fbpx
Home Politics చంద్రబాబుకు ఇసి షాక్..సిట్ అవసరమా ?

చంద్రబాబుకు ఇసి షాక్..సిట్ అవసరమా ?

ఫారం 7 దాఖలుపై వైసిపిని జగన్మోహన్ రెడ్డిని తప్పు పడుతున్న చంద్రబాబానాయుడుకు ఎన్నికల కమీషన్ పెద్ద షాక్ ఇచ్చింది. ఫారం 7 విషయంలో జగన్ తప్పు చేశారని కాబట్టి ఫారం 7 దాఖలుపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే అదే విషయమై ఇసి స్పష్టమైన వైఖరిని ప్రకటించింది.

ఎన్నికల సంఘం కమీషనర్ గోపాల కృష్ణ ద్వివేది మీడియాతో మాట్లాడుతూ, దొంగఓట్ల తొలగింపు కోరుతు ఒకే వ్యక్తి ఎన్ని ఫారం 7 అయినా దాఖలు చేయవచ్చని స్పష్టం చేశారు. ఫారం 7 దాఖలు చేయటమంటే ఓటు తొలగించమని చెప్పటం కాదన్నారు. దొంగఓటు ఉంది కాబట్టి విచారణ జరిపించమని రిక్వెస్ట్ చేయటమే అంటూ క్లారిటీ ఇచ్చారు.

తాజాగా ద్వివేది ఇచ్చిన క్లారిటీతో ఒకరకంగా చంద్రబాబుకు దిమ్మ తిరిగినట్లే. ఎందుకే ఇదే అంశంపై సిట్ ఏర్పాటు చేశారు చంద్రబాబు. అంటే సిట్ ద్వారా వైసిపి శ్రేణులను వేధించటం, అరెస్టులు చేయటమే ప్రభుత్వ ఉద్దేశ్యంగా అర్ధమైపోతోంది. నిజానికి ఫారం 7 దాఖలు చేయటంలో తప్పేలేదు. ఆ విషయం చంద్రబాబు అండ్ కోకు బాగా తెలుసు. అయినా సరే సిట్ వేయటంలో ఉద్దేశ్యం ఏమిటో స్పష్టంగా అర్దమైపోతోంది. తాజాగా ఇసి ఇచ్చిన క్లారిటీతో సిట్ ఏర్పాటు ఏమవుతుందో చూడాలి.

 

 

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ