fbpx
Home National హైదరాబాద్ పై రాజకీయ చర్య ఉంటుందా ?

హైదరాబాద్ పై రాజకీయ చర్య ఉంటుందా ?

హైదరాబాద్ పై రాజకీయ చర్య ఉంటుందా ?

ట్రిపుల్ తలాక్ , కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు తరువాత భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మత మార్పిడుల బిల్లుపై ద్రుష్టి పెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి . మరే ఇతర పార్టీపై ఆధారపడకుండా ఎలాంటి బిల్లునైనా పార్లమెంట్లో పాస్ చేయించుకునే సామర్ధ్యం బీజేపీ కి వుంది . అందుకనే ఆపార్టీ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అడుగులు ముందుకు వేస్తుంది . కాశ్మీర్ లో శాంతి భద్రతలు క్రమముగా మెరుగుపడుతున్నాయి , ఈ పరిణామము బీజేపీ కి మరింత ఉత్సాహాన్ని , ఊపును ఇస్తుంది . బీజేపీ నాయకుల చూపు ఇప్పుడు తెలంగాణ మీద పడిందని , త్వరలో దీనిపై ఎవరు ఊహించని నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు .

ప్రస్తుతం సోషల్ మీడియా లో హైద్రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారని , లేదా దేశ రెండవ రాజధాని అవుతుందని వార్తలు వెల్లువెత్తుతున్నాయి . మరీ రెండు రోజుల నుంచి ఈ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . నిజంగానే తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టె ఇలాంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందా ? హైదరాబాద్ లో శాంతి భద్రతల సమస్య లేదు . రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కయ్యం పెట్టుకొనే ధోరణిలో లేదు . అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం హైద్రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతగా ఎందుకు చేయాలనుకుంటుంది ?

నిజానికి కాశ్మీర్ తరువాత సమస్యాత్మక ప్రాంతం హైదరాబాద్. దేశంలో ఉగ్ర కార్యకలాపాల మూలాలు ఇక్కడే అనే భావం కేంద్ర ప్రభుత్వంలో వుంది . దీనికి అనేక సందర్భాల్లో ఆధారాలు కూడా లభించాయి . భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో వున్న సంస్థానాలు అన్నీ విలీనమైనా హైదరాబాద్ మాత్రం స్వతంత్ర రాజ్యంగా ఉంటానని చెప్పడమే కాక ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కోసం ప్రయత్నం చేసింది . అంతే కాదు , పాకిస్తాన్ తో దోస్తానా అని ఆదేశ సహకారమ్ కోసం హెరికాఫ్టర్ లో బంగారాన్ని పంపించింది .

దేశం మధ్యలో ఒక ముస్లిం రాజ్యం ఉంటే ఎంత ప్రమాదం ఆ నాటి ఉప ప్రధాని , హోం శాఖా మంత్రి సర్దారువల్లభాయ్ పటేల్ గ్రహించాడు . అందుకే అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కు చెప్పకుండా హైదరాబాద్ విమోచనానికి భారత సైన్యాన్ని జనరల్ చౌదరీ ఆధ్వర్యంలో పంపించాడు . హైదరాబాద్ ను నాలుగు వైపులా నుంచి భారత సైన్య చుట్టుముట్టింది . సెప్టెంబర్ 17 ,1948న 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లొంగిపోయాడు . ఆరోజునే హైదరాబాద్ విమోచన దినంగా ప్రకటించారు . అయితే హైదరాబాద్ విమోచన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జరపడం లేదు . కారణం ఇక్కడి ముస్లింలతో వున్న దోస్తాన . ఎన్నికల్లో ముస్లిం ఓట్లు పోతాయనే భయం . అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ 17న హైద్రాబాద్లో ఘనంగా జరపడానికి బిజెపి సన్నాహాలు చేస్తుంది . కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోజును హైద్రాబాద్లో విమోచన దినంగా జరపబోతున్నామని ఇప్పటికే ప్రకటించాడు

<

p style=”text-align: justify”>తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు , ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు … విమోచన దినం అంటేనే మండిపడుతున్నాడు . ప్రభుత్వ పరంగా సహకారం అందించడం అటుంచి అనుమతి కూడా ఇవ్వకపోవచ్చు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తన దమ్మేమిటో చూపించుకుననే అవకాశం వుంది . ప్రధాని నరేంద్ర మోడీ హోంశాఖ మంత్రి అమిత్ షా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం వుంది . హైద్రాబాద్లో ముస్లింల ప్రాధాన్యత తగ్గించాలనే ఆలోచన ఎప్పటి నుంచో వుంది .దేశ రక్షణ కోసం హైదరాబాద్ ను ఎం చెయ్యబోతున్నారు ? కేంద్ర పాలిత ప్రాంతం చేసి … అధికారాన్ని తమ ఆధీనంలో వుంచుకోవడమా ? దేశ రెండవ రాజధానిని చేసి దక్షిణాదిలో పాగా వెయ్యడానికి మార్గం సుగమం చేసుకోవడమా ? కమలనాధుల రాజకీయ వ్యూహం ఏమిటి ?

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ