Cinema

‘మీరు వర్జినా?’షాకింగ్ సమాధానమిచ్చిన రాజ్ తరణ్

సోషల్ మీడియా సెలబ్రెటీల పబ్లిసిటీలకు వేదికగా మారింది. అక్కడ నో సెన్సార్. ఎవరేమైనా మాట్లాడొచ్చు. జనాలు కూడా సెలబ్రెటీలతో చిట్ చాట్ అంటే రకరకాల వింత ప్రశ్నలు వేస్తున్నారు. వరుస ఫ్లాప్ తో ఢీలా పడ్డ రాజ్ ‌తరుణ్ చాలా రోజుల తరువాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్‌చాట్ చేశాడు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు రాజ్ తరుణ్.

వాటిలో ఓ ప్రశ్న..నిజానికి ఏ హీరో ని అయినా ఇరుకున పెట్టేదే కానీ రాజ్ తరుణ్ కు మాత్రం కాదు. వెంటనే తడుముకోకుండా సమాధానమిచ్చాడు. అదేమిటంటే..‘‘మీరు వర్జినా’’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ‘‘కాదు’’ అంటూ వెంటనే షాకింగ్ సమాధానం ఇచ్చాడు రాజ్ తరుణ్.

అలాగే మరికొన్ని ప్రశ్నలు కాస్తంత ఆసక్తికరంగానే సాగాయి. ‘‘మీ తరువాతి చిత్రం ఏంటి..? ఎవరితో’’ అని అడగగా.. ‘‘అవికా గౌర్‌ను అడగండి’’ అంటూ సమాధానం ఇచ్చాడు రాజ్ తరుణ్. ఇక ‘‘మీ పెళ్లెప్పుడు’’ అనే ప్రశ్నకు ‘‘వచ్చే ఏడాది’’.. అని ‘‘మహేశ్ బాబును ఎఫ్పుడు కలుస్తారు..? ఆయనతో ఓ ఫొటో దిగి పోస్ట్ చేయొచ్చు కదా’’ అన్న ప్రశ్నకు నేను కలిశాను. ‘‘ఫొటో కూడా దిగాను. కానీ అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయను. చనిపోయేవరకు నాతోనే ఉంచుకుంటాను. అది నా వ్యక్తిగత విషయం’’ అంటూ సమాధానం ఇచ్చాడు.

ఇక ‘‘మంచి కథలను ఎంచుకోవచ్చు కదా’’ అన్న ప్రశ్నకు ‘‘అదే పనిలో ఉన్నా. అందుకే ఆలస్యం అవుతుంది’’.. ‘‘కనీసం మీ ట్విట్టర్‌ ఫొటో అయినా మార్చర్చు’’ కదా అన్న ప్రశ్నకు ‘‘ఆ ఫొటోను రత్నవేలు గారు తీశారు. నేనెప్పటికీ దానిని మార్చను. సారీ’’ అంటూ సమాధానం ఇచ్చాడు.

‘‘టాలీవుడ్‌లో మీరు కలిసిన ఉత్తమ వ్యక్తి ఎవరు..?’’ అన్న ప్రశ్నకు ‘‘ఉయ్యాల జంపాల నిర్మాత రామ్మోహన్’’.. ‘‘మీలో ఉన్న హిడెన్ టాలెంట్ ఏంటి’’ అన్న ప్రశ్నకు ‘‘పాటలు రాస్తాను. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, రంగుల రాట్నం చిత్రాలలో ఒక్కో పాట రాశాను. అలాగే ఉయ్యాల జంపాల చిత్రానికి అసిస్టెంట్‌గా పనిచేశాను’’ అని చెప్పాడు.

Telugurajyam
Read
Special
Ads

Copyright © 2018 TeluguRajyam

To Top