Home Politics లోకేష్ తెలివి ఈ స్ధాయిలో ఉంది

లోకేష్ తెలివి ఈ స్ధాయిలో ఉంది

చంద్రబాబునాయుడు పుత్రరత్నం నారా లోకేష్ ను అందుకే మందలగిరి మాలోకం అని అంటుంటారు వైసిపి నేతలు. ఏమాత్రం తన నాయకత్వ లక్షణాలను పెంచుకునేందుకు లోకేష్ ప్రయత్నించటం లేదు. పైగా తనలోని అజ్ఞానాన్ని రోజు రోజుకు లోకానికి చాటి చెబుతుంటారు. అందుకనే లోకేష్ నుండి ట్విట్టర్ వేదికగా ఏదైనా కామెంట్ వచ్చిందంటే నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు.

ఇపుడిదంతా ఎందుకంటే తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఓ ప్రశ్న వేశారు. ఎవరో నెటిజన్ చంద్రబాబును పొలిటికల్ టెర్రరిస్ట్ అని ఆరోపించారట. అలాగే ఇంకెవరో 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు 600 మంది వైసిపి నేతలను హత్యలు చేయించారట. ఇది లోకేష్ బాధంతా.

ఇందులో నిజమెంత ? అబద్ధమెంత ? అన్న విషయాన్ని పక్కనపెట్టేద్దాం. ఎవరో నెటిజన్ పెట్టిన పోస్టును పట్టుకుని లోకేష్ ఏకంగా జగన్ కే అంటకట్టేస్తున్నారు. మరి స్వయంగా జగన్ పైన చంద్రబాబే చేసిన దుష్ప్రచారాన్ని ఏమనాలి ?  ఆవా వర్కర్లు వైసిపి ప్రభుత్వాన్ని పాడెపై పడుకోబెట్టి శవయాత్ర చేస్తున్న ఓ ఫొటోను చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

నిజానికి ఆ ఫొటో తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లాలో కెసియార్ కు వ్యతిరేకంగా ఆశావర్కర్లు చేసిన శవయాత్ర నిరసన. ఎక్కడో ఆశావర్కర్లు నిరసన చేస్తే దాన్ని జగన్ ప్రభుత్వంపై చేసినట్లుగా చంద్రబాబే తన ట్విట్టర్లో తప్పుడు పోస్టు పెట్టటాన్ని ఏమనాలి ? ముందు చంద్రబాబు పెట్టింది తప్పుడు పోస్టని లోకేష్ ఒప్పుకుంటే తర్వాత నెటిజన్లు పెట్టిన పోస్టులపై మాట్లాడచ్చు.

 

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ