fbpx
Home National ప్రధాని మోదీ ఎదుట మహిళా మంత్రితో అసభ్యంగా ప్రవర్తించిన మరో మంత్రి (వీడియో)

ప్రధాని మోదీ ఎదుట మహిళా మంత్రితో అసభ్యంగా ప్రవర్తించిన మరో మంత్రి (వీడియో)

రోజు రోజుకు మహిళలపై వేధింపులు పెరిగి పోతూనే ఉన్నాయి. అది ఇంటా బయట అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ వారు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. తాజాగా దేశ ప్రధాని ముందటనే మహిళా  మంత్రికి మరో మంత్రి నుంచి వేధింపులు ఎదురయ్యాయి. అసలు వివరాలు ఏంటంటే…

త్రిపుర రాజధాని అగర్తలలో నిర్వహించిన ఓ ర్యాలీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సీఎం విప్లవ్ దేవ్, మంత్రి మనోజ్ కంతి దేబ్ తో పాటు మరో మహిళా మంత్రి కూడా వెళ్లారు. వేదిక మీద మంత్రి మనోజ్ సదరు మహిళా మంత్రిని అసభ్యంగా తాకాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన విపక్షాలు మంత్రిని వెంటనే తొలగించి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  

 

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ