Home Politics పొట్టి డ్రెస్సులు వేసుకునే భార్య వద్దని విడాకులకు అప్లై చేసిన కలెక్టర్

పొట్టి డ్రెస్సులు వేసుకునే భార్య వద్దని విడాకులకు అప్లై చేసిన కలెక్టర్

కాపురం అన్నాక భార్యాభర్తల మధ్య రకరకాల గొడవలు వస్తుంటాయి. కొన్నివిషయాల్లో భర్త, మరికొన్ని విషయాల్లో భార్య సర్దుకుపోతే సమస్యలు వాటంతట అవే సమసిపోతాయి. కానీ ఉత్తరప్రదేశ్ లోని ఓ వ్యక్తి మాత్రం విచిత్రమైన కారణం చెప్పి విడాకులకు దరఖాస్తు చేశాడు.

 తన భార్య పొట్టి షార్టులు వేసుకుని వీధుల్లో తిరుగుతోందనీ, ఇంగ్లిష్ లో మాట్లాడుతూ తనను అవమానిస్తోందని ఏకంగా ఓ జిల్లా కలెక్టర్ కోర్టును ఆశ్రయించాడు. ఇందుకు పోటీగా తనకు న్యాయం చేయాలంటూ సదరు కలెక్టర్ భార్య అతని ఇంటిముందు ఆందోళనకు దిగింది. ఈ ఘటన బిహార్ రాజధాని పాట్నాలో జరిగింది. అసలు వివరాలు ఏంటంటే…


2013 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ధర్మేంద్ర కుమార్ జామూయి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు 2015 మార్చి 11 న పాట్నాకు చెందిన యువతి వత్సలను పెళ్లి చేసుకున్నారు. వివాహ సమయంలో ఆమె చదువుతుండటంతో ఆమె ఢిల్లీలోనే కొంత కాలం ఉంది. చదువు పూర్తి అయిన తర్వాత తిరిగి భర్త వద్దకు వచ్చింది. 

కొత్తల్లో అంతా బాగానే ఉన్నప్పటికీ, ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. వత్సల ఢిల్లీలో ఉండడంతో మోడరన్ దుస్తులు ధరించేది. ఇంగ్లీషు కూడా బాగా మాట్లాడేది. పొట్టి పొట్టి షార్టులు వేసుకొని తిరుగుతుందని ధర్మేంద్ర అసహానానికి గురయ్యాడు. తాను కలెక్టర్ నని అలా తిరగవద్దంటూ ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. అయినా కూడా ఆమెలో మార్పు రాలేదు. దీంతో ధర్మేంద్ర కుమార్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కాడు.

ఇంగ్లిష్ లో మాట్లాడుతూ వత్సల తనను అవమానిస్తోందనీ, పొట్టిపొట్టి బట్టలు వేసుకుని వీధుల్లో తిరుగుతోందని ఆరోపించాడు. తాను ఎంతగా నచ్చజెప్పినా వినడం లేదని వాపోయాడు. మరోవైపు తన భర్త చెప్పేది వాస్తవం కాదని వత్సల తెలిపింది. కాపురంలో గొడవలపై మాట్లాడేందుకు తాను తల్లితో కలిసి ఇంటికిరాగా గార్డులు అడ్డుకున్నారని పేర్కొంది. ధర్మేంద్ర కుమార్ తనకు అన్యాయం చేస్తున్నారనీ, ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేసింది. మరోవైపు ఈ వివాదాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని ధర్మేంద్ర ప్రకటించారు.  

ఆయనమే కలెక్టర్ ఆమెనేమో పోస్ట్ గ్రాడ్యూయేట్. ఇద్దరూ విద్యావంతులే సమాజంలో పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వారు ఇలా బజారుకెక్కి పోట్లాడుకోవడంతో అంతా చర్చనీయాంశమైంది. వత్సల మాత్రం తాను ఢిల్లీలో ఉన్నాను కాబట్టి సాధారణంగా ఇంట్లో ఉన్నట్టుగానే ఉన్నాను కానీ బయటికి వెళ్లలేదన్నారు. కలెక్టర్ భార్యగా అతని గౌరవ మర్యాదలు కాపాడానే కానీ ఆయన అవమాన పడే విధంగా తాను చేయలేదన్నారు. తన భర్త ఇలా ఎందుకు చేస్తున్నాడో తనకు అర్ధం కావడం లేదని వత్సల తెలిపింది. 

తాను చేయకూడని తప్పేమి చేశానని ప్రశ్నించింది. తాను కూడా చదువుకున్నానని తనకు అన్ని తెలుసని వత్సల తెలిపింది. తాను గొడవలకు సంబంధించి మాట్లాడడానికే తన తల్లితో వచ్చానని కానీ గార్డులు తనను అడ్డుకున్నారని తెలిపింది. అందుకే తనకు న్యాయం జరిగే వరకు ఇంటి ముందు బైటాయిస్తానని తెలిపింది. తాను తన భర్తతో కలిసి ఉండేందుకు సిద్దంగా ఉండానని తన భర్త కూడా అర్ధం చేసుకోవాలని కోరింది. కలెక్టర్ తీరును మరికొంత మంది తప్పు పడుతున్నారు. అన్ని తెలిసిన వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. ఏమైనా వివాదాలు ఉంటే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి కానీ ఇలా బజారుకెక్కడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

 

Recent Posts

సిట్ ఏర్పాటుపై తెలుగు దేశం గుండెల్లో పరిగెత్తుతున్న రైళ్లు 

ప్రతివారం మొక్కు తీర్చుకుంటున్నట్లే ఈ వారం కూడా తన బాధ ప్రపంచం బాధ అన్నట్లు రోతపలుకుల రాధాకృష్ణ  "రాజు కక్షకు రాజ్యం బలి" అనే మకుటం కింద   వలవల ఏడుస్తూ మనలను కూడా...

అసైన్డ్ భూముల సేకరణ వైసిపికి మెడ మీద కత్తే!

ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అందుకు అవసరమైన భూముల సేకరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్లు ఇతర రెవిన్యూ సిబ్బంది...

అయిదు ఏళ్ల పాలనపై సిట్! నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!

రాష్ట్ర విభజన తర్వాత అయిదు ఏళ్ల కాలంలో టిడిపి ప్రభుత్వం సాగించిన పరిపాలన పై మొత్తంగా విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బహుశా దేశంలోనే ఈలాంటి విచారణ ఇంతకు...

ఎత్తుకు పై ఎత్తుల్లో తెలుగు దేశం చిత్తు

చంద్రబాబు నాయుడు ప్రాపకం ఏ మాత్రం లేకుండా తుడిచి పెట్టే ఎత్తులో మూడు రాజధానుల ప్రతిపాదన ముఖ్యమంత్రి తెరమీదకు తెచ్చారు. అయితే రాజధాని రైతుల ఆందోళన దానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు...

నిన్న సుక్కు .. నేడు వంశీ పైడిప‌ల్లి?

మ‌హేష్ క్రేజీ డైరెక్ట‌ర్‌ల‌తో ఆడుకుంటున్నాడా?.. త‌న‌కు న‌చ్చలేద‌ని ఇష్టం వ‌చ్చిన‌ట్టు డైరెక్ట‌ర్‌ల‌ని మార్చేస్తున్నాడా? అంటే జ‌రుగుతున్న ప‌రిణామాల్ని చూసిన ఇండ‌స్ట్రీ జ‌నాలు నిజ‌మే అంటున్నారు. `మ‌హ‌ర్షి` త‌రువాత మైత్రీలో మ‌హేష్ హీరోగా కొత్త...

త‌రుణ్‌భాస్క‌ర్ ఇలా షాకిచ్చాడేంటి?

టాలీవుడ్‌కు రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని హీరోగా అందించిన త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌కుడిగా సినిమా చేసి దాదాపు రెండేళ్ల‌వుతోంది. `మీకు మాత్ర‌మే చెప్తా` అంటూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎలా హ‌డావిడిగా ఈ...

తేజ బర్త్‌డేకు డ‌బుల్ ధ‌మాకా ఇచ్చాడు!

కెరీర్ తొలి నాళ్ల‌లో ద‌ర్శ‌కుడిగా సంచ‌ల‌నం సృష్టించిన తేజ జోరు ఇటీవ‌ల బాగా త‌గ్గిపోయింది. వ‌రుస ఫ్లాపులు.. నిర్మాత‌ల‌తో వివాదాలు.. ఇక సినిమాలు ఆపేయాలేమో అనే స‌మ‌యంలోనే రానాతో `నేనే రాజు నేనే...

`భీష్మ‌` ఓపెనింగ్ అదిరింది!

నితిన్ న‌టించిన తాజా చిత్రం `భీష్మ‌`. టీజ‌ర్ రిలీజ్ నుంచే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ మొద‌లైంది. తొలి రోజు తొలి షో నుంచి హిట్ టాక్ రావ‌డంతో సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అని...

ఫ్లాప్ డైరెక్ట‌ర్‌తో రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌యోగం!

సినిమా ఇండ‌స్ట్రీలో హిట్ మాత్ర‌నమే మాట్లాడుతుంది. ఏదైనా చేస్తుంది. ఎంత వ‌ర‌కైనా తీసుకెళుతుంది. అడ‌గ‌ని అంద‌లం ఎక్కిస్తుంది. అదే ఒక్క ఫ్లాప్ ప‌డిందా అదఃపాతాళానికి తొక్కేస్తుంది. దీన్ఇన బ‌ట్టే ఇక్క‌డ క‌థ‌లు, కాంబినేష‌న్‌లు,...

తెలుగోడా – ఆపక్కనుంటావా? – ఈ పక్కనుంటావా?

"విశ్వసనీయత కోల్పోతున్న మీడియా, దిగజారుతున్న విలువలు," అని ఒక ఆంగ్ల పత్రికలో వ్యాసం. "రాజధాని గుండె పగిలింది" అంటూ ఒక తెలుగు పత్రికలో ప్రత్యేక కథనం. "రాజధాని అక్రమాలపై సిట్" అంటూ మరో...

Featured Posts

సిట్ ఏర్పాటుపై తెలుగు దేశం గుండెల్లో పరిగెత్తుతున్న రైళ్లు 

ప్రతివారం మొక్కు తీర్చుకుంటున్నట్లే ఈ వారం కూడా తన బాధ ప్రపంచం బాధ అన్నట్లు రోతపలుకుల రాధాకృష్ణ  "రాజు కక్షకు రాజ్యం బలి" అనే మకుటం కింద   వలవల ఏడుస్తూ మనలను కూడా...

అయిదు ఏళ్ల పాలనపై సిట్! నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!

రాష్ట్ర విభజన తర్వాత అయిదు ఏళ్ల కాలంలో టిడిపి ప్రభుత్వం సాగించిన పరిపాలన పై మొత్తంగా విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బహుశా దేశంలోనే ఈలాంటి విచారణ ఇంతకు...

ఎత్తుకు పై ఎత్తుల్లో తెలుగు దేశం చిత్తు

చంద్రబాబు నాయుడు ప్రాపకం ఏ మాత్రం లేకుండా తుడిచి పెట్టే ఎత్తులో మూడు రాజధానుల ప్రతిపాదన ముఖ్యమంత్రి తెరమీదకు తెచ్చారు. అయితే రాజధాని రైతుల ఆందోళన దానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు...