Home Politics సుష్మాస్వరాజ్‌ హఠాన్మరణం

సుష్మాస్వరాజ్‌ హఠాన్మరణం

బీజేపీ సీనియర్ నేత, విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ (67) మంగళవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మా ఇటీవల ఎయిమ్స్‌లో చేరారు. అయితే చికిత్స అందిస్తుండగానే గుండె పోటు రావడంతో ఆమె మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. సుష్మా స్వరాజ్‌ మరణవార్తను తెలుసుకున్న కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, హర్షవర్దన్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. సుష్మా స్వరాజ్‌ అకాల మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాన్ని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. 

సుష్మా స్వరాజ్ హఠాన్మరణంతో బీజేపీ శ్రేణులన్నీ విషాదంలో మునిగిపోయాయి. బీజేపీ తొలితరం నేతల్లో ఒకరైన సుష్మా స్వరాజ్ 1953 ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలాలో జన్మించారు. కేంద్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన సుష్మా స్వరాజ్ ఇటీవలే మూత్రపిండాల మార్పిడి చికిత్స చేయించుకున్నారు. దీంతో 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ‘జీవితంలో ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాను..’ జమ్మూ కశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు కు లోక్ సభ ఆమోదం పొందిన తర్వాత  ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు అభినందనలు తెలుపుతూ చివరి ట్వీట్ చేశారు

మహోన్నతమైన శకానికి తెరపడింది: మోదీ

బీజేపీ సీనియర్‌ నాయకురాలు సుష్మా స్వరాజ్‌ అకాల మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. భారత రాజకీయ చరిత్రలో మహోన్నతమైన శకానికి తెరపడిందన్నారు. ‘సుష్మా స్వరాజ్‌ ఎందరో ప్రజలకు ప్రేరణ కల్పించారు. పేద ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నించారు. అహర్నిషలు దేశ సేవ కోసం తపించారు’అంటూ మోదీ ట్వీట్‌ చేశారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకురాలు సుష్మాస్వరాజ్‌ అకాలమరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి వైఎస్‌‌. జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. అపార అనుభవం, సంయమనం, రాజకీయ నైపుణ్యం కలబోసిన నాయకురాలు ఆమె అని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా మనన్నలందుకున్న గొప్ప పార్లమెంటేరియన్‌ అని కొనియాడారు. సుష్మాస్వరాజ్‌ కుటుంబానికి సీఎం తన సంతాపాన్ని తెలియజేశారు.

Recent Posts

ఇంటికొచ్చి ఇస్తా అన్న ఆ — ఎక్కడ?

కోవిడ్-19 విజృంభనతో దేశం మొత్తం లాక్ డౌన్ అయిపోయింది. ఈ సమయంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా నిత్యావసరాలు, అలాగే రేషన్ వంటి వాటిని అందించేందుకు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్...

ఆ మాజీ ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తు ముగినట్టేనా?

దశాబ్దాలుగా కమ్యూనిస్టులకు కోటలుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. మూస సిద్ధాంతాలతో మసకబారుతున్నాయి. మచ్చలేని ప్రజా నాయకులుగా వెలిగిన వారు.. పలుమార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన వారు.. ఇప్పుడు ఆర్థిక స్థోమత లేక...

సబ్బం హరి ఆ పని చేయడం వల్లే జగన్‌ దూరం పెట్టారా?

మంచి మాటకారిగా పేరు తెచ్చుకున్న మాజీ ఎంపీ సబ్బం హరి మాటలు.. ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియాకు మంచి సరుకుగా, జగన్‌పై విమర్శలు సంధించేందుకు అస్త్రాలుగా మారుతున్నాయి. సమయం, సందర్బం అంటూ ఏదీ...

హాట్ యాంక‌ర్‌కి మెగా ఆఫ‌ర్‌!

హాట్ యాంక‌ర్ రంగ‌మ్మ‌త్త అన‌సూయ‌కు మ‌రో మెగా ఆఫ‌ర్ త‌గిలిన‌ట్టు తెలిసింది. `రంగ‌స్థ‌లం`లో రంగ‌మ్మ‌త్త‌గా గోల్డెన్ ఛాన్స్ కొట్టేసి ఓ ద‌శ‌లో రామ్‌చ‌ర‌ణ్‌నే డామినేట్ చేసిన అన‌సూయ‌కు ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిత్రంలో...

పుట్టిన రోజు లేదు .. పెళ్లీ కూడా వాయిదా!

ప్ర‌పంచం క‌రోనా వైర‌స్ కార‌ణంగా అల్ల క‌ల్లోలం అవుతోంది. ఎక్క‌డ చూసినా క‌రోనా మ‌ర‌ణాలే. దేశం క‌రోనా కార‌ణంగా భ‌యంతో కంపించిపోతోంది. ఈ ప‌రిస్థితుల్లో ముఖ్య‌మైన కార్య‌క్రమాల‌న్నింటినీ జ‌నం వాయిదా వేసుకుంటున్నారు. కొన్నింటిని...

`ఉప్పెన‌`కు క‌త్తెరేస్తున్న ద‌ర్శ‌కుడు!

సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం `ఉప్పెన‌`. మైత్రీ మూవీమేక‌ర్స్‌తో క‌లిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆయ‌న శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం...

అల్లు అర్జున్ ప్లాన్‌కి క‌రోనా దెబ్బ‌!

2020... ఈ ఇయ‌ర్ హీరో అల్లు అర్జున్‌కు.. క‌రోనా వైర‌స్‌కు చాలా స్పెష‌ల్ ఇయ‌ర్‌. మాన‌వాళికి మాత్రం కాళ‌రాత్రుల్ని ప‌రిచ‌యం చేస్తున్న ఇయ‌ర్. ఈ ఏడాది అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో...

తెలంగాణలో కరోనా తొలి మరణం వెనుక భయానక వాస్తవాలు!

తెలంగాణలో కోవిడ్-19 తొలి మరణం నమోదైంది. నాంపల్లికి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు మరణించిన అనంతరం.. చేసిన పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. పెద్ద వయసు కాబట్టి కరోనా వైరస్‌...

బీటలు వారుతోన్న తెలుగు దేశం పునాదులు..

తెలుగు దేశం పార్టీ.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, దేశ రాజకీయాల్లో ఓ నూతన ఓరవడికి శ్రీకారం చుట్టిన ప్రాంతీయ కెరటం. తెలుగువారి 'ఆత్మగౌరవ' నినాదంతో 1982 మార్చి 9న విశ్వవిఖ్యాత నటుడు నందమూరి...

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...