Home Politics హరీష్ రావు మీద ఆరోపణలపై కేటిఆర్ ఏమన్నారంటే ?

హరీష్ రావు మీద ఆరోపణలపై కేటిఆర్ ఏమన్నారంటే ?

తెలంగాణలో రాజకీయాలన్నీ టిఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు చుట్టే తిరుగుతున్నాయి. ఆయన టిఆర్ఎస్ లోనే కాకుండా యావత్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారారు. ఒకవైపు హరీష్ రావు ప్రతిపక్ష కూటమి మీద నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం హరీష్ రావును కవ్వించే ధోరణిలో మాట్లాడుతూ డైలమాలో పడేస్తున్నాయి. దీంతో హరీష్ రావు ఒక్కరే కాకుండా టిఆర్ఎస్ నాయకత్వం అంతా అయోమయంలో పడిపోయింది. అసలు హరీష్ రావుకు టిఆర్ఎస్ లో పొగ పెడుతున్నారా? తండ్రీ కొడుకులు కలిసి హరీష్ ను హింసిస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. ఈ నేపథ్యంలో హరీష్ మీద విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కేటిఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. 

మంగళవారం మంత్రి కేటిఆర్ సెలెక్టెడ్ మీడియా ప్రతినిధులను కలుసుకుని చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్ లో అనేక అంశాలను కేటిఆర్ ప్రస్తావించారు. తెలంగాణలో కూటమి రాజకీయాలపై స్పందించారు. కోదండరాం పార్టీ గురించి హాట్ కామెంట్స్ చేశారు. అలాగే టిఆర్ఎస్ పార్టీలో తాజా పరిణామాల మీద కూడా మాట్లాడారు. 

హరీష్ రావు మీద విపక్ష పార్టీలకు చెందిన నేతలు చేస్తున్న ప్రచారాన్ని కేటిఆర్ ఖండించారు. వారు చేస్తున్నవి దిక్కుమాలిన ఆరోపణలు తప్ప అందులో ఏమాత్రం నిజం లేదన్నారు. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై కేసీఆర్ మోకాలెత్తు వరకు వచ్చే నాయకుడు ఎవరూ లేడన్నారు. ఇంకా 15 ఏళ్ళు సీఎంగా కేసీఆర్ ఉండాలని మా పార్టీ నిర్ణయం, నా నిర్ణయం, హరీష్ నిర్ణయం కూడా అదే అన్నారు. హరీష్ పై దిక్కుమాలిన ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. హరీష్ కు నాకు కుటుంబం ఫస్ట్. ఆ తర్వాతే రాజకీయాలు అని తేల్చి చెప్పారు. కేసీఆర్ గజ్వేల్ లో పోటీచేస్తారు…లక్ష మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

హరీష్ రావు కాంగ్రెస్ లో చేరబోతున్నారని, రాహుల్ గాంధీతో ఆయన టచ్ లో ఉన్నారని వంటేరు ప్రతాపరెడ్డి బాంబు పేల్చిన విషయం తెలిసిందే. అంతేకాదు కేసిఆర్ ను గజ్వేల్ లో ఓడించాలని హరీష్ రావు ప్రయివేట్ నెంబరుతో ఫోన్ చేసి చెప్పినట్లు వంటేరు ఆరోపించారు. కేసిఆర్ ఓటమికి డబ్బు సాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు కూడా చెప్పారు. కేసిఆర్ ఓడిపోతేనే తెలంగాణలో కుటుంబ పాలన అంతమైదని హరీష్ మాట్లాడినట్లు వంటేరు ప్రతాప్ రెడ్డి పూసగుచ్చినట్లు చెప్పారు. 

ఇక టిడిపి సీనియర్ నేత రేవూరి కూడా హరీష్ రావు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. హరీష్ రావుకు టిఆర్ఎస్ లో పొగ పెడుతున్నారని, రేపటినాడు కూటమికి, టిఆర్ఎస్ కు సమానంగా సీట్లొస్తే హరీష్ రావు కొంతమంది టిఆర్ఎస్ సభ్యులను తీసుకుని వచ్చి సిఎం అవుతాడని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కేటిఆర్ తో చిట్ చాట్ లో మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. దానికి కేటిఆర్ లైట్ తీసుకున్నారు. వారు చేస్తున్న ప్రచారం దిక్కుమాలిన ప్రచారం అన్నారు. అందులో ఏమాత్రం పస లేదన్నారు.  మహా కూటమిని జనాలు రిసీవ్ చేసుకునే ప్రసక్తే లేదన్నారు. టిఆర్ఎస్ వంద సీట్లలో గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు కేటిఆర్.

 

Telugu Latest

టీడీపీ ఎమ్మెల్సీల సంజాయిషీ ఎలా ఉండ‌బోతుంది!

ఏపీలో మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌, సీఆర్డీఏ బిల్లుల‌పై శాన‌స‌మండ‌లిలో జ‌రిగిన చర్చ గురించి తెలిసిందే. మండ‌లిలో రూల్ 71 కింద చ‌ర్చ‌కు టీడీపీ నోటీసు ఇవ్వ‌గా...మండ‌లి చైర్మెన్ ష‌రీఫ్ చ‌ర్చ‌కు అనుమ‌తిచ్చారు. స‌భ‌లో...

వేశ్య కంటే దారుణం .. పూన‌మ్ కౌంట‌ర్ ఎవ‌రిపై?

ఇటీవ‌లి కాలంలో కాంట్ర‌వ‌ర్శీ క్వీన్స్ గా పాపులారిటీ ద‌క్కించుకుంది పూన‌మ్ కౌర్. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త్రివిక్రమ్ ల‌పై వ‌రుస ట్వీట్లు చేస్తూ త‌న ఇమేజ్ ని ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంది....

2022లో ఎన్నికలు.. జగన్ ఓటమి ఖాయం: సబ్బం హరి

  2022లో ఎన్నికలు.. జగన్ ఓటమి ఖాయం: సబ్బం హరి   వైఎస్ జగన్ నేతృత్వంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఆనందంలో వైసీపీ శ్రేణులు ఉండగా సీనియర్ నేత, మాజీ సబ్బం హరి జగన్ ఓటమి...

మ‌హేష్ 27లో ఊహించ‌ని ట్విస్ట్ అదే

సూప‌ర్ స్టార్ మ‌హేష్ కెరీర్ 27వ సినిమా లాంచ్ ఎప్పుడు? ఇందులో మ‌హేష్ పాత్ర తీరుతెన్నులు ఎలా ఉండ‌బోతున్నాయి? అన్న‌దానికి తాజాగా ఓ లీక్ అందింది. రిలీజ్ తేదీపైనా తాజా పోస్ట‌ర్ ఒక‌టి...

చ‌త్తీస్ ఘ‌డ్  తొలి సీఎం క‌న్నుమూత‌

చ‌త్తీస్ ఘ‌డ్ మాజీ ముఖ్య‌మంత్రి  అజిత్ జోగి (74) క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా తీవ్ర అస్వ‌స్థ‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న శుక్ర‌వారం ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ  తుది శ్వాస విడిచారు....

నిమ్మ‌గ‌డ్డ కేసులో సీఎం జ‌గ‌న్ ముందున్న మార్గాలివే!

ఏపీ ప్ర‌భుత్వానికి హైకోర్టులో మ‌రోసారి చుక్కెదురైన సంగ‌తి తెలిసిందే. నేటి ఉద‌య‌మే జ‌గ‌న్ స‌ర్కార్ కి పెద్ద షాకిచ్చింది కోర్టు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై  ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్...

మ‌హానాడు ముగించుకుని స్మార్ట్ గా చెక్కేసిన తండ్రీకొడులు!

ప్రతిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు అండ్ స‌న్ లోకేష్ విశాఖ గ్యాస్ బాధితుల్ని ప‌రామ‌ర్శించేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి అనుమ‌తులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా మ‌హానాడు కార్య‌క్ర‌మానికి రెండు రోజుల ముందుగా...

కేసీఆర్.. కరోనా పరీక్షలు ఎక్కడా ?

  కరోనా మహమ్మారి విజృంభన ఇంకా ఆగలేదు.  ప్రభుత్వాలు మాత్రం మరిన్ని సడలింపులతో ముందుకు వెళ్తున్నాయి. తెలంగాణలో కూడా ! ఇప్పటికీ  తెలంగాణలో కేసులు వస్తూనే ఉన్నాయి. నిజానికి తెలంగాణలో తక్కువగా కరోనా పరీక్షలు...

ముదుసలి ధీరుడే అంత.. ఇక జేసీ ఎంత ?

  ప్రపంచానిది ఒక  బాధ అయితే,  మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిది ఒక బాధ. ఆయన వ్యాఖ్యల ముందు జంధ్యాల హాస్య ప్రవచనాలు కూడా దిగదుడుపే అంటే అతిశయోక్తి కాదు. ఇక తాజాగా ఆయనగారు...

పి.ఆర్‌.మాన్‌సింగ్ పాత్ర‌లో న‌టించిన పంక‌జ్ త్రిపాఠి గురించి ’83’ ద‌ర్శ‌కుడు క‌బీర్‌ఖాన్ స్పంద‌న‌

  పి.ఆర్‌.మాన్‌సింగ్ పాత్ర‌లో న‌టించిన పంక‌జ్ త్రిపాఠి గురించి '83' ద‌ర్శ‌కుడు క‌బీర్‌ఖాన్ స్పంద‌న‌   ఇండియన్ క్రికెట్‌ను గ‌తిని మార్చిన ఏడాది 1983. ఈ ఏడాది భార‌త‌దేశం క్రికెట్ ప్ర‌పంచంలో రారాజుగా అవ‌త‌రించింది. క‌పిల్ డేర్...

English Latest

Jersey director not doing mega hero film

  Jersey director not doing mega hero filmGautam Tinnanuri is a director that became a technician to watch out for especially after the success of his...

What is KCR’s surprise?

Telangana CM KCR is popular for taking stunning decisions to make people happy and leave opposition parties awe struck. While inaugurating the Kondapochammasager,the 10th...

This is how much Charan is charging for Acharya?

  This is how much Charan is charging for Acharya? Many know that megastar Chiranjeevi is doing a film in the direction of Koratala Shiva. Trisha...

Jagan taking them as badges of honor

YSRCP chief Jagan Mohan Reddy after handling a crushing defeat to former CM Chandra Babu Naidu, head of TDP, turned aggressive after becoming the...

Balakrishna’s next gets the powerful title

Natasimha Balakrishna is in news for all wrong reasons and fans are finding it difficult to support their star after the insulting comments he...

Most Popular

జగన్మోహన పాలనకు ఏడాది…మెరుపులే కాదు మరకలు కూడా!

2019 సంవత్సరం నవ్యంధ్ర చరిత్రలో మే నెల చివరివారం ఒక మహోజ్వల ఘట్టానికి పునాదివేసింది.  అయిదేళ్లపాటు సాగిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాలనకు చరమగీతం పాడి వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి జేజేలు...

Secret behind Prabhas’ no updates

Numerous fans of Young Rebel Star Prabhas have been waiting for the updates of his upcoming entertainer directed by Radhakrishna Kumar. Fans got super...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show