Home Politics జనసేనానితోనే ... జేడీ

జనసేనానితోనే … జేడీ

జనసేనానితోనే … జేడీ

జేడీ లక్ష్మీనారాయణ తన మిత్రుడు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ను వదిలి పెట్టి భారతీయ జనతా పార్టీలో చేరిపోతున్నారని . పార్టీ లక్షనారాయణకు ముఖ్యమైన బాధ్యతలను అప్పగించబోతుందని అటు మీడియా ఇటు సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి . జనం కూడా దీన్ని బాగా నమ్మరు . కారణం గత కొంతకాలంగా జెడి లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్ మధ్య మాటా మంతీ లేవు . అందుకే వీరి మధ్య దూరం పెరిగిందని వార్తలు వండి వడ్డించారు .

నిజానికి గత కొంతకాలంగా ఇద్దరి మధ్య సమావేశం జరగలేదు . పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కమిటీలు వేసిన అందులో జేడీ ప్రస్తావన లేదు . ఎన్నికలు అయిపోయిన తరువాత జేడీ క్రమంగా జనసేనకు దూరమవుతూ వస్తున్నాడని , జనసేన పార్టీని వదిలి భారతీయ జనతా పార్టీలో చేరిపోతున్నాడనే ప్రచారం ఎక్కువైంది . మొన్న జరిగిన ఎన్నికల్లో జెడి విశాఖ పట్టణం నుంచి జనసేన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేశాదు . అక్కడ జేడీకి 2,88, 754 ఓట్లు వచ్చాయి . ఇది కేవలం జెడి కి వున్న పలుకుబడి. పవన్ కళ్యాణ్ రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయారు .

అయితే జెడి జనసేనను వీడిపోతారనే వార్తలు తరువాత పవన్ , జెడి మధ్య ఏమిజరిగిందో తెలియదు . కానీ తానూ జనసేన పార్టీని వీడి పోవడం లేదని లక్ష్మీనారాయణ ప్రకటించారు . ఇది తాత్కాలిక మేనా ? లేక … ?

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ