Home Politics గోదావరిలో పడవ ప్రమాదం..30 మంది మృతి ?

గోదావరిలో పడవ ప్రమాదం..30 మంది మృతి ?

తూర్పు గోదావరి జిల్లాలోని దేవిపట్నం ప్రాంతంలో పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్, విశాఖపట్నం జిల్లాల నుండి రెండు బృందాలు పాపికొండలు విహార యాత్రకు వెళ్ళినట్లు సమాచారం. దేవిపట్నం సమీపయంలోని కచ్చలూరు గ్రామం వద్ద ప్రమాదం జరిగినట్లు సమాచారం.

రాయల్ వశిష్ట అనే ప్రైవేటు లాంచిలో  61 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 50 మంది ప్రయాణీకులు అయితే మిగిలిన 11 మంది లాంచి సిబ్బందిగా గుర్తించారు. కచ్చలూరు గ్రమం వద్ద ప్రమాదకరమైన మలుపున్నట్లు చెబుతున్నారు. ఈ మలుపులో లాంచి ప్రయాణిస్తుండగా ఒకవైపుకు ఒరిగిందట. భయపడిన ప్రయాణీకుల్లో ఎక్కువమంది పడవలోని వ్యతిరేకదిశలోకి చేరుకున్నారు. దాంతో పడవలో ఒకవైపే బరువు పడటంతో ఒక్కసారిగా లాంచి ముణిగిపోయినట్లు ప్రత్యక్షసాక్షలు చెబుతున్నారు.

అయితే ప్రయాణీకుల్లో చాలామంది లైఫ్ జాకెట్లు వేసుకున్నారని సమాచారం. కాబట్టి వీళ్ళంతా సురక్షితంగానే ఉండి ఉంటారని అనుకుంటున్నారు. అయితే ఇప్పటికి 20 మంది మాత్రం సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. పడవ ప్రమాదం విషయం తెలియగానే జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించారు. ఉన్నతాధికారులతో పాటు ఎన్డిఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దింపారు. ప్రయాణీకులను వెతికేందుకు హెలికాప్టర్లను కూడా ఉపయోగిస్తున్నారు. మొత్తం ఎంతమంది చనిపోయిరనే విషయం తెలియకపోయినా భారీ సంఖ్యలోనే ఉంటారని అంచనా వేస్తున్నారు.

 

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ