Home Movie Reviews Telugu Movie Reviews చెలరేగిన చిరంజీవి - 'సైరా' హిస్టారికల్ మూవీ ట్రైలర్ రివ్యూ!

చెలరేగిన చిరంజీవి – ‘సైరా’ హిస్టారికల్ మూవీ ట్రైలర్ రివ్యూ!

చెలరేగిన చిరంజీవి – ‘సైరా’ హిస్టారికల్ మూవీ ట్రైలర్ రివ్యూ!

“స్వాతంత్ర్యం కోసం జరుగుతున్నా తొలి యుద్దమిది. ఈ యుద్ధంలో నువ్వు గెలవాలి!” –గోసాయి ఎంకన్న పాత్రలో అమితాబ్ బచ్చన్.

“నీ గెలుపుని క‌ళ్లారా చూడాల‌ని వ‌చ్చాను సైరా న‌రసింహారెడ్డి” ఇంకో పాత్రధారి కన్నడ కిచ్చా సుదీప్. 

“వీర‌త్వానికి పేరుబ‌డ్డ త‌మిళ భూమి నుంచి వ‌చ్చా. రాముడికి ల‌క్ష్మ‌ణుడి మాదిరి నీ కూడా వుంటాను… అది విజ‌య‌మో, వీర మ‌ర‌ణ‌మో!” ` త‌మిళ యోధుడి పాత్రలో విజ‌య్ సేతుప‌తి.

“ల‌క్ష్మి అనే నా పేరు ముందు న‌ర‌సింహా అనే మీ పేరు ఇవ్వండి” ఇంకో పాత్రలో తమన్నా.

“న‌న్ను మాత్రం విడిచిపెట్ట‌కండి!”- మరో పాత్రలో న‌య‌న‌తార.

ఇలా మల్టీ స్టారర్ హిస్టారికల్ మూవీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న’సైరా’ ట్రైలర్ లో వివిధ భాషల తారలు కనువిందు చేస్తున్నారు, భావోద్వేగాలు నింపుతున్నారు, స్వాతంత్ర్య పోరాటపు ఘట్టంలో భాగస్వాములవుతున్నారు.

“భార‌త మాత కీ జై!” అని నినదిస్తూ యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి దూసుకురావడం…తెల్ల దొరల సైన్యాలతో భీకర పోరాట దృశ్యాలు మొదలుకావడం…కాల్పులు, పేలుళ్లుతో దద్దరిల్లడం!

చిరంజీవిని గొలుసుల‌తో బంధించి బ్రిటీష్ సైన్యాలు తీసుకుని వస్తూంటే, “న‌ర‌సింహారెడ్డి సామాన్యుడు కాడు, అత‌ను కార‌ణ‌జ‌న్ముడు!” అని కంఠం ఖంగుమనడం.

చిరంజీవి శివ పూజ చేస్తూంటే, “అత‌నొక యోగి. అత‌నొక యోధుడు. అతన్నెవ్వరూ ఆప‌లేరు!” అని వీరత్వాన్ని ప్రకటించడం.

“ఈ భూమ్మీద పుట్టింది మేము, ఈ మ‌ట్టిలో క‌లిసేది మేము, మీకెందుకు క‌ట్టాలిరా శిస్తు?” అని బ్రిటీష్ అధికారి మీద చిరంజీవి తిరగబడే దృశ్యం.

న‌ర‌సింహారెడ్డి అచూకీ చెప్ప‌నందుకు తెల్ల దొరలు స్థానికుల్ని తుపాకుల‌తో కాల్చే దృశ్యాలు.

ఆఖరికి చిరంజీవి, “స్వేచ్ఛ కోసం ప్ర‌జ‌లు చేస్తున్న తిరుగుబాటు! నా భ‌ర‌త‌మాత గ‌డ్డ‌మీద నిల‌బ‌డి హెచ్చరిస్తున్నా! నా దేశం వ‌దిలి వెళ్లిపోండి లేదా…యుద్ధ‌మే!!” అని యుద్ధ నాదం చేసి కదనరంగంలోంకి దూకే భీకర దృశ్యాలు.

“చివ‌రి కోరికేమైనా వుంటే ఓ వాక్యంలో చెప్పు!” అని తెల్ల వాడు అడిగితే, “గెట్ అవుట్ ఫ్ర‌మ్ మై మ‌ద‌ర్ ల్యాండ్!” అంటూ చిరంజీవి ఆజ్ఞాపించే దృశ్యంతో ట్రైలర్ ముగింపు.

ఇలా ట్రైలర్ క్షణం క్షణం మండుతున్న అగ్ని గోళంలా వుంది. అవుట్ డోర్ లొకేషన్స్ లో హైటెక్ యాక్షన్ సీన్స్. గ్రాఫిక్ విన్యాసాలు. రక్త పాతాలు. వీర మరణాలు.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ‘సైరా’ మూడు నిమిషాల ట్రైలర్ స్వాతంత్ర్య పోరాట చిత్రాల్లో నూతన వొరవడిని లిఖిస్తోంది…నటనలు, దర్శకత్వం, రచనల పరంగా. అక్టోబ‌ర్ 2న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా విడుద‌ల‌వుతోంది.

 

Featured Posts

All cardholders will get ration

Lambasting TDP party for playing cheap politics during the tough time of COVID 19 pandemic, Minister's for Civil Supplies Kodali Venkateswara Rao (Nani) emphasized...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

షాకింగ్‌…. క‌ర్ఫ్యూ మొత్తం 21 రోజులు… క‌రోనా క‌ట్ట‌డికి ఇదే మార్గం..!

వేలాది మందిని నిలువునా పొట్ట‌పెట్టుకుంటున్న క‌రోనా దెబ్బకు ప్ర‌పంచం మొత్తం మూత‌బ‌డుతోంది. దేశ దేశాల‌న్నీ విధిలేక క‌ర్ఫ్యూ విధిస్తున్నాయి. భార‌త్‌లో ఇప్ప‌టికే వారం రోజుల పాటు పూర్తిగా ర‌వాణా నిలిపివేశారు. దాదాపు 75...

Recent Posts

హీరోల పెళ్లిళ్లే కాదు అంద‌రి పెళ్లిళ్లు వాయిదా!

పెళ్లి వేడుక అంటే సామూహికంగా జ‌రిగేది. బంధుమిత్రులు బంధాలు అనుబంధాలు అన్నిటికీ ఇదో వేదిక‌. అంతేకాదు ఇప్పుడున్న ప‌రిస్థితిలో పెళ్లి చేసుకోవ‌డం అంటే పెను ప్ర‌మాదంతో పెట్టుకున్న‌ట్టే. కోరి ముప్పు కొని తెచ్చుకున్న‌ట్టే....

ర‌చ్చకెక్కి హ‌ద్దులు దాటుతున్న మహేష్ ఫ్యాన్స్‌!

టాలీవుడ్‌లో ఒక హీరో సినిమా రిలీజ్ అవుతోంటే మ‌రో హీరో ఫ్యాన్స్ చేసే ర‌చ్చ ఈ మ‌ధ్య తారా స్థాయికి చేరుతోంది. ఈ సంక్రాంతికి ఇద్ద‌రు స్టార్ హీరోలు మ‌హేష్ నటించిన `సరిలేరు...

`పోకిరి` హాట్ గాళ్ ర‌చ్చ‌స్య ర‌చ్చ‌భ్య‌హ‌!

2006లో వ‌చ్చిన ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్ `పోకిరి`. డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం మ‌హేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో టాలీవుడ్‌కి...

ఆ పాత్ర మాకు వ‌ద్దంటే వ‌ద్దు బాబోయ్‌ అంటున్న బాలకృష్ణ, జూ ఎన్టీఆర్?

టాలీవుడ్‌లో ఓ పాత్ర చేయ‌మ‌ని అడిగితే మాకు వ‌ద్దంటే వ‌ద్దు బాబోయ్ అంటూ నంద‌మూరీ హీరోలు పారిపోతున్నారు. అదేంటి? క‌్యారెక్ట‌ర్ చేయ‌మంటే పారిపోవ‌డం ఏంట‌ని ఆరాతీస్తే షాకింగ్ విష‌యం ఒక‌టి బ‌య‌టికొచ్చింది. నంద‌మూరి...

56 మంది జీవితాల్ని రిస్క్‌లో పెట్టిన పృథ్వీరాజ్‌!

క‌రోనా దెబ్బ‌కు ప్ర‌పంచం క‌కావిక‌లం అయిపోతోంది. దీని ధాటికి దేశాల‌న్నీ లాక్ డౌన్ ప్ర‌క‌టించాయి. దీంతో ఎక్క‌డి వారు అక్క‌డే బ్లాక్ అయిపోయారు. ఒక దేశం నుంచి మ‌రో దేశం వెళ్లాలంటే అంత‌ర్జాతీయ...

శ్రీ‌రెడ్డి మాట‌ల్లో అర్థం అదేనా?

శ్రీ‌రెడ్డి ప‌చ్చిగా స్పందించ‌డంలో నెంబ‌ర్ వ‌న్‌. త‌న‌కు ఏది అనిపిస్తే అది.. లైవ్ అని కూడా చూడ‌కుండా ప‌చ్చి బూతులు మాట్లాడ‌టం శ్రీ‌రెడ్డి స్టైల్‌. త‌న‌తో మాట్లాడాల‌న్నా.. త‌న టాపిక్ తీయాల‌న్నా సెల‌బ్రిటీలు...

క‌రోనా : స‌న్నాయి నొక్కులొద్దు..డొనేష‌న్ ముద్దు

క‌రోనా దెబ్బ‌కి ప్ర‌పంచ దేశాల సంగ‌తి ప‌క్క‌నబెడితే!భార‌త్ ప‌రిస్థితి త‌లుచుకుంటే! ఊపిరాగినంత ప‌నౌవుతుంది. రోజు రోజు కి క‌రోనా కేసుల సంఖ్య అమాంతం ఊహించ‌ని విధంగా పెరిగిపోతుంది. ఇక తెలుగు రాష్ర్టాల్లో అంత‌కంత‌కు...

వార్ డిక్లేర్ చేసిన జొన్నవిత్తుల!

ఆర్జీవికి ర‌చ‌యిత జొన్న‌విత్తులకు మ‌ధ్య కొన్ని రోజుల క్రితం మాట యుద్ధం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆర్జీవి హ‌ద్దులు ద‌టి జొన్న‌విత్తుల‌ని ఓ జోక‌ర్‌లా ట్రీట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...

కరోనాని అప్ప‌నంగా వాడేస్తున్న విల‌న్

కరోనా వైర‌స్ ని కొంత మంది సెల‌బ్రిటీలు ప్ర‌చారం కోసం ఓ రేంజ్ లో ఉప‌యోగించేస్తున్నారు. సీరియ‌స్ గా కొవిడ్ -19పై ఫైట్ చేసేవారు కొంద‌రైతే... టిక్ టాక్ వీడియోల‌తో పాపుల‌ర్ అవుతోన్న...

క‌రోనాని రామ్‌గోపాల్‌వ‌ర్మ కూడా వ‌ద‌ల‌డం లేదు!

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న భ‌యంక‌ర‌మైన వైర‌స్ క‌రోనా.. ప్ర‌పంచం మొత్తంలో దీని భారి నుంచి త‌ప్పుంచుకోని దేశం అంటూ లేదు. ఒక్క క్యూబా త‌ప్ప‌. మ‌న దేశంలో దీని అల‌జ‌డి ఇప్పుడిప్పుడే మొద‌లైంది. వేళ‌ల్లో...