fbpx
Home Politics షాకింగ్ న్యూస్ : స్ట్రాంగ్ రూమ్ ల పై గుసగుసలు

షాకింగ్ న్యూస్ : స్ట్రాంగ్ రూమ్ ల పై గుసగుసలు

తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. కానీ ఫలితాల పై అందరిలో ఉత్కంఠ మొదలైంది. ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూములో భద్రపరిచారు. కానీ ఈవీఎంల భద్రతపై అందరికి అనుమానాలు మొదలయ్యాయి. టిఆర్ఎస్ వారు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టిఆర్ఎస్ వారికి కొంత మంది అధికారులు మద్దతిస్తున్నారని  వారు సపోర్టుతో ఈవీఎంల ట్యాంపరింగ్ కు అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

ఈ వార్తలతో అలర్ట్ అయిన కాంగ్రెస్ శ్రేణులు స్ట్రాంగ్ రూముల వద్ద తమ పార్టీ నాయకులను నిరంతర భద్రతకు అనుమతించాలని కోరారు. సీఈవో రజత్ కుమార్ వెంటనే అంగీకరించి వారికి అనుమతిచ్చారు.

స్పేర్ గా తెచ్చి వాడకుండా మిగిలి ఉన్న ఈవీఎంలలో టిఆర్ఎస్ గుర్తుకు ఓటు వేసి మిగిలిన వాటిని మార్చే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రజా ఫ్రంట్ అభ్యర్దులు గెలిచే దగ్గర ఇలాంటి అక్రమాలు జరగవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని పై అలర్ట్ అయిన ఈసీ భద్రతా బలగాలతో పాటే కాంగ్రెస్ కార్యకర్తలు అందుబాటులో ఉండాలని సూచించారు.

ఈవీఎంలలో రహస్యంగా బ్లూ టూత్ చిప్ప్ అమర్చారని అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ కుమార్ అన్నారు. సాంకేతికంగా చొచ్చుకుపోయి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చన్నారు. అందుచేత జామర్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ట్యాంపరింగ్ పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాటింగ్ క్లిప్పులు చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల విధుల్లో పాల్గొన్న వ్యక్తే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ చాట్ చేశారు. ఆ ఫోటోలు కింద ఉన్నాయి చూడండి.

 

 

 

 

 

 

 

 

ఈ చాటింగ్ ఇప్పుడు అందరిలో కలవరాన్ని సృష్టిస్తోంది. నిజంగానే స్ట్రాంగ్ రూంలలో ట్యాంపరింగ్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ కు అవకాశమే లేదని మూడంచెల  భద్రతా ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. ఆర్వోలు కూడా సెంటర్ లోకి ఎవరు వెళ్లినా బుక్ రికార్డు పెట్టి పేర్లు నమోదు చేస్తున్నారు. పట్టిష్ట భద్రత ఉందని ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని వారు అన్నారు.    

 

కలకలం సృష్టిస్తోన్న సివిఎస్ ఆర్ కాలేజి బస్సులలో ఈవీఎంల తరలింపు 

సివిఎస్ ఆర్ కాలేజికి చెందిన బస్సులలో ఈవీఎంలను తరలించారు. దీని పై కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సివిఎస్ ఆర్ కాలేజి టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందినదని కాలేజి బస్సులలో తరలిలంచడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫోటోలు కింద ఉన్నాయి చూడండి. 

 

 

ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత ఈ కింది వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఇది  కాంగ్రెస్ లో కలవరం మొదలవుతుంది.  ఆ పోస్ట్ కింద ఉంది చూడండి. 

 

ఫ్లాష్….ఫ్లాష్….ఫ్లాష్

గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ ఉత్తమ కుమార్ రెడ్డి గారికి, కోదండరాం గారికి, చాడా వెంకటరెడ్డి గారికి, గద్దర్ గారికి, మంద కృష్ణ మాదిగ గారికి, చెరుకు సుధాకర్ గారికి మరియు
తెలంగాణా తెలుగుదేశం, కాంగ్రెస్, సీపీఐ, తేజస ముఖ్యనాయకులకు, మహాకూటమి అభ్యర్థులకు, ప్రజాస్వామ్యవాదులకు, మేధావులకు, పత్రికలకు మీడియాకి ముఖ్య విజ్ఞప్తి, హెచ్చరిక !

ఈరోజు ఉదయం నుండీ ఇప్పటివరకు నాకు అత్యంత సన్నిహితుల ద్వారా అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈరాత్రికి రాష్ట్రంలో చాలాచోట్ల ఈవీఎం ( ఎలెక్ట్రానికి ఓటింగ్ మెషీన్ల ) ల టెంపరింగు జరగబోతున్నట్లు తెలుస్తోంది.

కొంతమంది ముఖ్యమైన అధికారుల సహకారంతో ఓటింగ్ మెషీన్లలో మతలబులు చేయడం, ఓట్లను మార్చే ప్రయత్నాలు జరుగబోతున్నాయనేది విశ్వసనీయ సమాచారం.

ఈరోజు రాత్రి నుండీ 11 వతేదీ ఉదయం 10 గంటల వరకూ ఈవీఎం లు భద్రపరచిన స్ట్రాంగ్ రూములు & ప్రతి కౌంటింగ్ స్టేషన్ల వద్ద మహాకూటమి నాయకులు డేగకళ్ళతో 24X7 కాపలా కాచుకోకపోతే ప్రజాస్వామ్యానికి చాలా తీవ్రప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
తస్మాత్ జాగ్రత్త !

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ