Home Movie Reviews ఓల్డ్ లవ్వు -'రాయల సీమ లవ్ స్టోరీ' - ట్రైలర్ రివ్యూ!

ఓల్డ్ లవ్వు -‘రాయల సీమ లవ్ స్టోరీ’ – ట్రైలర్ రివ్యూ!

ఓల్డ్ లవ్వు – ‘రాయల సీమ లవ్ స్టోరీ’ ట్రైలర్ రివ్యూ!

ఏ వన్ ఎంటర్ టైన్ మెంట్స్ మూవీస్ పతాకంపై రామ్ రణధీర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పంచ లింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా – నాగరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ”రాయలసీమ లవ్ స్టోరీ ”. ట్రైలర్ విదుదలయింది. వెంకట్, హృశాలి గోసవి లని హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ ట్రైలర్ పాత రొటీన్ గా వుంది. కాలేజీలో హీరో హీరోయిన్ల లవ్, విలనిజం… విలన్ తో ఫైట్. కొత్త హీరో హీరోయిన్లు గ్లామరస్ గా లేరు. ప్రేమ సన్నివేశాల్లో సున్నితత్వం లేదు. గట్టిగా అరిచి అతను ఐ లవ్యూ చెప్పడం, ఆమె కూడా అరుస్తూనే చెప్పడం లాంటి బండ టైపులో వున్నాయి. పాత విషయాన్ని కొన్ని బోల్డ్ అర్ధనగ్న దృశ్యాలతో కవర్ చేశారు. 

టైటిల్ బి గ్రేడ్ గా వుండడం ఈ మూవీ క్వాలిటీని చెప్తోంది. ఈ టైటిల్ కి యూ ట్యూబ్ లో వస్తున్నకామెంట్స్ చాలా వ్యతిరేకతతో వున్నాయి. ట్రైలర్ ని మెచ్చుకున్న వాళ్ళెవరూ లేరు. అసలే రోమాంటిక్ కామెడీల, ప్రేమ కథల సీజన్ అంతరించిన సమయంలో కొత్తవాళ్ళతో మరో లవ్ స్టోరీ రావడమంటే సాహసమే. ట్రైలర్ లో యూత్ ని ఆకర్షించే పాయింటేమీ లేదు. కొత్త దర్శకుడు పాత విషయంతో రావడం చాలా మైనస్ గా వుంది.

ఇందులో కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన పావని మరో హీరోయిన్ గా నటిస్తోంది . తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20 న రిలీజ్ చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. నాగినీడు, పృథ్వీ , జీవా,నల్ల వేణు, తాగుబోతు రమేష్, అదుర్స్ రఘు, గెటప్ శ్రీను కొమరం , జబర్దస్త్ రాజమౌళి, మిర్చి మాధవి, సన్నీ, ప్రసన్న కుమార్ , మధుమని మొదలైన వాళ్ళంతా నటించారు. సెప్టెంబర్ 20 విడుదల.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ