fbpx
Home Politics చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు

చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు

చంద్రబాబునాయుడు కరకట్టపై అక్రమంగా నివాసముంటున్న ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. గడచిన ఐదురోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు  కృష్ణానది పొంగి పొరలుతోంది. దాంతో కరకట్ట మీదకు కూడా వరద నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పటికే కరకట్ట మీద అక్రమంగా నిర్మించిన కొన్ని ఇళ్ళల్లోకి వరద నీరు వచ్చేస్తోంది. ఇందులో భాగంగానే చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ లోకి కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి.

గెస్ట్ హౌస్ మెట్లు ప్రస్తుతానికి  నీళ్ళల్లో ముణిగిపోయాయట. అందుకనే క్రింది అంతస్తులో ఉన్న మొత్తం ఫర్నీచర్ ను సిబ్బంది మొదటి అంతస్తుపైకి తరలిస్తున్నారు. ఇంట్లో కూడా నీళ్ళు వచ్చే ప్రమాదం ఉందని సిబ్బందికి అర్ధమైపోయింది. అందుకనే లారీల కొద్దీ ఇసుకను, ఇసుక బస్తాలను తెప్పించి గెస్ట్ హౌస్ చుట్టు రక్షణగా పేరుస్తున్నారు. సరే నది మరింత పొంగితే ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా ఉపయోగం ఉండదని అందరికీ తెలిసిందే.

ఈ విషయం చంద్రబాబుకు కూడా బాగా తెలుసు. అందుకనే తమ వాహనాలన్నింటినీ గెస్ట్ హౌస్ నుండి వేరే రిసార్ట్ కు తరలించారు. ముందు జాగ్రత్తగా కుటుంబంతో కలిసి హైదరాబాద్ కు వెళ్ళిపోయారు. అంటే ఇపుడు కరకట్టపై జరగరానిది ఏమైనా జరిగినా చంద్రబాబుకు, కుటుంబానికి మాత్రం ఏమీ ఇబ్బంది లేదు. మరి ఇంటికి కాపలాగ ఉండే సిబ్బంది మాటేమిటి ?

ఈ విషయాన్నే జగన్ నొక్కి మరీ చెప్పారు. కరకట్టను ఆక్రమించి కట్టుకున్న నివాసాలకు కృష్ణానది నుండి ప్రమాదం ఉందని మరీ మరీ చెప్పారు. ఇల్లు ఖాళీ చేయమని జగన్ చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. జగన్ కు రాజకీయాలు ఆపాదించి లబ్దిపొందే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ఇంకా అక్రమ నివాసంలోనే ఉంటున్నారు. మరి తాజా పరిస్ధితుల్లో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.

 

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}