Home News Andhra Pradesh మూడు రాజధానుల ప్రతిపాదన ఎవరికొంప కూల్చబోతోంది?

మూడు రాజధానుల ప్రతిపాదన ఎవరికొంప కూల్చబోతోంది?

చిన్న చిన్న అలలు కాకుంటే అప్పుడప్పుడు పడి లేస్తుండిన కెరటాలతో వుండిన సరోవరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులనే పెద్ద పెద్ద బండ రాళ్లు వేయడంతో వాయు గుండంగా ప్రారంభమై ప్రస్తుతం పెను తుఫానుగా మారింది. ఇది ఏ ప్రాంతంలో ఏ తీరం దాటి ఎవరి కొంపలు కూల్చుతుందో ఇప్పుడే చెప్పలేము. మూడు రాజధానుల ప్రతి పాదన రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చి వేసింది. ఏ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అధికారం చేపట్టిన తొమ్మిది నెలలకే పోలీసుల కవాతులు 144 సెక్షన్ లు అమలు చేయవలసిన అత్యవసర పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. ఇది ఏ అధికార పార్టీకి అంత మంచిది కాదు. ఇదిలా వుండగా మొన్నటి వరకు చే గువేరా తరిమెల నాగిరెడ్డి తనకు ఆదర్శ ప్రాయులుగా చెబుతుండిన పవన్ కళ్యాణ్ కు ప్రస్తుతం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభిమానిగా మారి పోయారు. తుదకు బిజెపి జనసేన పార్టీల మధ్య పొత్తు ఏర్పడింది. భవిష్యత్తులో ఇంకేమైనా కావచ్చు. చంద్రబాబు నాయుడు కూడా తను బిజెపితో తెగతెంపులు చేసుకోవడం తప్పుగా అంగీకరించి బిజెపి జనసేన పొత్తును ఆహ్వానించారు.
భవిష్యత్తులో మరేమైనా సంభవించ వచ్చు నేమో .

మరో ముఖ్య మైన పరిణామమేమంటే మూడు రాజధానుల ప్రతి పాదనను రాష్ట్రంలో వుండే అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు మౌనంగా వుండిన మార్క్సిస్టు పార్టీ కూడా అమరావతిలోనే రాజధాని వుండాలని డిమాండ్ చేసింది. పర్యవసాన మేమంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రికి రాజకీయంగా ఒక్క మిత్రుడు లేక పోవడమే. రాజకీయంగా ఇది మంచిది కాదు. తుదకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెలిమి చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా మజ్లిస్ పార్టీని వదల పెట్టడం లేదు. అంతేకాదు. కాంగ్రెస్ నేతగా వుండిన రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికల ముందు వామపక్షాలతో చెలిమి చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

రాజకీయ పార్టీలు వైఖరులు ఇలా వుంటే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల నుండి లభ్యమయ్యే సానుభూతి సహకారాల అంశంలో కూడా భిన్నాభిప్రాయాలు వున్నాయి. ఈ పాటికే ప్రాంతాల మధ్య గల అసమానతలతో అంతరాలు వుండగా మూడు రాజధానుల ప్రతి పాదన మరింత అగ్గి రగలేసింది. మూడు ప్రాంతాల ప్రజలను సంత్రుప్తి పర్చబోయి ప్రజల మధ్య మరింత ద్వేషాలు నెలకొనే ప్రమాద ముంది. చారిత్రక ప్రాధాన్యత గల శ్రీ బాగ్ ఒడంబడిక అమలు చేయాలని సీమ వాసులు చిర కాలంగా కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో హైకోర్టు నెల కొల్పాలని ఆందోళనలు జరిగాయి. ప్రస్తుతం మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా సీమకు హైకోర్టు ప్రకటించినా సీమ వాసులు అంతటితో సంత్రుప్తి పడే అవకాశం కన్పించడం లేదు. విశాఖకు రాజధాని అనగానే సీమలో తమకూ రాజధాని కావాలనే వాదన తెరపైకి వచ్చింది. ఒక వర్గం సీమకు సమానావకాశాలు కావాలని కోరు తుంటే మరి కొందరు విశాఖ కన్నా సీమ బాగా వెనుకబడి ప్రాంతం కాబట్టి తమకే రాజధాని అనే వాదన తెర మీదకు తెచ్చారు. . దీనికి తోడు కొత్త శక్తులు రంగ ప్రవేశం చేసి రాజధాని ఇస్తారా? లేక ప్రత్యేక రాష్ట్రం ఇస్తారా? అనే సవాళ్లు విసురు తున్నారు.

మొన్నటి ఎన్నికల్లో సీమలో 52 శాసన సభ స్థానాలు వుంటే వైసిపికి 48 స్థానాలు దక్కాయి. మరి రాజధాని కావాలని అడగని విశాఖలో రాజధాని పెడితే సీమ ప్రజల్లో తనకున్న ప్రాబల్యం ముఖ్యమంత్రి నిలుపు కోవడం కత్తి మీద సామే.మొన్నటి ఎన్నికల్లో కృష్ణ గుంటూరు జిల్లాలో కూడా ఒక సామాజిక వర్గం బలంగా వున్నా వైసిపి అభ్యర్థులు గెలుపొందారు. ప్రస్తుతం ఈ జిల్లాలో అసంతృప్తి జ్వాలలు మిన్నంటు తున్నాయి. రాజధాని మార్పు అంశంలో ఉద్యమం ఈ జిల్లాలోనే సాగుతున్నా విశాఖకు రాజధాని మార్పు జరిగిన తర్వాత దూరంగా వుండే జిల్లాలో కూడా మున్ముందు ప్రజల నుండి వైసిపి వ్యతిరేక ఎదుర్కోవలసి వుంటుంది. తుదకు సీమ ప్రాంతాల్లో కూడా ఇది సమస్యే. దీనికి తోడు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం పెను గండమే.

కాకుంటే ఇంత కాలం చంద్రబాబు నాయుడు అనుసరించిన ఏక పక్ష విధానాలు చూపెట్టి ప్రజలను ఒప్పించేందుకు ప్రయత్నం చేయడ మొక్కటే మిగిలి వుంది. అదీ కూడా దీర్ఘకాలికంగా పని చేయదు. ప్రజలు జీవితాలను రూపాయలు పైసల్లో చూస్తారు. దురదృష్టం ఏమంటే ముఖ్యమంత్రి అమలు చేస్తున్న నగదు బదలీ పథకాల పలుకుబడి కూడా రాజధాని తుఫాన్ లో కొట్టుకు పోతోంది.
ఎందుకంటే భావోద్వేగాల వైరస్ అటువంటిది. ఇదిలా వుండగా విశాఖ రాజధాని చేయడం వలన ఉత్తరాంధ్రలో కూడా భిన్నాభిప్రాయాలు వున్నాయి. అయినా ఆ ప్రాంతంలో పొందే రాజకీయ ప్రయోజనాలకన్నా సీమలో రోజు రోజుకూ మారుతున్న మార్పులు కోస్తా జిల్లాల్లోని ఎదురు గాలులు దృష్టిలో పెట్టుకొంటే మొన్నటి ఎన్నికల్లో లభ్యమైన అండదండలు ముఖ్యమంత్రి ఎక్కువ పోగొట్టు కుంటారేమో.. దీనికి తోడు జనసేన బిజెపి సమైక్య పోరాటం వైసిపికి సంకటమే. . వాస్తవంలో మొన్న లభ్యమైన బలాన్ని అన్ని ప్రాంతాల్లో సుస్థిరం చేసుకోవలసినది పోయి ప్రాంతాల విభజన ద్వారా అన్ని ప్రాంతాల్లో కూడా ఎంతో కొంత నష్టం పోయే ప్రమాదం వైసిపి తెచ్చి పెట్టుకొంది. .

వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013

Previous articleMehreen Kaur Pirzada
Next articleNabha Natesh

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

కొర‌టాల అంత‌ప‌ని చేశాడా.. గ్రేట్‌?

స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌.. విప్ల‌వ చిత్రాల క‌థానాయ‌కుడు ఆర్‌. నారాయ‌ణ‌మూర్తికి మ‌రో వెర్ష‌న్ అనుకోవ‌చ్చు. ఆయ‌న విప్ల‌వ చిత్రాల‌ని డైరెక్ట్ మోటీవ్‌తో చేస్తే అదే త‌ర‌హా క‌థాంశాల‌కు క‌మర్ష‌య‌ల్ హంగుల్ని జోడించి...

ఏఏ 20 అనౌన్స్‌మెంట్‌కి మెగాస్టార్‌కి లింకేంటీ?

అల్లు అర్జున్ న‌టిస్తున్న 20వ చిత్రం అప్‌డేట్‌పై గ‌త కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియా వేదిక‌గా చ‌ర్చ న‌డుస్తోంది. సుకుమార్ - బ‌న్నీ క‌ల‌యిక‌లో వస్తున్న సినిమా ఇది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఇది...

ఎక్క‌డి వాళ్లు అక్క‌డే..కానీ షార్ట్‌ఫిల్మ్ రెడీ!

ది గ్రేట్ పీపుల్ మేడ్ గ్రేట్ థింగ్స్ అన్న‌ట్టు భార‌తీయ తెర‌పై అద్భుతాలు సృష్టించిన వారంతా క‌లిసి `ఫ్యామిలీ` పేరుతో ఓ అద్భుతాన్ని సృష్టించారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచం వ‌ణికిపోతున్న వేళ...

మంచు మ‌నోజ్‌కి మండేలా చేసిందెవ‌రు?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఏ దేశం గురించి విన్నా క‌రోనా మ‌ర‌ణ‌మృదంగ‌మే. దీని భారీ ఉంచి భ‌య‌ట‌ప‌డాలంటే నివార‌ణ ఒక్క‌టే మార్గ‌మ‌ని, అంతా ఇంటి ప‌ట్టునే వుండాల‌ని దేశాల‌న్నీ లాక్‌డౌన్‌ని ప్ర‌క‌టించాయి....

త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఇంట్లో విషాదం

ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాతృమూర్తి కృష్ణ‌వేణి (94) సోమ‌వారం మృతి చెందారు. ఆమె గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి త‌మ్మారెడ్డి కృష్ణ‌మూర్తి నిర్మాత కూడా....

ఆ ఇద్ద‌రికి అనిల్ రావిపూడి షాకిస్తున్నాడా?

`ఎఫ్‌2` బ్లాక్ బ‌స్ట‌ర్ అంటే ఇప్ప‌టికీ ఎవ‌రూ న‌మ్మ‌రు. సింపుల్ లైన్‌తో, జ‌బ‌ర్ద‌స్ట్ కామెడీ స్కిట్‌ల‌ని త‌ల‌పించే సీన్‌ల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్నాడు అనిల్ రావిపూడి. ఇది సినిమానేనా? అని...

కీర్తి పెళ్లి వార్త‌ల సృష్టిక‌ర్త దొరికిపోయాడు!

సావిత్ర జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన `మ‌హాన‌టి` చిత్రంతో హీరోయిన్ కీర్తి సురేష్ స్థాయే మారిపోయింది. ఈ సినిమాతో ఉత్త‌మ న‌టిగా జాతీయ పుర‌స్కారాన్ని సొంతం చేసుకున్న కీర్తి ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల్లో...

రాజీవ్ క‌న‌కాల కుటుంబంలో విషాదం

న‌ట‌డు రాజీవ్ క‌న‌కాల సోద‌రి...యాంక‌ర్ సుమ ఆడ‌ప‌డుచు శ్రీల‌క్ష్మి మృతి చెందారు. గ‌త‌కొంత కాలంగా క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతోన్న ఆమె సోమ‌వారం ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్ను మూసారు. శ్రీల‌క్ష్మి...

అక్కినేని కోడ‌లిని..త్రిష‌ని కెలికిన శ్రీ‌రెడ్డి!

కాస్టింగ్ కౌచ్ వివాదంతో టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది శ్రీ‌రెడ్డి. `మా`లో శివాజీరాజా త‌నకు స‌భ్య‌త్వం ఇవ్వ‌లేదంటూ నానా హంగామా చేసి అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం స‌ష్టించింది. అక్క‌డి నుంచి అదే...

మేము సైతం అంటూ మెగా స్ఫూర్తితో ల‌ఘుచిత్రం

క‌రోనా సాయానికి ఒక్కొక్క‌రు ఒక్కోలా ముందుకొస్తున్నారు. సెల‌బ్రిటీలంతా ఎంతో స్ఫూర్తివంతంగా త‌మ‌వంతు సాయం చేస్తున్నారు. జ‌నాల్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. అటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్...