Home Politics కళాతపస్వి తో కేసీఆర్

కళాతపస్వి తో కేసీఆర్

కళాతపస్వి తో కేసీఆర్

దర్శకుడు కాశీనాధుని విశ్వనాథ్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ఈరోజు ఆత్మీయంగా పరమార్చించారు . గత కొంత కాలంగా విశ్వనాథ్ ఆరోగ్య పరిస్థితి బాగుండటం లేదు .విశ్వనాథ్ వయసు 89 సంవత్సరాలు. వయసు ప్రభావంతో వచ్చిన అనారోగ్యతో విశ్వనాథ్ తరచూ ఆసుపత్రులకు వెడుతున్నారు . ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు హైదరాబాద్ ఫిలిం నగర్లో వున్న దర్శకుడు విశ్వనాధ్ నివాసానికి వెళ్లి పరామర్శించారు .

పద్మశ్రీ , దాదాసాహెబ్ ఫాల్కే అవార్దీ అయినా విశ్వనాధ్ తెలుగు వారు గర్వించతగ్గ అనేక సినిమాలు రూపొందించారు . తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను తన సినిమాల ద్వారా ఖండంతరాలకూ వ్యాపింపజేసిన గొప్ప దర్శకుడు విశ్వనాథ్ . విశ్వనాథ అంటే కేసీఆర్ కు ఎంతో అభిమానం ,గౌరవం . అందుకే వారి ఇంటికి వెళ్లి ఆరోగ్యం గురించి వాకబు చేశారు . ఇద్దరు కాసేపు ముచ్చటించుకున్నారు .

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ