fbpx
Home National మోదీ, కేసీఆర్ పై రాహుల్ సెన్సేషనల్ కామెంట్స్

మోదీ, కేసీఆర్ పై రాహుల్ సెన్సేషనల్ కామెంట్స్

కాంగ్రెస్ గర్జనలో తెలుగుతో ప్రసంగం మొదలు పెట్టిన రాహుల్ గాంధీ నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం మొదలయ్యిందన్నారు. తర్వాత ఆయన తన ప్రసంగాన్ని హిందీలో కొనసాగించారు. మీరంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు మనకొస్తాయని, మన నిధులు మనకొస్తాయని , లక్షల ఉద్యోగాలు మనకొస్తాయని కళలు కన్నారు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడి అభివృద్ధి చెందితే అందరి జీవితాలు బాగుపడతాయని మీరంతా విశ్వసించారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఆ కల సాకారం కాలేదు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల తర్వాత ఒక కొత్త ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు.

తెలంగాణ రాష్ట్రము కోసం పోరాడిన, బలిదానాలు చేసిన వారికీ ఆయన అనేక హామీలు ఇచ్చాడు. తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసిన అమరవీరులకు నేను స్రధానాలి ఘటిస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో అమరవీరులైన కుటుంబాలను ఆదుకుంటానని ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసాడు. ఒక లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు. తెలంగాణ యువకులందరికి రాష్ట్రం ఏర్పడ్డాక లక్ష ఉద్యోగాలు ఇస్తానన్నాడు. నాలుగేళ్ల పాలనలో కనీసం పదివేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒక్క నోటిఫికేషన్ కూడా ప్రకటించలేదు, నియామకాలు జరపలేదు.

రాఫెల్ కాంట్రాక్టును HAL నుండి గుంజుకుని ఆత్మీయులకు కట్టబెట్టాడు మోడీ. యూపీఏ ప్రభుత్వ హయాంలో 524 కోట్లకు కొనటానికి ప్రయత్నించిన విమానాన్ని మోడీ ప్రభుత్వం1600 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అనిల్ అంబానీ కంపెనీకి విమాన ఉత్పత్తి రంగంలో ఎటువంటి అనుభవం లేదు. ఏ కంపెనీకైతే రాఫెల్ డీల్ ఇచ్చారో ఆ కంపెనీ దాదాపు 35 ,000 కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది. ఆర్డర్ ఇవ్వటానికి పది రోజులముందే ఆ కంపెనీని స్థాపించారు.

రాఫెల్ యుద్ధ విమానాలు ఒక పెద్ద స్కాం అన్న రాహుల్ ఈ కుంభకోణంలో అనిల్ అంబానీ కోసం మోదీ వేల కోట్లు దాచి పెట్టారని వెల్లడించారు. రాఫెల్ డీల్ గురించి అడిగితే అది రక్షణ వ్యవహారమని హోమ్ మినిస్టర్ అంటారు. ఫ్రాన్స్ సంస్థతో సీక్రెట్ ఒప్పందం అంటారు. నేను స్వయంగా ఫ్రాన్స్ రాష్ట్రపతిని ఈ విషయం గురించి అడిగితే అలాంటి సీక్రెట్ ఒప్పందం లేదని అన్నారు.

ఫ్రాన్స్ రాఫెల్ ధరను దాచిపెట్టాల్సిన అవసరం లేదని చెప్పినా మోదీ ఎందుకు దాస్తున్నారు? దేశ యుద్ధ విమానాల కొనుగోలు గురించి దేశ ప్రజలకు తెలియటం రక్షణ వ్యవహారం ఏంటి. దీని గురించి తెలుసుకునే హక్కు దేశ పౌరులకు లేదా అని ఆయన ప్రశ్నించారు. లక్షలమంది నిరుద్యోగులకు ఈ రాఫెల్ ఉత్పత్తి ద్వారా వచ్చే ఉదోగాలకు మోడీ గండి కొట్టారు. ఇదివరకు దీనిని అవినీతి అనేవారు ఇప్పుడు రీడిజైన్ అంటున్నారు.

తెలంగాణాలో కూడా మీ ముఖ్యమంత్రి రీడిజైన్ స్పెషలిస్ట్. పేద రైతుల దగ్గర భూమిని లాక్కుంటున్నారు. అంబేద్కర్ పేరు మీద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపడితే దాన్ని పక్కన పెట్టేసి రీడిజైన్ చేస్తున్నారు. 25 ,000 వేల కోట్లతో మొదలుపెట్టిన ప్రాణహితకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పేరు పెట్టి రీడిజైన్(అవినీతి) చేస్తున్నారు. ఈ రీడిజైనింగ్ వలన ఒక్కసారిగా 38,000 కోట్లు అనుకున్న ప్రాజెక్టు లక్ష కోట్లకు వెళ్ళిపోయింది. ఈ ప్రాజెక్టుల పేరు మీద జరుగుతున్న అవినీతితో ఒకే కుటుంబానికి డబ్బులు చేరిపోయాయి. రీడిజైనింగ్ పేరుతో మోడీ, కెసిఆర్ అవినీతికి పాల్పడుతున్నారు. ఒక రీడిజైనర్ మరొక రీడిజైనర్ ని సపోర్ట్ చేస్తాడు.

మోడీ ఎలా చేస్తే కెసిఆర్ కూడా అలానే చేస్తున్నాడు. గతంలో తెలంగాణాలో కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ ఫ్రీ. కానీ ఇప్పుడు దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో స్కూలు ఫీజులు ఎక్కువయ్యాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక ఫీజుల వలనఇబ్బంది పడుతున్నారు. బేటీ బచావో బేటీ పడావో అనే బీజేపీ నేతలు మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే పట్టించుకోరని వ్యక్తం చేశారు. ఈ నినాదం చేసేటప్పుడు మహిళలు ఎవరి నుండి రక్షించబడాలి అనేది చెప్పరు మోడీ. బేటీ బచావో బీజేపీ ఎమ్మెల్యేసే బేటీ బచావో అని నినదించారు రాహుల్. గబ్బర్ సింగ్ టాక్స్ (జీఎస్టీ) లక్ష్యం పేదల నుండి, రైతులనుండి దోచిన ధనం సంపన్నులకు దోచిపెట్టడానికే అన్నారు రాహుల్.

ఎవరైతే క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పోరాడతారో వారికే ప్రజా ప్రతినిధులుగా టిక్కెట్లు ఇస్తానని తెలిపారు. మోదీలాగా తప్పుడు హామీలు ఇవ్వటానికి నేను రాలేదని తెలిపారు. తెలంగాణ కోసం మీరు కన్నా కలలు సాకారం చేస్తానని చెప్పటానికే వచ్చాను అని స్పష్టం చేశారు.

తెలుగురాజ్యం ప్రత్యేకం

బాబు గారి ‘Is It not వివక్షత’ కి ఈసీ కౌంటర్?

చంద్ర బాబు గారు ఎలక్షన్ కమిషన్ ని కలిసిన తర్వాత మాట్లాడుతూ పోలింగ్ జరిగిన 30 రోజుల తర్వాత ఎలా రీపోలింగ్ నిర్వహిస్తారని , is this not వివక్షత అంటూ ప్రశ్నించారు....

‘ఎబిసిడి’ రివ్యూ – చిన్న మహర్షి అవుదామనుకుంటే…

ఐదు సినిమాల అల్లుశిరీష్ యువహీరోగా నిలదొక్కుకోవడానికి స్ట్రగుల్ చేస్తున్నాడు. ఆరో సినిమాగా నాలుగక్షరాల ‘ఎబిసిడి’ కొచ్చాడు. రీమేక్ తో, కొత్త దర్శకుడితో ఒక ప్రయోగం చేస్తున్నట్టు చెప్పాడు. అట్టహాసంగా 600 పై చిలుకు...

చంద్రబాబు ఢిల్లీకి ఎందుకెళ్ళారు ? వేగంగా మారిపోతున్న పరిణామాలు

చంద్రబాబునాయుడు హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళారు. రోజువారీ షెడ్యూల్ మొత్తాన్ని రద్దు చేసుకుని మరీ ఢిల్లీకి వెళ్ళటంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి. చివరి దశ పోలింగ్ దగ్గర పడటంతో పాటు ఢిల్లీ  రాజకీయం కూడా...

అత్యంత ప్రజాధారణ

తాజా వార్తలు

బెట్టింగ్ రాయళ్ళు నిండా ముణగటం ఖాయమేనా ?

చిలక జోతిష్కుడు లగడపాటి రాజగోపాల్ సర్వేలను నమ్ముకుంటే తెలుగుదేశంపార్టీ నేతలు మళ్ళీ నిండా ముణగటం ఖాయమేనా ? వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో మెజారిటీ జాతీయ మీడియా సంస్ధలు...

‘సాహో’ఫైట్‌ లో కారు ఎలా నుజ్జైందో చూడండి! (వీడియో)

ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించిన బాహుబలి తరువాత యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సాహో. బాహుబలితో ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్‌ రావటంతో సాహోను కూడా...

లారెన్స్ బాగా హర్ట్ అయ్యాడు, అక్షయ్ సినిమాకి బై

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘లక్ష్మీ బాంబ్’.తమిళ, తెలుగు భాషల్లో హిట్ అయిన ‘కాంచన’ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమా ద్వారా రాఘవ లారెన్స్...

‘మహర్షి’సక్సెస్ మీట్ : నటుడు, ఆర్జే హేమంత్‌ కారు ప్రమాదం

మే 18వ తేదీ శనివారం రాత్రి విజయవాడలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. అభిమానుల కోలహలం, నటీనటుల మధ్య మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి...

సెక్స్ కంటెంట్ పై బ్యాన్ పెడితే ఇంకా రెచ్చిపోతారంటోంది

అడల్ట్ కంటెంట్ కు అడ్డాగా మారిన బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ తన మాటలు కూడా అదే స్దాయిలో ఉండేలా చూసుకుంటుంది. అడల్ట్ సీన్స్ కు హైయిస్ట్ ప్రయారిటీ ఇచ్చే ఆమె సినిమాలు...

మహేష్ అయితేనేం…నేను తగ్గను, అంత ఇవ్వాల్సిందే

మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి అన్ని సెంటర్లలోనూ కలెక్షన్స్ లో కుమ్మేస్తోంది. దాంతో అందరి దృష్టీ మహేష్ చేయబోయే తదుపరి చిత్రంపై ఉంది. ఇప్పటికే మహేష్ ...అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయటానికి...

రాజశేఖర్ కు కోపం వచ్చినా, కంట్రోలు చేసుకుని ఓకే

‘గరుడవేగ’ హిట్‌తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన యాంగ్రీమెన్‌ రాజశేఖర్‌ తాజాగా చేస్తున్న చిత్రం ‘కల్కి’. నాని నిర్మించిన అ! సినిమాతో తన సత్తా చాటుకున్న యంగ్‌డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతో కలిసి కల్కి...

సంచలనం : ఇద్దరిపైనా లుకౌట్ నోటీసుల జారీ

తెలంగాణా సైబర్ క్రైం పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న టివి9 మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీలు దేశం వదిలి పారిపోకుండా ముందుజాగ్రత్తగా లుకౌట్ నోటీసులు...

19 సాయంత్రం కోసం ఎదురుచూస్తున్నారా ?

దేశవ్యాప్తంగా జనాలందరూ 19వ తేదీ అంటే శనివారం సాయంత్రం 6 గంటలు ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల కోసం ఎందుకు ఎదురుచూస్తున్నట్లు ? ఎందుకంటే, ఎగ్జిట్ పోల్స్...

రీ పోలింగ్ పై కోర్టుకెక్కిన టిడిపి..చంద్రబాబులో  టెన్షన్ ?

రాష్ట్ర చరిత్రలో ఇంత వరకూ జరగని విచిత్రానికి తెలుగుదేశంపార్టీ పాల్పడింది.  రీ పోలింగ్ కు ఎన్నికల కమీషన్ ఇచ్చిన ఆదేశాలపై టిడిపి కోర్టును ఆశ్రయించింది. మొన్నటి ఎన్నికల సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు...
 Nate Gerry Jersey