Home Politics ‘ఆంధ్రాబంధు’ను కోల్పోయాం : చంద్రబాబు ఆవేదన

‘ఆంధ్రాబంధు’ను కోల్పోయాం : చంద్రబాబు ఆవేదన

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాప ప్రకటన

 

అటల్ బిహారీ వాజపేయి మృతితో భారతదేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది. . ఆయన మృతి భారత దేశానికి తీరనిలోటు. వాజ్ పేయి ఉదారవాది, మానవతావాది. కవి, సిద్ధాంతకర్త. మంచి వక్త..నిరాడంబరుడు.. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం వరకు పనిచేశారు.
తాను నమ్మిన ఆదర్శాలను నిజజీవితంలో ఆచరించి చూపించారు. ఎంపిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా, విదేశాంగ మంత్రిగా, ప్రధానమంత్రిగా, బహుముఖ పాత్ర పోషించారు.అత్యత్తమ పార్లమెంటేరియన్.

పార్లమెంటులో అద్భుతమైన ప్రసంగాలతో సమకాలీకులకు మార్గదర్శకం చేశారు. పార్లమెంటేరియన్ గా 4దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉంది.10సార్లు లోక్ సభకు,రెండుసార్లు రాజ్యసభకుఎన్నికైనారు. జనసంఘ్ అధ్యక్షుడిగా,జనతా పార్టీ నాయకుడిగా,తరువాత బిజెపి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు.

ప్రధానిగా విశ్వాస పరీక్షలో ఒక ఓటుతో తన ప్రభుత్వం ఓడిపోయినా ఏమాత్రం చలించని మేరునగ ధీరుడు. 13రోజులు ప్రధానమంత్రిగా పనిచేసినా,13నెలలు ఉన్నా,పట్టుదలతో పనిచేసి 5ఏళ్లు ప్రధానిగా దేశ ప్రజలపై చిరకాల ముద్రవేశారు. అన్ని తరాల వారితో కలిసి పని చేసిన ఘనత వాజ్ పేయికే దక్కుతుంది, ఐదు తరాలకు వారధి…

1984లో కేవలం 2సీట్లకే పరిమితం అయిన భారతీయ జనతాపార్టీని ఈ రోజు 270 సీట్లకు బిజెపి ఎదిగేలా చేయడంలో అటల్ బిహారీ వాజ్ పేయిదే ప్రధాన పాత్ర. వాజ్ పేయి మంత్రివర్గంలో ఏడెనిమిది మంత్రి పదవులు ఇవ్వడానికి ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బైటనుంచి ఎన్డీఏ-1 ప్రభుత్వానికి మద్ధతు ఇచ్చామే తప్ప మంత్రి పదవులు తీసుకోలేదు.

అబ్దుల్ కలామ్ ను రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రతిపాదించడంలో కూడా నేనే స్వయంగా చొరవ తీసుకుని అటు వాజ్ పేయితో మాట్లాడటం,ఇటు అబ్దుల్ కలామ్ ను ఒప్పించడంలో క్రియాశీలంగా వ్యవహరించాను. ప్రధానమంత్రిగా అన్ని రాష్ట్రాలలో పెద్దఎత్తున ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేశారు.గత 32 ఏళ్లలో అభివృద్ధి చెందిన రోడ్లలో సగం, వాజపేయి నేతృత్వంలోని ఎన్.డి.ఎ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి చెందినవే . నదుల అనుసందానానికి,స్వర్ణ చతుర్భుజి రహదారుల నిర్మాణానికి విశేష కృషి చేశారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వాజ్ పేయి తోడ్పాటు: తడ నుంచి ఇచ్చాపురం వరకు నేషనల్ హైవే నెం.5 అభివృద్దికి,వెలుగు ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నిధులు రావడంలో,ఫుడ్ ఫర్ వర్క్ కింద 50వేల టన్నుల బియ్యం కేటాయింపులో, మైక్రో ఇరిగేషన్(బిందు,తుంపర సేద్యం) అభివృద్ధిలో, హైదరాబాద్ లో ఐటి రంగం అభివృద్ధికి, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో వాజ్ పేయి సహకారం మరువలేనిది.

మైక్రో ఇరిగేషన్ పై టాస్క్ ఫోర్స్ కు ఛైర్మన్ గా నన్ను నియమించినప్పుడు దేశంలో 3మిలియన్ హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ (డ్రిప్ ఇరిగేషన్ 2మిలియన్ హెక్టార్లు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ 1 మి.హెక్టార్లు) చేపట్టాలని అప్పట్లో ఇచ్చిన టాస్క్ ఫోర్స్ నివేదికలో పేర్కొన్నాం.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మైక్రో ఇరిగేషన్ ను 33లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాలకు తీసుకెళ్లాలని సంకల్పంగా పెట్టుకున్నాం.

వ్యక్తిగతంగా,పార్టీపరంగా నాకు వాజ్ పేయితో అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఆయన పరిపాలన,రాజకీయ అనుభవాలు ‘‘వాజ్ పేయి శకం’’గా భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోతుంది.

Recent Posts

ఇంటికొచ్చి ఇస్తా అన్న ఆ — ఎక్కడ?

కోవిడ్-19 విజృంభనతో దేశం మొత్తం లాక్ డౌన్ అయిపోయింది. ఈ సమయంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా నిత్యావసరాలు, అలాగే రేషన్ వంటి వాటిని అందించేందుకు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్...

ఆ మాజీ ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తు ముగినట్టేనా?

దశాబ్దాలుగా కమ్యూనిస్టులకు కోటలుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. మూస సిద్ధాంతాలతో మసకబారుతున్నాయి. మచ్చలేని ప్రజా నాయకులుగా వెలిగిన వారు.. పలుమార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన వారు.. ఇప్పుడు ఆర్థిక స్థోమత లేక...

సబ్బం హరి ఆ పని చేయడం వల్లే జగన్‌ దూరం పెట్టారా?

మంచి మాటకారిగా పేరు తెచ్చుకున్న మాజీ ఎంపీ సబ్బం హరి మాటలు.. ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియాకు మంచి సరుకుగా, జగన్‌పై విమర్శలు సంధించేందుకు అస్త్రాలుగా మారుతున్నాయి. సమయం, సందర్బం అంటూ ఏదీ...

హాట్ యాంక‌ర్‌కి మెగా ఆఫ‌ర్‌!

హాట్ యాంక‌ర్ రంగ‌మ్మ‌త్త అన‌సూయ‌కు మ‌రో మెగా ఆఫ‌ర్ త‌గిలిన‌ట్టు తెలిసింది. `రంగ‌స్థ‌లం`లో రంగ‌మ్మ‌త్త‌గా గోల్డెన్ ఛాన్స్ కొట్టేసి ఓ ద‌శ‌లో రామ్‌చ‌ర‌ణ్‌నే డామినేట్ చేసిన అన‌సూయ‌కు ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిత్రంలో...

పుట్టిన రోజు లేదు .. పెళ్లీ కూడా వాయిదా!

ప్ర‌పంచం క‌రోనా వైర‌స్ కార‌ణంగా అల్ల క‌ల్లోలం అవుతోంది. ఎక్క‌డ చూసినా క‌రోనా మ‌ర‌ణాలే. దేశం క‌రోనా కార‌ణంగా భ‌యంతో కంపించిపోతోంది. ఈ ప‌రిస్థితుల్లో ముఖ్య‌మైన కార్య‌క్రమాల‌న్నింటినీ జ‌నం వాయిదా వేసుకుంటున్నారు. కొన్నింటిని...

`ఉప్పెన‌`కు క‌త్తెరేస్తున్న ద‌ర్శ‌కుడు!

సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం `ఉప్పెన‌`. మైత్రీ మూవీమేక‌ర్స్‌తో క‌లిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆయ‌న శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం...

అల్లు అర్జున్ ప్లాన్‌కి క‌రోనా దెబ్బ‌!

2020... ఈ ఇయ‌ర్ హీరో అల్లు అర్జున్‌కు.. క‌రోనా వైర‌స్‌కు చాలా స్పెష‌ల్ ఇయ‌ర్‌. మాన‌వాళికి మాత్రం కాళ‌రాత్రుల్ని ప‌రిచ‌యం చేస్తున్న ఇయ‌ర్. ఈ ఏడాది అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో...

తెలంగాణలో కరోనా తొలి మరణం వెనుక భయానక వాస్తవాలు!

తెలంగాణలో కోవిడ్-19 తొలి మరణం నమోదైంది. నాంపల్లికి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు మరణించిన అనంతరం.. చేసిన పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. పెద్ద వయసు కాబట్టి కరోనా వైరస్‌...

బీటలు వారుతోన్న తెలుగు దేశం పునాదులు..

తెలుగు దేశం పార్టీ.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, దేశ రాజకీయాల్లో ఓ నూతన ఓరవడికి శ్రీకారం చుట్టిన ప్రాంతీయ కెరటం. తెలుగువారి 'ఆత్మగౌరవ' నినాదంతో 1982 మార్చి 9న విశ్వవిఖ్యాత నటుడు నందమూరి...

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...