Home Politics కుమార్తె వర్షా రెడ్డి కోసం జగన్ అమెరికా పర్యటన

కుమార్తె వర్షా రెడ్డి కోసం జగన్ అమెరికా పర్యటన

కుమార్తె వర్షా రెడ్డి కోసం జగన్ అమెరికా పర్యటన

ఈనెల 15న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై . ఎస్ .జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో అమెరికా పర్యటనకు వెడుతున్నారు . జగన్ మోహన్ రెడ్డి శ్రీమతి భారతి ఇద్దరు కుమార్తెలు అమెరికాలో చదువుతున్నారు . రెండవ కుమార్తె వర్షా రెడ్డి ని అమెరికాలోనే ఒక విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ కోర్సు లో చేర్పించడానికి జగన్ మోహన్ రెడ్డి భార్యతో వెడుతున్నారు . ఈనెల 15న విజయ వాడలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జండా ఆవిష్కరిస్తారు . అదే రోజు హైదరాబాద్ చేరుకొని రాత్రికి అమెరికా ప్రయాణమవుతారు .

అమెరికాలో రెండవ కుమార్తె వర్షా రెడ్డి ని గ్రాడ్యుయేషన్ కోర్స్ లో చేర్పించిన తరువాత డల్లాస్ లోని కె బెయిలీ హచిసేన్ కన్వెన్షన్ సెంటర్ లో తెలుగు ప్రజలతో జరిగే సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారు . అనంతరం ఈ నెల 24న జగన్ మోహన్ రెడ్డి భారత దేశానికి తిరిగి వస్తారు .

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ