AP & TS

రాహుల్ వచ్చింది ప్యారడైజ్ బిర్యానీ కోసమే (వీడియో)

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన పై జోకులు, విమర్శలు వస్తున్నాయి. రాహూల్ తెలంగాణకు మోసం చేస్తున్నారని, రాహుల్ కి తెలంగాణలో పర్యటించే హక్కు లేదని పలువురు విద్యార్ధి నేతలు అంటున్నారు. మొత్తానికి రాహుల్ పర్యటనపై సోషల్ మీడియాలో వివిధ రకాలుగా జోకులు వస్తున్నాయి.

రాహూల్ గాంధీ తెలంగాణకు వచ్చింది ప్యారడైజ్ బిర్యానీ కోసమే అని టిఆర్ ఎస్ వీ నేతలు విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన నాలుగున్నరేళ్ల తర్వాత ఇప్పుడే రాహూల్ కి తెలంగాణ మీద ప్రేమ పుట్టుకు వచ్చిందా అని టిఆర్ ఎస్ వీ నేత స్వామి యాదవ్ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం మద్దతు ఇస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా కోసం మద్దతివ్వాలన్నారు. రాహూల్ తెలంగాణ పర్యటన వల్ల ఒరిగిందేమి లేదని వారు ఎద్దేవా చేశారు. ఓయూలో విద్యార్ధి నేతలు మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.

0
Telugurajyam
Read
Special
Ads
Follow us:

Copyright © 2018 TeluguRajyam

To Top