Home Politics ఆర్టీసి ఉద్యోగులకు వరాలే వరాలు

ఆర్టీసి ఉద్యోగులకు వరాలే వరాలు

ఆర్టీసీ ఉద్యోగుల మీద జగన్మోహన్ రెడ్డి వరాల మీద వరాలు గుప్పిస్తున్నారు. సంస్దలోని ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును రెండేళ్ళు పెంచుతు నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఆదేశించటంతో సంస్ధ ఉద్యోగులు ఫుల్లుగా హ్యాపీగా ఉన్నారు.

ఈ నెలలోనే ఆర్టీసీ ప్రభుత్వంలో వీలీనం చేస్తు జగన్ నిర్ణయం తీసుకున్న విషయం అందరకీ తెలిసిందే. నిజానికి ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది దశాబ్దాల డిమాండ్. అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ పని చేయలేకపోయారు. చివరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, తాజా మాజీ సిఎం చంద్రబాబు నాయుడు కూడా చేయలేదు.

అలాంటి దశాబ్దాల డిమాండ్ ను అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే జగన్ పరిష్కరించారు. సంస్ధను విలీనం చేయటానికి సాంకేతిక సమస్యలున్న కారణంగా ఉద్యోగులను మాత్రం విలీనం చేయాలని నిర్ణయించారు. సరే అది రేపో మాపో అమల్లోకి వచ్చేస్తుంది లేండి.

విలీనం నిర్ణయంతోనే హ్యాపీగా ఉన్న ఉద్యోగులకు జగన్ మరో వరం కూడా ఇచ్చేశారు. సంస్ధలో రిటైర్మెంట్ వయసును 58 నుండి 60కి పెంచుతున్నట్లు చెప్పారు. వీలనంతో సంబంధం లేకుండా వెంటనే ఉత్తర్వులు జారీ చేసేయాలని ఆదేశించారు. జగన్ నిర్ణయం వల్ల సుమారు 50 వేలమంది ఉపయోగం జరగబోతోంది. ఈ ఏడాదిలో రిటైర్ అవబోతున్న 550 మందికి ఈ ఉత్తర్వులను అమలు చేయాలని జగన్ ఆదేశించటమే కొసమెరుపు.

 

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ