Home Movie Reviews Telugu Movie Reviews అదే పాత చట్రం - 'సాహో' స్క్రీన్ ప్లే విశ్లేషణ!

అదే పాత చట్రం – ‘సాహో’ స్క్రీన్ ప్లే విశ్లేషణ!

ఆఖరికి 350 కోట్ల అతి ఖరీదైన నాలుగు భాషల పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ని కూడా, అదే లోకల్ తెలుగు లైటర్ వీన్ ప్రేమ కథల ఫార్ములా (ఎల్పీ ఎఫ్) చట్రంలో పెట్టేశారు! పాన్ ఇండియా అన్నాక గ్లోబల్ స్క్రిప్టు వుండాలని ఆలోచించలేదు. గత ఇరవై ఏళ్లుగా ఈ ఎల్పీఎఫ్ చట్రమే తెలుగు సినిమాలకి ఎన్నోసార్లు చుక్కలు చూపించింది…ఏ తెలుగు సినిమా తలపెట్టినా దాని జానర్ ని పట్టించుకోకుండా ఏనాటిదో లైటర్ వీన్ ప్రేమ కథల ఫార్ములా చట్రంలో చుట్టేయడమే. అప్పట్లో ఏ కథ చేస్తున్నారంటే, ‘లైటర్ వీన్’ అనడం ఫ్యాషన్ గా మారింది. ఈ ఎల్పీ ఎఫ్ సినిమాలే చూస్తూ పెరిగిన తరం కూడా అవే తీస్తూ, ఏ కథ చేస్తున్నారంటే, ‘రోమ్ కాం’ అని మరింత ఫ్యాషనబుల్ గా అనడం మొదలెట్టారు. ఏవి చూస్తూ పెరిగితే అవే తీస్తారు. ఇంకాస్తా పోయాక వరల్డ్ మూవీస్ మీద మోజు కూడా పెంచుకున్నారు కాబట్టి, వాటినీ ఎల్పీఎఫ్ తో కలిపి తీసేస్తారు. ఇవి తప్ప ఇంకో ప్రపంచం, సొంత ప్రతిభ లేనట్టే వుంటుంది. 2000 – 2005 మధ్యకాలంలో వేలం వెర్రిగా వచ్చిపడ్డ ఎల్పీ ఎఫ్ సినిమాల ప్రభావంతో ఇంకా అదే చట్రంలో స్టార్ సినిమాలు కూడా తీస్తూ, ఇంకా చిన్నా చితకా రోమాంటిక్ కామెడీలూ తీస్తూ, ఇప్పటికీ 90 శాతం అట్టర్ ఫ్లాపుల జాబితాని విజయవంతంగా నిలబెట్టుకుంటున్నారు.

‘సాహో’ – ‘లార్గో వించ్’ కాపీ అంటూ హల్చల్ చేయడం అనవసరం. గాడ్ ఫాదర్ ని బైబిల్ లా పెట్టుకుని 100 సినిమాలు తీశారు. హమ్ ఆప్కే హై కౌన్ ని రాజ్యాంగంలా పెట్టుకుని 200 సినిమాలు తీశారు. సమరసింహా రెడ్డిని భగవద్గీతలా కళ్ళకద్దుకుని 300 సినిమాలు తీశారు. అంతర్జాతీయ మీడియా 1.5 రేటింగులిచ్చిన లార్గో వించ్ అనే వరల్డ్ మూవీని తీసుకుని, తెలుగులో ఓ రెండు తీస్తే కొంపలేం మునిగిపోవు.

కొంపలు మునిగింది తీసిన విధానంతో. ఇది లేజర్ స్కానింగ్ లో బయటపడే విషయం. ఆఖరికి ఈ ఎల్పీ ఎఫ్ చట్రంలో ప్రసిద్ధ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో, సింగీతం శ్రీనివాసరావు లాంటి సీనియర్ దర్శకుడు కూడా ‘విజయం’ (2003) అనే రోమాంటిక్ కామెడీ తీసి దెబ్బతిన్నారు. ఎల్పీ ఎఫ్ చట్రంలో కథనేది వుండదు, కాలక్షేపమే వుంటుంది. కాలక్షేపం సాగి సాగి, సినిమా చివర ఎక్కడో పిసరంత కథ వుండి చప్పున ముగిసిపోతుంది. దీన్నే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అంటాం. స్ట్రక్చర్ అంటే గిట్టని వాళ్లకి ఈ సాంకేతికం తెలిసే అవకాశం లేదు. దీంతో పరాకాష్టకి పోయి షాకింగ్ గా ఇప్పుడు చేసిందేమిటంటే, ‘సాహో’ లాంటి భారీ మాఫియా పోరాటాల కథకి కూడా దీంతోనే పాల్పడ్డం! పిట్ట ప్రాణాన్ని గరుత్మంతుడులో పోయాలనుకోవడం!

ఈ పిట్ట ప్రాణం ఎక్కడిది? 2014 లో దర్శకుడి తొలిప్రయత్నం ‘రన్ రాజా రన్’ లోనిదే. ఇందులో వాడిన ఎల్పీ ఎఫ్ చట్రంలోనే ‘లార్గో వించ్’ ని దింపితే, అదికాస్తా ‘సాహో’ అనే శాండ్ విచ్ గా తయారయ్యింది – స్టఫ్ లేని మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేతో.

‘సాహో’ కేవలం భారీ యాక్షన్ థ్రిల్లరేనా? కాదు, ఇంత భారీ స్థాయిలో యాక్షన్ థ్రిల్లర్ తలపెడితే హై కాన్సెప్ట్ మూవీస్ వర్గంలో చేరుతుంది. హై కాన్సెప్ట్ జానర్ మర్యాదలు ఒనగూడుతాయి. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోలేదు. మురగదాస్ సాధారణ సైకో థ్రిల్లర్ ‘స్పైడర్’ కథకి, క్లయిమాక్స్ లో హై కాన్సెప్ట్ జానర్ దృశ్యాలు అతికించినట్టు, సుజీత్ హై కాన్సెప్ట్ యాక్షన్ థ్రిల్లర్ కి లో- కాన్సెప్ట్ కథనం చేశాడు, అదీ మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేతో. ‘రన్ రాజా రన్’ మిడిల్ మటాష్ తో ఆడిందంటే తెలిసో తెలీకో సీన్ రివర్సల్ టెక్నిక్ తో కథనం చేయడం వల్ల. ‘సాహో’ లో మిడిల్ మటాష్ కి ఈ టెక్నిక్ బదులు, ట్విస్టుల మీద ట్విస్టులతో కథనం చేశాడు. ఇది బెడిసి కొట్టింది.

బిగినింగ్ కథనం
వాజీ ఆనే కాల్పనిక నగరంలో పృథ్వీ రాజ్ అనే అతను అండర్ వరల్డ్ సామ్రాజ్యాధిపతి. ఇతను కొడుకు దేవరాజ్ ని వారసుడుగా చేయాలనుకుంటాడు. అయితే పృథ్వీ రాజ్ కి పోటీగా పృథ్వీ రాజ్ చేరదీసిన నరాంతక్ రాయ్, ఇంకో క్రైం సిండికేట్ నడుపుతూంటాడు. దీంతో పృథ్వీరాజ్ కొడుకు దేవరాజ్, రాయ్ మీద పగ పెంచుకుంటాడు. రాయ్ ముంబాయి వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఇంకోచోట రెండు లక్షల కోట్లతో వస్తున్న నౌక సముద్రంలో పేలిపోతుంది. ఇప్పుడు రాయ్ కొడుకు విశ్వాంక్ క్రైం సిండికేట్ ని చేపట్టి, పోయిన రెండు లక్షల కోట్లని రెండు వారాల్లో తెస్తానని, అలాగే తండ్రిని చంపిన వాళ్ళని పట్టుకుని శిక్షిస్తాననీ శపథం చేస్తాడు.

ఇంతలో ముంబాయిలో వేరే రెండు వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంది. ఈ కేసుని ఛేదించడానికి అండర్ కవర్ పోలీసుగా అశోక్ చక్రవర్తి (హీరో) వస్తాడు. ఇతడికి సాయంగా క్రైం బ్రాంచ్ పోలీసు అమృత (హీరోయిన్) వస్తుంది. చక్రవర్తి ఈమెతో ప్రేమలో పడి ఈమె ప్రేమ పొందేందుకు వెంటబడుతూంటాడు. వీళ్ళ దర్యాప్తులో ఒక వ్యక్తి అనుమానితుడిగా దృష్టికొస్తాడు. అతడి దగ్గర కూపీ లాగితే, ఒక బ్లాక్ బాక్స్ వుందనీ, అది చిక్కితే రెండు లక్షల కోట్లు సొంతమవుతాయనీ తెలుస్తుంది.

ఈ బ్లాక్ బాక్స్ కోసం విశ్వాంక్ దగ్గర పని చేసే లీగల్ అడ్వైజర్ కల్కి వెళ్తున్నప్పుడు ఆమె మీద దాడి జరుగుతుంది. ఇంతలో అశోక్ చక్రవర్తి పోలీస్ అండర్ కవర్ కాదనీ, అతను దొంగ అనీ, రెండు వేల కోట్లు అతనే కొట్టేశాడనీ, అసలు అశోక్ చక్రవర్తి ఆ అనుమానిత వ్యక్తే ననీ, అతను పోలీసు అనీ, పోలీసులకి తెలుస్తుంది.

ఇప్పుడు అశోక్ చక్రవర్తిగా నటిస్తున్న హీరో, ఆ బ్లాక్ బాక్స్ ని చేజిక్కించుకుని తన పేరు సాహో అని చెప్పి పారిపోతాడు. విశ్రాంతి.

బిగినింగ్ కథనం కంటిన్యూ
పైన చెప్పుకున్న ఫస్టాఫ్ 50 వ నిమిషంలో, బ్లాక్ బాక్స్ అనే క్లూతో, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడి, బిగినింగ్ ముగిశాక, సెకండాఫ్ లో ఇంకా బిగినింగ్ కథనం కంటిన్యూ ఏమిటి? ఇక ఆ బ్లాక్ బాక్స్ ని చేజిక్కించుకునే సంఘర్షణతో కథపుట్టి, ప్రారంభమయ్యాక, మిడిల్లో పడ్డాక, మిడిల్ మలుపుగా విశ్రాంతిలో హీరో తను సాహో అంటూ రివీల్ చేశాక, ఇంకా బిగినింగ్ కథనం కంటిన్యూ అనడమేమిటి?

సాధారణంగా మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయితే ఆ సంగతి ఇంటర్వెల్ కల్లా తెలిసిపోతుంది, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడక పోతే. ఇక ప్లాట్ పాయింట్ వన్ సెకండాఫ్ లో ఎక్కడో ప్లాట్ పాయింట్ టూ దగ్గర ఏర్పడి, అక్కడి ప్లాట్ పాయింట్ టూని ఎండ్ లోకి జరిపేస్తుందని, అక్కడే కథ ప్రారంభమవుతుందని తెలిసిపోతుంది. అంటే ఇంత సేపూ బిగినింగే కథలేకుండా, ఉపోద్ఘాతం రూపంలో హద్దులు దాటి సాగుతుందన్న మాట ముప్పావు వంతు సినిమా వరకూ.

అప్పుడు చివరి పావు వంతులో బిగినింగ్ ముగిసి, ప్లాట్ పాయింట్ తో కథ ప్రారంభమైతే, అంటే మిడిల్ ప్రారంభమైతే, ఆ మిగిలిన పావు వంతు సినిమాని అది ఎండ్ విభాగంతో, అంటే క్లయిమాక్స్ తో కలిసి పంచుకోవాలన్న మాట. ఇది పదో, పదిహేనో నిమిషాలు మాత్రమే వుంటుంది. అంటే ఓ రెండు గంటల సినిమాలో దాదాపు సగం, అంటే గంట పాటు వుండాల్సిన మిడిల్ – అంటే కథ అనే పదార్ధం – ఇలా కొన్నినిమిషాలకి కుదించుకుపోవడంతో, మిడిల్ అనగా కథ అనే అమృతకలశం మటాష్ అయినట్టు అర్ధం.

పావుగంట అత్తెసరు కథ కోసం గంటన్నర పిప్పి చూస్తూ కూర్చోవాలన్నమాట. ఇదే ఎల్పీ ఎఫ్ తడాఖా అంటే. లీనియర్ కథలతో పాల్పడే అనౌచిత్యం. అప్పట్లో తేజ ఒక్కరే ప్రేమకథల్ని త్రీ యాక్ట్ స్ట్రక్చర్లో చేసే వారు. అంటే ఫస్టాఫ్ సగంలో కథ ప్రారంభమై పోయేది. ఆ సినిమాలు బలంగా వుండేవి. ఇతరులంతా మిడిల్ మటాషులే. కథంటే భయపడిపోయే వాళ్ళు. అమ్మో అంత కథా…సరదా సరదాగా అలా అలా నడిపి, క్లయిమాక్స్ లో లవర్స్ కి లైట్ ప్రాబ్లం పెట్టి తీర్చేస్తే చాలనే వాళ్ళే. ఇదే తర్వాత వివిధ రూపాల్లో స్టార్ సినిమాలకీ అంటించారు. 

రెగ్యులర్ నాన్ లీనియర్
లీనియర్ కథల మిడిల్ మటాష్ అనౌచిత్యం ఇలావుంటే, ఇక నాన్ లీనియర్ తో కూడా మిడిల్ మటాష్ కి పాల్పడతారని ‘సాహో’ చూశాకే తెలుస్తోంది. మామూలుగా రెగ్యులర్ గా వుండే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఎలావుంటుందంటే, ‘ఖైదీ’ నే ఉదాహరణగా తీసుకుంటే, ప్రారంభంలోనే పోలీసులు అనుమానితుడిగా చిరంజీవిని పట్టుకుంటారు. దీంతో మనకి క్లియర్ గా అర్ధమైపోతుంది – ఈ స్క్రీన్ ప్లే బిగింనింగ్ విభాగంతో ప్రారంభం కావడం లేదనీ, చిరంజీవి ఏదో స్ట్రగుల్ తో వున్నాడంటే, ఆ స్ట్రగుల్ బిజినెస్ తో వుండే మిడిల్ – 1 తో స్క్రీన్ ప్లే ప్రారంభమైందనీ.

ఈ మిడిల్ – 1 కొంత నడిచాక, చిరంజీవి ఇలా స్ట్రగుల్ తో వుండడంలోని పూర్వాపరాల కథనంతో బిగినింగ్ విభాగం ప్రారంభమవుతుంది. అంటే ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. ఈ ఫ్లాష్ బ్యాక్ లో చిరంజీవి స్ట్రగుల్ చేయడానికి తలెత్తిన పరిస్థితులేమిటో తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ బిగినింగ్ విభాగం బిజినెస్, లేదా ఫ్లాష్ బ్యాక్ ముగిసే చోట, ప్లాట్ పాయింట్ – 1 ఏర్పడి, చిరంజీవికి గోల్ ఏర్పాటు కావడాన్ని చూస్తాం. ఇక్కడ్నించీ తిరిగి ముందాపిన మిడిల్ -1 బిజినెస్ కొచ్చి, అక్కడ్నించీ మిడిల్ -2 బిజినెస్ ని లేదా తీవ్రతరమైన స్ట్రగుల్ ని చూస్తాం. దీని చివర కొచ్చి ప్లాట్ పాయింట్ -2 చూసి, ఇక ఎండ్ విభాగంలో కెళ్ళిపోతాం.

ఇదీ సర్వ సాధారణంగా వుండే రెగ్యులర్ నాన్ లీనియర్ కథనపు ఏర్పాటు. మిడిల్ -1, బిగినింగ్, మిడిల్ -2, ఎండ్, ఇంతే. ఈ రెగ్యులర్ నాన్ లీనియర్ కథనంలో, స్క్రీన్ ప్లే మిడిల్ -1 తో ప్రారంభమయిందని పైన చెప్పుకున్న విధంగా వెంటనే తెలిసిపోతుంది. ఇందులో మిడిల్ మటాష్ అవదు. అది స్క్రీన్ ప్లేలో వుండాల్సిన సగభాగమూ వుంటుంది.

నాన్ రెగ్యులర్ నాన్ లీనియర్
ఇక రెండోది, నాన్ రెగ్యులర్ నాన్ లీనియర్ కథనం వుంటుంది : దీన్ని ఫ్యాక్షన్ సినిమాల్లో చూస్తాం. వీటిలో మిడిల్ -1 తోనే స్క్రీన్ ప్లే ప్రారంభమైనా, ఈ విషయం మనకి తెలీకుండా వుంటుంది. బిగినింగ్ బిజినెస్ లాగే వుంటుంది. దీని ప్లాట్ పాయింట్ -1 కోసం చూస్తూంటే, ఇంటర్వెల్లో బాలకృష్ణ ఇంకో స్వరూపం బయట పడుతుంది. ఈ బాలకృష్ణ ఈ బాలకృష్ణ కాదనీ, వేరే బాలకృష్ణ వున్నాడనీ, వేరే ఫ్యాక్షన్ నేపథ్యముందనీ తెలుసుకుంటాం. దీంతో ఫస్టాఫ్ లో చూసిందంతా అసలు బిగినింగ్ కాదనీ, మిడిల్ -1 అనీ ఇప్పుడు తెలుసుకుంటాం. ఎందుకంటే ప్లాట్ పాయింట్ -1 రావాల్సిన చోట ఇంటర్వెల్లో బిగినింగ్ ప్రారంభమైంది కాబట్టి.

అంటే బాలకృష్ణ అసలెవరో తెలుసుకునే పూర్వపరాల బిజినెస్ తో ఇప్పుడు బిగినింగ్ వచ్చింది. దీంతో సెకండాఫ్ ప్రారంభంకాగానే బాలకృష్ణ రాయలసీమ జీవితం, గొడవలు, వూరు వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితులతో ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. ఈ ఫ్లాష్ బ్యాక్ ముగియగానే తిరిగి ఇంటర్వెల్లో ఆపిన చోటికొస్తాం. ఇప్పుడు బాలకృష్ణకి వూళ్ళో తలెత్తిన పరిస్థతుల దృష్ట్యా వెంటనే పరిష్కరించాల్సిన గోల్ ఏర్పడి బయల్దేరడంతో, ప్లాట్ పాయింట్ -1 ని చూస్తాం. ఇక్కడ్నించీ మిడిల్ -2 ని చూస్తూ, దాని చివర ప్లాట్ పాయింట్ -2 మీదుగా ఎండ్ వగైరా చూసుకుంటూ వెళ్లి పోతాం.

ఈ నాన్ రెగ్యులర్ నాన్ లీనియర్ ఏర్పాటులో మిడిల్ -1 , బిగినింగ్, ప్లాట్ పాయింట్ -1, మిడిల్, ఎండ్ – ఈ విధంగా కథనం సాగుతుంది. ప్లాట్ పాయింట్ -1 ని సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక చూస్తాం. ఇలా సాగినప్పటికీ స్క్రీన్ ప్లే మిడిల్ -1 తో ప్రారంభమైనట్టు దృశ్యాలుండవు, బిగినింగ్ దృశ్యాల్లాగే వుండి బిగినింగే చూస్తున్నామనుకుంటాం. ఇందులో మిడిల్ మటాష్ అవదు.

(రేపు ‘సాహో’ ఆవిష్కారం)

-సికిందర్ 

Recent Posts

రాజకీయ ప్రయోజనమే బిజెపి ప్రధాన లక్ష్యం?

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తర్వాత బిజెపి విధానాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో కూడా పలు సందర్భాల్లో అధికారంలో వున్నది వాజ్ పాయ్...

విశాఖ సంఘటన ద్వారా బాబు ఏమి చెప్పదలచుకున్నారు?

చంద్రబాబు నాయుడును విశాఖలో అడుగు పెట్టకుండా నిరోధించడంలో వైసిపి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించింది. విమానాశ్రయం వద్ద టిడిపి శ్రేణులను ఆత్మరక్షణలో పడేసింది. ఇందుకు పోలీసులు పూర్తి సహకారం ఇచ్చిన అంశం పక్కన...

చిరు – వినాయ‌క్ మ‌ళ్లీ క‌లుస్తున్నారా?

రీమేక్ సినిమాతో ప‌దేళ్ల త‌రువాత రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మ‌రోసారి రీమేక్ చిత్రాన్నే ఎంచుకున్నారు. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ హీరోగా హీరో పృథ్విరాజ్ కుమార‌న్ డైరెక్ట్ చేసిన చిత్రం `లూసీఫ‌ర్‌`. ఈ చితత్రాన్ని...

మ‌హేష్‌ – ప‌ర‌శురామ్ మూవీకి మైత్రీ దెబ్బ‌?

మ‌హేష్ - ప‌ర‌శురామ్ మూవీకి మైత్రీ మూవీమేక‌ర్స్ పెద్ద అడ్డంకిగా మార‌బోతోందా? అంటే నిజ‌మే అని ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయాల‌నుకున్న మ‌హేష్ త‌ను చెప్పిన క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆ...

రాజ‌మౌళి హాలీవుడ్‌..క్రిష్ బాలీవుడ్‌!

`ఆర్ ఆర్ ఆర్` చిత్రం కోసం రాజ‌మౌళి హాలీవుడ్ స్టార్స్‌ని దించేస్తే క్రిష్ ప‌వ‌న్ కోసం బాలీవుడ్ స్టార్‌ల‌ని దించేస్తున్నాడు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో క్రిష్ ఓ పిరియాడిక్ చిత్రాన్ని తెర‌పైకి తీసుకొస్తున్న విష‌యం...

కమల్‌కు లైకా ఆర్డర్ పాస్ చేస్తోందా?

`ఇండియ‌న్ 2` షూటింగ్ సంద‌ర్భంగా ఏర్ప‌డిన ప్ర‌మాదం చిలికి చిలికి క‌మ‌ల్ - లైకా మ‌ధ్య ఈగో వార్‌గా మారుతున్నట్టే క‌నిపిస్తోంది. ఈ సినిమా కోసం చెన్నైలోని ఓ స్టూడియో లో వేసిన...

సందీప్ వంగ‌కు ప్ర‌భాస్ షాకిచ్చిన‌ట్టేనా?

`అర్జున్‌రెడ్డి`తో టాలీవుడ్‌కు ఓ గేమ్ ఛేంజ‌ర్ లాంటి చిత్రాన్ని అందించి సంచ‌ల‌నం సృష్టించాడు సందీప్ వంగ. ఈ సినిమా త‌రువాత ప్ర‌తి స్టార్ హీరోకి ద‌గ్గ‌ర‌య్యారు. `అర్జున్‌రెడ్డి` టేకింగ్, మేకింగ్ ప్ర‌తీ హీరోనీ...

విశాఖ టిడిపి నేతలు ద్రోహులైతే మరి కోస్తా వైసీపీ నేతలు?

రాష్ట్రంలో ప్రాంతీయ వాదం వెర్రిముండ తలలాగా పిచ్చెక్కిపోతోంది. భావోద్వేగాలపై రాజకీయం చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం ప్రాంతీయ అసమానతలు నివారించాలని ముందుగా పరిపాలన వికేంద్రీకరణకు పూనుకున్నది. అందుకు ప్రాతిపదికగా మూడు రాజధానుల ప్రతి పాదన...

ఢిల్లీ విశాఖ నగరాల్లో బలిపశువులైన పోలీసు యంత్రాంగం

పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో ఏ మాత్రం స్లిప్ అయినా నష్టపోయేది పోలీసులే వెనుక వుండి నడిపించిన అధికార పార్టీల నేతలు సేఫ్ గా వుంటారు. తుదకు న్యాయస్థానాల ముందు పోలీసులు...

వెంకీ స్టోరీ మాస్ రాజా ద‌గ్గ‌రికి!

ఒక హీరో కోసం అనుకున్న క‌థ అక్క‌డ వ‌ర్క‌వుట్ కాక‌పోతే వెంట‌నే మ‌రో హీరో ద‌గ్గ‌రికి వెళ్ల‌డం ఇండ‌స్ట్రీలో వెరీ కామ‌న్‌. అలా చేతులు మారిన క‌థ‌లు కొంత మందికి బ్లాక్ బ‌స్ట‌ర్‌ల‌ని,...

Featured Posts

`హిట్‌` మూవీ రివ్యూ

న‌టీన‌టులు: విశ్వ‌క్‌సేన్‌, రుహానీ శ‌ర్మ‌, ముర‌ళీ శ‌ర్మ‌, భానుచంద‌ర్‌, హ‌రితేజ త‌దిత‌రులు న‌టించారు. ద‌ర్శ‌క‌త్వం: శైలేష్ కొల‌ను నిర్మాత : ప్ర‌శాంతి త్రిపుర‌నేని సంగీతం: వివేక్ సాగ‌ర్‌ సినిమాటోగ్ర‌ఫి: మ‌ణికంద‌న్‌ ఎడిట‌ర్ : గ‌్యారీ బీహెచ్‌ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ: వాల్‌పోస్ట‌ర్ సినిమా రిలీజ్...

విశాఖ సంఘటన ద్వారా బాబు ఏమి చెప్పదలచుకున్నారు?

చంద్రబాబు నాయుడును విశాఖలో అడుగు పెట్టకుండా నిరోధించడంలో వైసిపి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించింది. విమానాశ్రయం వద్ద టిడిపి శ్రేణులను ఆత్మరక్షణలో పడేసింది. ఇందుకు పోలీసులు పూర్తి సహకారం ఇచ్చిన అంశం పక్కన...

ఢిల్లీ విశాఖ నగరాల్లో బలిపశువులైన పోలీసు యంత్రాంగం

పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో ఏ మాత్రం స్లిప్ అయినా నష్టపోయేది పోలీసులే వెనుక వుండి నడిపించిన అధికార పార్టీల నేతలు సేఫ్ గా వుంటారు. తుదకు న్యాయస్థానాల ముందు పోలీసులు...