Home Politics టిడిపి పెయిడ్ ఆర్టిస్ట్స్ అరెస్ట్

టిడిపి పెయిడ్ ఆర్టిస్ట్స్ అరెస్ట్

పదే పదే పెయిడ్ ఆర్టిస్ట్స్ అరెస్టవుతున్నా తెలుగుదేశంపార్టీ నేతలకు బుద్ధి రావటం లేదు. తాజాగా తిరుమలలో చర్చి నిర్మాణమంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న ముగ్గురు పెయిడ్ ఆర్టిస్ట్స్ ను పోలీసులు అరెస్టు చేశారు.  జగన్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలతో విషం చిమ్మటానికి టిడిపి పెద్దలు కొందరు పెయిడ్ ఆర్టిస్టులను ఎంగేజ్ చేసుకున్నారు.

మూడు నెలలకే జగన్ పై దుష్ప్రచారం చేస్తుంటే జనాలు పట్టించుకోవటం లేదన్న విషయం చంద్రబాబునాయుడు, లోకేష్ కు బాగా అర్ధమైపోయింది. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాటం చేయమంటే టిడిపి నేతలు కూడా ముందుకు రావటం లేదు. అదే సమయంలో తమ ఆరోపణలు, విమర్శలను జనాలు కూడా పట్టించుకోవటం లేదు.

అందుకనే టిడిపి ముఖ్యులు రూటు మార్చారు. జగన్ ప్రభుత్వంపై తాము బురద చల్లకుండా ఇతరులతో చల్లించాలని ప్లాన్లు వేశారు. మొన్నటి వరదల సమయంలో రైతుల వేషంతో జగన్ తో పాటు మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ను ఓ రైతు నోటికొచ్చినట్లు తిట్టటం అందరూ చూసిందే. తీరా చూస్తే ఆయన అసలు రైతే కాదు. రైతు వేషంలో ఉన్న టిడిపి పెయిడ్ ఆర్టిస్ట్. సరే తర్వాత ఆయన్ను అరెస్టు చేశారనుకోండి అది వేరే సంగతి.

తాజాగా తిరుమల చర్చి నిర్మాణం విషయంలో కూడా అదే జరిగింది. తామేదో గొప్ప భక్తులమన్నట్లుగా బిల్డప్ ఇస్తు తిరుమలలో జగన్ ప్రభుత్వం చర్చి నిర్మాణం చేస్తోందంటూ ఒకటే ఊదరగొట్టారు కొన్ని ఫొటోలతో. తీరా చూస్తే ఆ ఫొటోలన్నీ ఫేక్ వే అని తేలిపోయాయి. చివరకు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాము టిడిపి తరపున జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు అంగీకరించారని సమాచారం. మొత్తానికి  పెయిడ్ ఆర్టిస్టులే టిడిపి కొంప ముంచేస్తున్నట్లున్నారు.

 

Recent Post

శాసనమండలి రద్దు తొందరపాటు నిర్ణయమా?  

పుష్కరం క్రితం నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతులమీదుగా పునరుద్ధరించబడిన శాసనమండలి నేడు ఆయన కుమారుడి చేతులమీదుగా ఉనికిని కోల్పోవడం యాదృచ్చికం కావచ్చు.  దేశంలో ఇరవై రెండు రాష్ట్రాలు ఉంటె, కేవలం...

అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన "అమరావతి"లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ...

వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడేదెప్పుడు ?

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అయన పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎంపీ గా ,...

అమ్మఒడి పేరుతొ దోచుకుంటున్నారు

అమ్మఒడి పేరుతొ నిరుపేదలను దోచుకుంటున్నారు అంటూ మండి పడుతున్నారు టిడిపి నేత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ లో నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను స్కూల్ కు పంపించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన...

ప‌వ‌న్ కోసం బాలీవుడ్ హీరోయిన్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్‌` తెలుగు రీమేక్‌తో రెండేళ్ల విరామం తరువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాకెట్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటోంది....

Featured Posts

అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన "అమరావతి"లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ...

బిగ్ బ్రేకింగ్‌: గాయ‌ప‌డిన‌ ర‌జ‌నీకాంత్‌

త‌లైవా ర‌జ‌నీకాంత్ గాయ‌ప‌డ్డారు. ఓ డాక్యుమెంట‌రీ షూటింగ్ కోసం మైసూర్‌లోని బండీపూర్ అడ‌వుల‌కు వెళ్లిన ఆయ‌న అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోవ‌డంతో స్వ‌ల్ప‌గాయాలైన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలో డిస్క‌వ‌రీ...

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా...

శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

  అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ...