Home Politics పంచెతో కుదరకపోతేనే కేబుల్ వైరుతో ఆత్మహత్య

పంచెతో కుదరకపోతేనే కేబుల్ వైరుతో ఆత్మహత్య

కేబుల్ వైరుతో ఆత్మహత్య చేసుకున్న టిడిపి సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఘటనలో దర్యాప్తు పుంజుకుంటోంది. ఇందులో భాగంగానే కోడెల ఉరేసుకున్న గదిని పోలీసు అధికారులు పరిశీలించారు. ఇందులో భాగంగానే ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న కోడెల ముందు పంచెతోనే ఉరేసుకునేందుకు ప్రయత్నించారట. అయితే అది కుదరకపోవటంతోనే చివరకు కేబుల్ వైరుతో ఆత్మహత్య చేసుకున్నట్లు తాజాగా తెలిసింది. పంచెను ఫ్యాన్ కు ముడిపెట్టిన కోడెల తర్వాత తన మెడకు రెండో కొనను ముడి వేసుకున్నారట. అయితే కోడెల బరువును పంచె ఆపలేకపోయిందని సమాచారం.

దాంతో పంచె మధ్యలో ఎక్కడో చిరిగిపోయిందట. దాంతో పంచె లాభం లేదనుకుని కేబుల్ వైరును తీసుకొని ఒకవైపు ఫ్యాన్ కు ముడేసి రెండో కొనను తన మెడకు బిగించుకున్నట్లు పోలీసు అధికారులు విశ్లేషిస్తున్నారు. అందుకనే కోడెల మెడచుట్టూ ఎర్రగా కమిలిపోయిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో కూడా నిర్ధారణ అయ్యింది.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ