బాస్కెట్‌బాల్ క్రీడలో బాగా సంపాదించారు. ఆయన మృతి పట్ల ఆయన అభిమానులంతా కన్నీరుమున్నీరవుతున్నారు.
కొబ్ బ్రయంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రష్ అయింది. 41 ఏళ్ల కొబ్ బ్రయంట్‌తో పాటు ఆ విమానంలో మరో నలుగురు కూడా ప్రయాణిస్తున్నారు. ఆదివారం క్యాలిఫోర్నియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంతేకాక మరో విచారకరమైన విషయం ఏమిటంటే ఈ హెలికాప్టర్లో ఆయన కుమార్తె కూడా ఉన్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం వాతావరణ పరిస్థితి బాలేని సమయంలో ఆయన ప్రయాణించారని దట్టమైన మేఘాల కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిపారు. కొబ్ బ్రయంట్ తన 20 ఏళ్ల కెరియర్లో పలు రికార్డులు సాధించారు.
నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ తరపున ఆడి ఏకంగా ఐదుసార్లు ఆయన ఛాంపియన్‌గా నిలవడమనేది గమనార్హం. 18సార్లు ఆల్ టైమ్ స్టార్‌గా ఆయన నిలిచారు. 2016లో ఎన్బీఏ నుంచి మూడవమారు కూడా ఆయన ఆల్ టైమ్ స్కోరర్‌గా రిటైర్ అయ్యారు. కొబ్ బ్రయంట్ 2012 ఒలింపిక్స్‌లో యూఎస్ టీమ్ తరపున ఆడి రెండు స్వర్ణపతకాలను గెలుచుకున్నారు.