Home Andhra Pradesh Amaravathi ట్విట్టర్ వీరుడా లేక ప్రజా నాయకుడా ?

ట్విట్టర్ వీరుడా లేక ప్రజా నాయకుడా ?

మాజీ మంత్రి(ఎం .ల్.సి  కోటా) నార లోకేష్ బాబు, ఈయన పేరు తెలియని వారు లేరు ఆంధ్రప్రదేశ్ లో , అయన చేసే వ్యాఖ్యలతో , ట్వీట్స్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అయన ఇంటి (తాతగారి ) పార్టీ అయినా టి.డి.పి లో అయితే చెప్పనక్కర్లేదు. ఆయనను ఒక యువరాజులా చూస్తారు. అయన ఎక్కడికి వెళ్లిన బ్రహ్మరధం పడతారు. గత ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలలో అయన ప్రమేయంతో అమలు చేయబడేవి అని అందరు అనుకునేవారు.

ఇక విషయానికి వస్తే నారా లోకేష్ గారు 2009  ఎన్నికలతోనే అరంగేట్రం చేసినా, 2014 లో తెరంగేట్రం చేసి ఒకే సారి మంత్రిపదివి(ఎం.ల్.సి కోటాలో) దక్కించుకున్నారు. ఇక ప్రత్యక్ష ఎన్నికలలో అడుగుపెట్టింది మాత్రం 2019 (ఏప్రిల్ ) లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అయన ఓటమిపాలు అయ్యారు అది వేరే విషయం. ఇక పొతే రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు సాధారణమే. ఒక్కో సారి అవి పరిధిదాటి వెళ్లిపోతుంటాయి. నారా లోకేష్ గారు కూడా ప్రత్యర్థుల మీద విమర్శల బాణాలు సంధిస్తుంటారు ట్విట్టర్ లో. అప్పుడప్పుడు అవి అబాసుపాలు అయినా సందర్భాలు కూడా ఉన్నాయి. పలు సందర్భాలలో అయన జగన్ మోహన్ రెడ్డి గారిని కూడా విమర్శించారు. అయన మీద ఉన్న అవినీతి ఆరోపణలను ఉటంకిస్తూ ఆయనను ” దొంగాబ్బాయి ” అని సంభోదించేవారు నారా లోకేష్ గారు. అంతే కాదు దివంగత నేత , మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని కూడా వదిలి పెట్టలేదు నారాలోకేష్ గారు. వారి కుటుంబ సభ్యులను కూడా పలుసార్లు వివాదాల్లోకి లాగారు అయన.

ఇంత జరిగినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి గారు ఆయనను లక్ష్యం గా చేసుకొని విమర్శలు చెయ్యలేదు , ఎదో ఒకటి రెండు సందర్భాలలో అయన గురించి వ్యగంగా మాట్లాడారు తప్ప  ఆయనను పరిగణలోకి తీసుకోలేదు. ఇక్కడ మనం గమనించవల్సిన విషయం ఏమిటి అంటే ,జగన్ మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా నారా లోకేష్ గారిని ఒక నాయకుడిగా గుర్తించక పోవడం. 2009 నుండి టి.డి.పి లో లోకేష్ గారి హావ కొనసాగుతున్నప్పటికీ ,తెలుగు మీడియా మొత్తం ఆయనను ఆకాశానికి ఎత్తినప్పటికీ ,జగన్ గారు మాత్రం ఆయనను ఏనాడు పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం గా ఉంది. ఆయనను ఒక ఆటలో అరటిపండులా తీసిపారేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవ్వన్నీ చూస్తుంటే జగన్ మోహన్ రెడ్డి గారు లోకేష్ గారిని ఒక ట్విట్టర్ యోధుడిలా చూస్తున్నారు తప్పితే , నిజమైన ప్రజానాయకుడిలా, తన సమకాలీన  రాజకీయ నాయకుడిలా గుర్తించడం లేదని అర్ధం అవుతుంది.

వైస్సార్సీపీ లో ఉన్న కొంత మంది నాయకులు మాత్రమే లోకేష్ గారిని విమర్శించడం ,దానికి తోడు అయన గత ఎన్నికలలో ఓటమిపాలు అవడం, తరువాత జరిగిన పరిణామాల్లో మీడియాను సరిగా ఎదురుకొనలేక పోవడం, ట్విట్టర్ వరకే పరిమితవడం అయన పరిస్థితిని మరింత కిందకి నెట్టినట్టు అనిపిస్తుంది.ఇలా కొనసాగితే అయన భవిష్యత్తులో ఒక ట్విట్టర్ వీరుడిలా మిగిలిపోతారు తప్పా ప్రజా నాయకుడిలా ఎదగలేరు. ఈ సంగతి ఇలా ఉంటే , మరో పక్క సినీ నటుడు పవన్ కళ్యాణ్ టీడీపీ కి మరింత చేరువవుతూ ఢిల్లీలో టీడీపీకి అనధికార అధికారప్రతినిధిగా మారాడు అని వినిపిస్తుంది. సుజనా చౌదరి కేంద్రం లో ఎలాగూ టీడీపీకి కొమ్ముకాస్తాడు. మరో వైపు రాష్ట్రం లో టీడీపీ బలం పుంజుకోవాలి ,జగన్ మోహన్ రెడ్డి గారికి దీటైన ప్రజాధారణ కూడగట్టుకోవాలి అంటే , చిన్న రామారావు ని మరోసారి ఉపోయోగించాలి అనే వాదన బయటుకి రావడం.  ఇటువంటి పరిస్థితులలో టీడీపీకి నారాలోకేష్ అవసరం ఎంత వరకు ఉంది ప్రశ్న ఉద్భవిస్తే ? కాలమే వీటికి సంధానం చెప్పాలి,నారాలోకేష్ ట్విట్టర్ వీరుడిగా మిగిలిపోతారా? ప్రజా నాయకుడిలా ఎదగలేరా?

మల్లెల హరి నాగరాజు, M.tech(CSE)

Hari Nagaraju

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

అక్కినేని కోడ‌లిని..త్రిష‌ని కెలికిన శ్రీ‌రెడ్డి!

కాస్టింగ్ కౌచ్ వివాదంతో టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది శ్రీ‌రెడ్డి. `మా`లో శివాజీరాజా త‌నకు స‌భ్య‌త్వం ఇవ్వ‌లేదంటూ నానా హంగామా చేసి అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం స‌ష్టించింది. అక్క‌డి నుంచి అదే...

మేము సైతం అంటూ మెగా స్ఫూర్తితో ల‌ఘుచిత్రం

క‌రోనా సాయానికి ఒక్కొక్క‌రు ఒక్కోలా ముందుకొస్తున్నారు. సెల‌బ్రిటీలంతా ఎంతో స్ఫూర్తివంతంగా త‌మ‌వంతు సాయం చేస్తున్నారు. జ‌నాల్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. అటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్...

క‌రోనా పాజిటివ్‌.. న‌టికి షాకిచ్చిన అధికారులు!

ఓ న‌టి అపార్ట్‌మెంట్‌లో కారోనా పాజిటివ్.. రంగంలోకి దిగిన అధికారులు అపార్ట‌మెంట్‌ని మూసివేసి షాకిచ్చారు. ముంబాయిలోని మ‌ల‌ద్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ వుంది. అందులో బుల్లితెర‌తో పాటు సినిమాల్లో న‌టించే అంకిత లోఖండేతో...

అయ్యో క‌రోనా ఇవేం బెడ్ రూమ్ రాస‌లీల‌లు!

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు ప్ర‌పంచం అల్ల‌క‌ల్లోల‌మ‌వుతోంది. ఈ మ‌హమ్మారిని త‌రిమి కోట్టాలంటే ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌తంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఓవైపు ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి. సామాజిక దూరం పాటించి క‌రోనాని త‌రిమి కొడ‌దాం...

అల.. హిందీ రీమేక్ హీరో ఎవ‌రో తెలుసా?

తెలుగు సినిమాల‌కు హిందీ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్ పెరిగిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్లు హిందీలో రీమేక్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ క‌బీర్ సింగ్ సంచ‌ల‌నాల...

మ‌హేష్‌ని ఒప్పిస్తే మొన‌గాడే.. కుర్ర డైరెక్ట‌ర్ టెన్ష‌న్

స్క్రిప్టు లేనిదే ఏదీ లేదు. క‌థ క‌థ‌నం స‌రిగా కుద‌ర‌నిదే అస‌లు సినిమానే లేదు. ఇదీ సూప‌ర్ స్టార్ మ‌హేష్ పంథా. ఆయ‌న ఒక స్క్రిప్ట్ ను లాక్ చేయాలంటే ద‌ర్శ‌కుడు ఎన్ని...

మెగాస్టార్ ఆ నెపం జ‌క్క‌న్న పైకే నెట్టేశారు!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న 152వ చిత్రం `ఆచార్య‌`లో ఓ ముఖ్య‌మైన పాత్ర‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ లేదా సూప‌ర్ స్టార్ మ‌హేష్ కానీ న‌టించే ఛాన్సుంద‌ని కొద్ది రోజులు...

కొర‌టాల నిర్ణ‌యం షాకింగ్‌గా వుందే!

స‌మాజ హితం కోసం స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రూ చేయ‌ని త్యాగానికి సిద్ధ‌ప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ ద‌ర్శ‌కుడు మ‌రెవ‌రో కాదు స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. ఆయ‌న‌కు అభ్యుద‌య భావాలు ఎక్కువే. ర‌చ‌యిత‌,...

ప‌వ‌ర్‌స్టార్‌తో మాస్ మ‌హారాజా మల్టీస్టార‌ర్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొంత విరామం త‌రువాత మ‌ళ్లీ సినిమాల జోరు పెంచారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. `పింక్‌` రీమేక్ ఆధారంగా రూపొందుతున్న `వ‌కీల్‌సాబ్‌`తో మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లుపెట్టాడు. శ్రీ‌రామ్...

మెగాస్టార్ ఏంటీ ఇలా ట్విస్ట్ ఇచ్చాడు?

`సైరా` త‌రువాత మెగాస్టార్ చిరంజీవి ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి `ఆచార్య‌` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు స్వ‌యంగా చిరు వెల్ల‌డించారు. క్రేజీ...