fbpx
Home Cinema మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' స్టోరీ లైన్ ఇదా?

మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ స్టోరీ లైన్ ఇదా?

సినిమా ప్రారంభం రోజునే ఈ సినిమా కథ ఫలానా అంటకదా…ఫలానా సినిమాలను కాపీ కొట్టి చేస్తున్నారంటగా అంటూ మీడియాలో వార్తలు వచ్చేస్తున్నాయి. అందులో నిజా నిజాలు ఎంత ఉన్నా, ఎవరికీ నష్టం లేదు కాబట్టి ఆ రూమర్స్ అలా ముందుకు వెళ్తూనే ఉంటాయి. టీమ్ కూడా వీటిని చూసి నిజమైతే షాక్ అవటం , లేకపోతే నవ్వుకోవటం చేస్తూంటుంది. అంతకు మించి ముందుకు వచ్చి స్పందించరు. ఇప్పుడు మహేష్ కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరు కూడా అదే పరిస్దితి నెలకొంది.

మహర్షితో రీసెంట్ గా సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు కొత్త సినిమా ఈ రోజు ప్రారంభమైంది. మహేష్‌ 26వ సినిమాగా డిఫరెంట్‌ మూవీని ఎంచుకున్నాడని తెలుస్తోంది. వరుస హిట్స్ తో సూపర్‌ ఫాంలో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు టైటిల్ తో ఈ సినిమాను ప్రారంభించాడు మహేష్‌. ఈ సినిమా అలా లాంచ్ అయ్యిందో లేదో అప్పుడే ఈ సినిమా కథ ..ఫలానా సినిమానుంచి ప్రేరణ పొందారని వార్తలు వచ్చేసాయి.

ఈ సినిమా కథను ఏవో ఇంగ్లీష్ సినిమాల నుంచి కాకుండా మన పాత తెలుగు చిత్రాలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాసుకున్నట్లు చెప్తున్నారు. అప్పట్లో వెంకటేష్ నటించిన ‘వారసుడొచ్చాడు’, మహేష్ ‘అతడు’ నుంచి కథ తీసుకున్నాడంటున్నారు. ఆ రెండు సినిమాల్లోలాగానే ఈ సినిమాలో హీరో కూడా తనతో కలిసి ఆర్మీలో పని చేసే ఓ స్నేహితుడి ఇంటికి వెళ్లాల్సిన పని పడుతుందిట. ఆ స్నేహితుడు చనిపోయాడనే వార్త చెప్తామని అనుకుంటాడట.

అయితే అక్కడ కొన్ని భాధ్యతలు ఉండటంతో … అక్కడే కొంతకాలం ఉండిపోవాల్సి వస్తుందిట. దాంతో ఆ క్రమంలో తన స్నేహితుడు ఫ్యామిలీకి ఊరుకి సహాయం చేయడం వంటి కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారట. అయితే ఇంత సింపుల్ లైన్ ని మహేష్ కోసం రెడీ చేసారంటే మాత్రం నమ్మబుద్ది కాదని కొందరు అభిమానులు వాదిస్తున్నారు. కానీ ఎఫ్ 2 సినిమా కూడా పాత కథే కదా..కానీ సూపర్ హిట్ కొట్టాడు కదా ..ఇప్పుడు ఇలాగే చేస్తాడని మరికొందరు అంటున్నారు.

ఇక ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఉదయం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఓపెనింగ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

దిల్‌ రాజు, అనిల్‌ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తుండగా యంగ్ సెన్సేషన్‌ రష్మిక మందన్న మహేష్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు.ఈ సినిమాను 2020 సంక్రాంతి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌. సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి కూడా మహేష్ హాజరు కాలేదు.

తెలుగురాజ్యం ప్రత్యేకం

రాయలసీమలో తెలుగుదేశంని ముందుండి నడిపే రెడ్డి ఎవరు?

37 ఏళ్ల సుధీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని చెప్పక తప్పదు. గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా మారిపోయిన టీడీపీ ఇకపై ఎలా ప్రస్థానం కొనసాగిస్తుందోనన్న...

తెలియకుండానే బీజేపీని బలపరుస్తున్న కేసిఆర్?

తెలియకుండానే బీజేపీని బలపరుస్తున్న కేసిఆర్? తెలంగాణ ప్రాంత వాసుల సుదీర్ఘ కల తెలంగాణ రాష్ట్రం. అది 2004 సంవత్సరంలో సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడింది? కెసిఆర్ పోరాటం వలన? లేక కాంగ్రెస్ ఇచ్చిందా??...

మల్టిపుల్ తికమక- ‘గేమ్ ఓవర్’ రివ్యూ

ఈ రెండేళ్లుగా ముల్క్, నీవెవరో, మన్మర్జియా, బద్లా అనే రియలిస్టిక్ సినిమాల్లో మరిన్ని బలమైన పాత్రలు నటించిన తాప్సీ సోలో ప్రయాణం, 2016 లో ‘పింక్’ తో ప్రారంభమయ్యింది. మళ్ళీ ‘పింక్’ లాంటి...

అత్యంత ప్రజాధారణ

తాజా వార్తలు

సీక్రెట్ గా మర్డర్స్ తో శృతిహాసన్ కు వరల్డ్ వైడ్ గా గుర్తింపు

ఇన్నాళ్లూ టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌లో నటిగా సందడి చేసిన శృతిహాసన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ వెబ్‌సిరీస్‌లో నటించబోతున్నారు. అమెరికాకు చెందిన ‘ట్రెడ్‌స్టోన్‌’లో శ్రుతి కీలక పాత్రను పోషించబోతున్నారు. ఇందులో ఆమె వెయిట్రెస్‌గా కనిపిస్తూ సీక్రెట్...

రానా ‘విరాటపర్వం’లీకైన స్టోరీ..ఇంట్రస్టింగ్

రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా పొలిటికల్ థ్రిల్లర్ విరాటపర్వం సినిమా మొదలైన సంగతి తెలిసిందే. నీదీ నాది ఒకటే కథ వంటి డిఫరెంట్ సినిమాతో పరిచయమైన దర్శకుడు వేణు ఊడుగల డైరక్ట్ చేస్తున్న...

రెజీనా కి సీక్రెట్ గా చేసుకోవాల్సిన అవసరం ఏమిటో

స్టార్ హీరోయిన్ రెజీనా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తమిళ చిత్ర పరిశ్రమలో ప్రచారం సాగుతోంది. తమిళనాడుకు చెందిన ఓ నేషనల్‌ న్యూస్‌ మ్యాగజైన్‌ రెజీనా నిశ్చితార్థం గురించి వార్తలు ప్రచురించడం వైరల్‌గా మారింది. ఈ...

తెలుగు టీవి సీరియల్ నటిపై మూకుమ్మడి దాడి

గొలుసు విషయంలో తలెత్తిన ఓ వివాదం టీవీ సీరియల్ నటిపై మూకుమ్మడి దాడికి కారణమైంది. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారనే నెపంతో మాధురిపై కోపం పెంచుకున్న హెయిర్‌ డ్రెసర్‌ జ్యోతిక తన అనుచరులతో...

మూడో ఎంఎల్సీ వైసిపిలో ఎవరికో ?

తొందరలో భర్తీ అయ్యే మూడు ఎంఎల్సీల్లో మూడో అవకాశం ఎవరికి వస్తుందో అన్న సస్పెన్స్ పెరిగిపోతోంది.  మొన్నటి ఎన్నికల్లో ఐదు ఎంఎల్సీ పదవులు ఖాళీ అయ్యాయి. ఇందులో రెండు స్ధానిక సంస్ధలకు చెందినవైతే...

షాకింగ్ : ‘సాహో’ ప్రి రిలీజ్ బిజినెస్

ప్రభాస్ సాహో చిత్రం ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ దగ్గర పడుతుండటంతో.. ప్రీ బిజినెస్ కూడ ఊపందుకుంది. దాదాపు ప్రి రిలీజ్ బిజినెస్ అన్ని ప్రాంతాలకు...

అచ్చెన్నకు గట్టి షాక్ ఇచ్చిన స్పీకర్

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు స్పీకర్ తమ్మినేని సీతారామ్ గట్టి షాకే ఇచ్చారు. ప్రత్యేకహోదా అంశంపై అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నపుడు పదే పదే అచ్చెన్న అడ్డు తగిలేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా స్పీకర్ నే...

స్టార్ హీరో కొడుకుని లాంచ్ చేస్తున్న శేఖర్ కమ్ముల

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయటం చాలా మంది అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఓవర్ నైట్ లో గుర్తింపు వస్తుంది. మినిమం సెన్సిబులిటీస్ తో సినిమా చేస్తారు. రీసెంట్ గా...

చంద్రబాబుకు షాకులిస్తున్న సుజనా

చంద్రబాబునాయుడుకు కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి షాకులిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓటమి తర్వాత బహిరంగంగా చంద్రబాబును తప్పు పట్టిన నేతలు ఎవ్వరూ లేరు. అలాంటిది సుజనా మాత్రం...

బిజెపిలో చేరిన మాజీ ఎంపి..ఎంత కాలం ఉంటారో ?

రాష్ట్రంలో బలపడేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలు కొత్తా గీతతో మొదలైనట్లుంది. అరకు పార్లమెంటు మాజీ సభ్యురాలు కొత్తా గీత బిజెపిలో చేరారు. కేంద్ర హోం శాఖమంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా...
 Nate Gerry Jersey