Home Politics ఆ 40 కేసుల్లో నిందితుల ఎన్‌కౌంట‌ర్‌కి జ‌గ‌న్ ఆదేశాలిస్తాడా?

ఆ 40 కేసుల్లో నిందితుల ఎన్‌కౌంట‌ర్‌కి జ‌గ‌న్ ఆదేశాలిస్తాడా?

ఏపీలో అసెంబ్లీ సమావేశాలలో ‘మహిళలకు రక్షణ ఎలా కల్పించాలి” అనే విషయంలో చర్చ స‌మ‌యంలో సీఎం జగన్ “దిశ” నిందితులను ఎన్ కౌంటర్ విషయాన్ని సమర్ధిస్తునే ‘అంత గొప్ప నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హ్యాట్సాఫ్’…అని వ్యాఖ్యలు చేసారు. ఇదే ఇప్పుడు ఇటు తెలంగాణ అటు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. జ‌గ‌న్ పరిభాష చూస్తుంటే దిశా హంతకుల్ని ఎన్ కౌంటర్ చేయమని తెలంగాణ సిఎం కేసీఆర్ పోలీసులకు ముందే ఆదేశించార‌న్న‌ట్టుంది. అయితే వారు తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో పాటు త‌మ నుండి ఆయుధాలు లాక్కుని, దాడి చేసినందుకే ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు చెపుతున్న‌ది నిజంకాదన్న‌మాట అని చాలా మంది సామాజిక మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్ప‌టికే ఇది బూట‌క‌పు ఎన్ కౌంట‌ర్ అంటూ వ‌చ్చిన ఫిర్యాదుల‌తో స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ దీనిపై చాలా సీరియస్ గా రియాక్ట‌య్యి, నిజ‌నిర్ధార‌ణ క‌మిటీని కూడా పంపింది. అయితే జ‌గ‌న్‌-కేసీఆర్‌ల మ‌ధ్య సంబంధాల మేర‌కే ఇప్పుడు జగన్ కెసిఆర్ ముందుగ‌నే నిందితుల‌ను ఎన్ కౌంట‌ర్ చేయ‌మ‌న్నార‌నే తీరుగా చెపుతుండ‌టం చూస్తుంటే ఈ విష‌యం జ‌గ‌న్‌కి కూడా ముందే తెలిసి ఉండొచ్చ‌ని సెటైర్లు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు అసెంబ్లీ వేదిక‌గా జ‌గ‌న్ ఇది కేసీఆర్ నిర్ణ‌య‌మ‌న్న త‌ర‌హాలో ప్ర‌క‌టించ‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వానికి కొత్త‌ తల నొప్పి తెచ్చిపెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు!.

ఇదిలా ఉండగా జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల మేర‌కు అత్యాచార నిందితుల‌ను ఎన్ కౌంట‌ర్ చేయ‌ట‌మే స‌మంజ‌స‌మైన‌ప్పుడు 2019 జగన్ సీఎం అయిన నాటి నుంచి రాష్ట్రంలో దాదాపు 40 పైగా రేప్ కేసులు పెండింగ్‌ లో ఉన్నాయి. వారందర్ని, జగన్ కూడా కెసిఆర్ పంథాలో ఎన్ కౌంటర్ చేసేలా ఆదేశించాల‌న్న‌ డిమాండ్లు ఇప్పుడు ఊపందుకునే అవకాశాలు లేకపోలేదు.

మరోవైపు మహిళా సంఘాలు సైతం, అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటన్న వారిని చంపేయాలని డిమాండ్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఏపీ సీఎం మాటలు వారికి మరింత ఊతం ఇచ్చినట్లయిందని నెటిజ‌న్లు అభిప్రాయ ప‌డుతున్నారు. కాగా గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో 2014లో 82, 2015లో 100, 2016లో 116, 2017లో 105, 2018లో 93 కేసులు న‌మోద‌య్యాయి. వీటి విష‌యం కూడా త్వ‌ర‌గా తేల్చాల‌ని, నిందితుల‌ని ఎన్ కౌంట‌ర్ చేయ‌టం ద్వారానే మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త అన్న‌డిమాండ్ తెర‌పైకి వ‌స్తోంది. మ‌రి ఈ కేసుల విష‌యంలో చ‌ట్టం త‌న ప‌ని తను చేసుకు పోతుంద‌ని చెపుతారో… ఎన్ కౌంట‌ర్ల‌కు ఆదేశాలిచ్చి త‌నూ కేసీఆర్‌లా శ‌భాష్ అనిపించుకుంటారో చూడాలి…

Recent Post

శాసనమండలి రద్దు తొందరపాటు నిర్ణయమా?  

పుష్కరం క్రితం నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతులమీదుగా పునరుద్ధరించబడిన శాసనమండలి నేడు ఆయన కుమారుడి చేతులమీదుగా ఉనికిని కోల్పోవడం యాదృచ్చికం కావచ్చు.  దేశంలో ఇరవై రెండు రాష్ట్రాలు ఉంటె, కేవలం...

అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన "అమరావతి"లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ...

వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడేదెప్పుడు ?

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అయన పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎంపీ గా ,...

అమ్మఒడి పేరుతొ దోచుకుంటున్నారు

అమ్మఒడి పేరుతొ నిరుపేదలను దోచుకుంటున్నారు అంటూ మండి పడుతున్నారు టిడిపి నేత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ లో నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను స్కూల్ కు పంపించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన...

ప‌వ‌న్ కోసం బాలీవుడ్ హీరోయిన్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్‌` తెలుగు రీమేక్‌తో రెండేళ్ల విరామం తరువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాకెట్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటోంది....

Featured Posts

అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన "అమరావతి"లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ...

బిగ్ బ్రేకింగ్‌: గాయ‌ప‌డిన‌ ర‌జ‌నీకాంత్‌

త‌లైవా ర‌జ‌నీకాంత్ గాయ‌ప‌డ్డారు. ఓ డాక్యుమెంట‌రీ షూటింగ్ కోసం మైసూర్‌లోని బండీపూర్ అడ‌వుల‌కు వెళ్లిన ఆయ‌న అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోవ‌డంతో స్వ‌ల్ప‌గాయాలైన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలో డిస్క‌వ‌రీ...

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా...

శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

  అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ...