Home Politics తండ్రి, కొడుకుల ’పెయిడ్ ఆర్టిస్ట్’ డ్రామాలు

తండ్రి, కొడుకుల ’పెయిడ్ ఆర్టిస్ట్’ డ్రామాలు

తప్పుడు ఫొటోలతోను పెయిడ్ ఆర్టిస్టులతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గబ్బు పట్టించాలని అనుకున్నారు తండ్రి, కొడుకులు. వాళ్ళు అనుకున్నట్లుగానే ట్విట్టర్లో పోస్టింగులు పెట్టారు. కానీ వెంటనే సీన్ రివర్సయింది. ఎందుకంటే జగన్ పై ఉన్న గుడ్డి వ్యతిరేకతతో చంద్రబాబునాయుడు పెట్టిన ఆశా వర్కర్ల తప్పుడు ఫొటో, లోకేష్ పెయిడ్ ఆర్టిస్టుతో చేయించిన తప్పుడు వీడియో బయటపడిపోయింది. దాంతో తండ్రి, కొడుకులకు ఉన్న పరువు కాస్త  కృష్ణానదిలో కలిసిపోయింది.

ఎప్పుడైతే తమ పరువు పోయిందని అర్ధమైపోయిందో అప్పటి నుండి  ఇద్దరికి ఉక్రోషం తన్నుకు వస్తోంది. అందుకనే ఇద్దరు తమ ట్విట్టర్ ఖాతాలో నోటికొచ్చింది రాసేస్తున్నారు. ఆశా వర్కర్ల ఆందోళన గురించి చంద్రబాబు మాట్లాడుతూ ఆశా వర్కర్లను పెయిడ్ ఆర్టిస్ట్ అని ముద్ర వేయండని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అదే విధంగా  అంతా బాగానే ఉన్నా ఇంకా ఏదో మంచి ఆశించి వైసిపికి ఓటు వేసిన ఓ తమ్ముడి ఆవేధన వినండి అంటూ లోకేష్ కూడా జగన్ ను ఉద్దేశించి ఓ ట్వీట్ పెట్టారు. అంటే టిడిపి హయాంలో అంతా బ్రహ్మాండంగా ఉందని సదరు తమ్ముడు అనుకున్నట్లుగా లోకేష్ అతి తెలివి ప్రదర్శించారు.  పైగా ’ఉన్నది కూడా కోల్పోయిన తమ్ముడిని కూడా పెయిడ్ ఆర్టిస్ట్ అంటారేమో’ అంటూ ఎద్దేవా ఒకటి.

జగన్ ప్రభుత్వాన్ని గబ్బు పట్టిద్దామని తండ్రి కొడుకులు చేస్తున్న విన్యాసాలన్నీ రివర్సవుతున్నాయి.  పైగా జగన్ వాళ్ళిద్దరినీ ఏమాత్రం ఖాతరు చేయకుండా తన పాలనేదో తాను చేసుకుపోతున్నారు. అందుకే జగన్ అంటే వాళ్ళల్లో ఉక్రోషం పెరిగిపోతోంది.  మూడు నెలల జగన్ ప్రభుత్వంలో బయటపడిన తప్పుల్లో చాలా వరకూ తమ పాలనలోని అనార్ధలే అని చంద్రబాబు, చినబాబు మరచిపోతున్నారు. ఒకవైపేమో జగన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేయటానికి తమ్ముళ్ళు సిద్ధంగా లేరు. ఇంకోవైపేమో తండ్రి, కొడుకులను జనాలు నమ్మటం లేదు. అందుకని బుర్రకు ఎంత తోస్తే అంతలా ట్విట్టర్లో పోస్టులు పెట్టేస్తున్నారు.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ