Home Cinema క్షుద్ర శక్తి Vs దైవ శక్తి ( 'శరభ' సినిమా రివ్యూ)

క్షుద్ర శక్తి Vs దైవ శక్తి ( ‘శరభ’ సినిమా రివ్యూ)

ఆకాష్‌కుమార్ హీరోగా మిస్టీ చక్రవర్తి హీరోయిన్‌గా యన్.నరసింహారావు దర్శకత్వంలో ఎకెఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మించి న చిత్రం ‘శరభ’. డా.జయప్రద, నాజర్, నెపోలియన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయ్యింది. దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ ,గ్రాఫిక్స్ పనిలో ఉన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.  గ్రాఫిక్స్ మాత్రమే హైలెట్ గా అనిపించే ఈ చిత్రం క్షుద్రశక్తికి, దైవ శక్తికి మధ్య పోరాటంగా తెరకెక్కింది. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా ..అసలు కథేంటో చూద్దాం…

కథేంటంటే..

సింగాపుర గ్రామంలో మొదలయ్యే ఈ కథలో …. చంద్రక్ష ( పునీత్ ఇస్సేర్ ) అనే క్షుద్ర మాంత్రికుడు అతీతమైన శక్తులను కోసం నరబలులు ఇస్తూంటాడు. ఆ బలులు కూడా అమ్మాయిలనే ఎంచుకుంటాడు. అప్పటికే 17 మందిని బలి వేసేసాడు. ఇంకో అమ్మాయి దొరికితే తను అనుకున్నది సాధిస్తాడు. అందుకోసం దివ్య ( మిస్త్రీ చక్రబోర్తి ) ని ఎందుకుని, ఆమెన చంపాలనుకుంటాడు. అయితే ఈ దుష్టశక్తికి అడ్డుపడే ఓ దేవశక్తి శరభ (ఆకాష్ కుమార్) పుట్టి ఉందని అతనికి తెలియదు. అలాగే శరభకు నరసింహస్వామి అండగా ఉన్నాడని అసలు తెలియదు. ఈ లోగా దివ్యతో శరభ ప్రేమలో పడతాడు. ఆమెను క్షుద్రమాంత్రికుడు ఎత్తుకుపోతున్నడని తెలిసి..ఎలా అడ్డుపడ్డాడనేది మిగతా కథ.

ఎనాలసిస్

సినిమా ప్రారంభం ఎంతో ఇంట్రస్టింగ్ గా మొదలై ఆ తర్వాత మెల్లిగా డ్రాప్ అవటం మొదలవుతుంది. ముఖ్యంగా గ్రిప్పింగ్ గా లేని స్క్రీన్ ప్లే ఈ సినిమాని దెబ్బ తీసింది. థ్రిల్లర్ జోనర్ లో నడిచే ఈ సినిమా అంతగా థ్రిల్ గా అనిపించదు. దర్శకుడు విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పై పెట్టిన శ్రద్ద కథ,కథనాల మీద పెట్టలేదనిపిస్తుంది. అలాగే హీరో,హీరోయిన్స్ మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్ కూడా చాలా వీక్ గా ఉంది. హీరోగా ఆకాశ్ కుమర్ తొలి సినిమా కావటంతో ఎక్సప్రెషన్స్ వంటి విషయాల్లో చాలా వీక్ గా ఉన్నాడు. యాక్షన్ సీన్స్ మాత్రం బాగా చేసాడు. దర్శకుడు నరసింహరావు…తన సీనియారిటీతో కొత్త దర్శకుడులా ఎక్కడా అనిపించలేదు కానీ కొత్తదనం కూడా ఎక్కడా చూపలేకపోయాడు. రొటీన్ మేకింగ్ తో వెళ్లిపోయారు.

సాంకేతికంగా ..

ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు.. ఆర్ట్ డిపార్టమెంట్ కిరణ్ కుమార్ మన్నె , కోటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ర‌మ‌ణ సాల్వ కెమెరా ప‌నిత‌నం. ఇక బుర్రా సాయిమాధ‌వ్ మాట‌లు అనగానే చాలా ఎక్సపెక్ట్ చేస్తాం..ఆ స్టాండర్డ్స్ ఏవీ కనపడలేదు. తన కుమారుడే హీరోకావటంతో నిర్మాణం ప‌రంగా ఏ లోటు లేకుండా చూసుకున్నారు నిర్మాత అశ్వని కుమార్ సహదేవ్.

చివరకు ఏంటి

సినిమా చూస్తూంటే ఏదో కన్నడ సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది. కానీ తెలుగు సినిమా చూస్తున్నట్లు అనిపించలేదు. ఈ మధ్యకాలంలో మాంత్రికుడు, మంత్ర శక్తులు వంటి వాటితో సినిమాలు రావటం లేదు అని లోటు ఫీలయ్యే వారు ఈ సినిమా చూడవచ్చు.

న‌టీన‌టులు: ఆకాశ్‌ కుమార్, మిస్తీ చక్రవర్తి, జయప్రద, నెపోలియన్, నాజర్, పునీత్, తనికెళ్ల భరణి, చరణ్ దీప్ తదితరులు
మాటలు: సాయి మాధవ్ బుర్రా
పాటలు: వేద వ్యాస్, రామ జోగయ్య శాస్త్రి, శ్రీమణి, అనంత శ్రీరామ్
క‌ళ‌: కిరణ్ కుమార్ మన్నె
పోరాటాలు: రామ్- లక్ష్మణ్
ఛాయాగ్ర‌హ‌ణం: రమణ సాల్వ
కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతం: కోటి
నిర్మాత: అశ్వని కుమార్ సహదే
రచన-దర్శకత్వం: నరసింహ రావు
సంస్థ‌: ఎ.కె.ఎస్ ఎంటర్‌టైన్మెంట్
విడుద‌ల‌: 22-11-2018

అత్యంత ప్రజాధారణ

తెలుగురాజ్యం ప్రత్యేకం

తాజా వార్తలు

పవన్ హీరోయిన్ పై ఛీటింగ్ కేసు

అమీషా పటేల్ గుర్తుందా.. అప్పట్లో పవన్ కళ్యాణ్ సరసన “బద్రి”, మహేష్ బాబుకు జతగా నాని సినిమాలో నటించిన బాలీవుడ్ భామ అమీషా పటేల్.   గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ...

బోయపాటి కు బాలయ్య 2 కండీషన్స్..ఒప్పుకుంటేనే సినిమా

సినిమా హిట్ అయితే తదుపరి సినిమాకు ఎన్ని డిమాండ్స్ చేసినా సెలంట్ గా భరిస్తారు నిర్మాత, హీరో. ఎందుకంటే తమకు ఆ రేంజి హిట్ ఇస్తాడనే నమ్మకంతో. అదే ప్లాఫ్ అయితే సీన్...

తల్లికి దాహం తీర్చలేదు గాని పినతల్లికి పట్టు చీరనా?

  (వి. శంకరయ్య)   అన్న దాత సుఖీభవ తంతు ఇలాగే వుంది.        రైతు రుణ మాఫీపథకం దిక్కు మొక్కు లేకుండా పడి వుంది. రెండు కంతులు ఎపుడు ఇస్తారని రైతులు ఎదురు చూస్తుంటే దానిని పట్టించుకోకుండా ‘అన్న...

రిలీజ్ కాకముందే రచ్చ వద్దని వారించిన మోహన్ బాబు

లక్ష్మీస్  ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ అయిన నాటి నుంచీ తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా గురించే చ‌ర్చ న‌డుస్తోందనటంలో అతిశయోక్తి లేదు. వాస్తవానికికి ఎన్టీఆర్ క‌థానాయకుడు విడుద‌లైన‌పుడు కూడా ఇంత‌గా చ‌ర్చ...

‘యన్‌టిఆర్‌ – మహానాయకుడు’ ట్రైలర్

‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు, మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చాను’ అంటూ మహానాయకుడు వచ్చేసాడు.  నటుడు, రాజకీయనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యన్‌టిఆర్‌’....

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు కోటి వ్యూస్..వెనక సీక్రెట్ ఇదే

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం...

రకుల్ రెమ్యునేషన్ ఎంతో తెలుసా?

సిని పరిశ్రమలో లెక్కలు క్రేజ్ ని బట్టే ఉంటాయి. హిట్ పడితే ఓవర్ నైట్ లో రెమ్యునేషన్ రెట్టింపు అవుతుంది. ప్లాఫ్ వస్తే ..అడ్వాన్స్ లు కూడా వెనక్కి తిరిగి ఇచ్చేయమంటారు. అంతా...

రెబెల్ ర్యాపర్ గా రణవీర్ గుర్తుండిపోయే నటన: గల్లీ బాయ్ (మూవీ రివ్యూ)

16.2.19 రివ్యూ స్లమ్ డాగ్ కళా విజయం!  ‘గల్లీబాయ్’ దర్శకత్వం : జోయా అఖ్తర్  తారాగణం : రణవీర్ సింగ్, ఆలియాభట్, కల్కి కొష్లిన్, సిద్ధాంత్ చతుర్వేది, విజయ్ రాజ్, విజయ్ వర్మ, అమృతా సుభాష్ తదితరులు  రచన : జాయా...

తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని ఉరేసుకున్న సాఫ్ట్ వేర్ అమ్మాయి

 హైదరాబాద్ లో దారుణం జరిగింది. మాదాపూర్ లోని అరుణోదయ లేడిస్ హాస్టల్ లో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీవిద్య(25)   శనివారం ఆత్మహత్య కు పాల్పడింది. గదిలో లోపలి నుంచి గడియ పెట్టుకున్న...

జవాన్ల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు 

ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఒక్కో అమర జవాను కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అమరుల త్యాగాలను దేశం ఎప్పటికి గుర్తుంచుకుంటుదని...