fbpx
Home Editors Choice పవన్ జనసేన ‘విజన్ డాక్యుమెంట్’ ఇదే...

పవన్ జనసేన ‘విజన్ డాక్యుమెంట్’ ఇదే…

తను కలకంటున్న సమాాజ స్థాపన ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో చెప్పేఆంధ్రప్రదేశ్ జనసేన విజన్ డాక్యుమెంట్ ను జనసేన నేత పవన్ కల్యాణ్ నేడు విడుదల చేశారు . ఈ డాక్యుమెంట్ పూర్తి పాఠం  ఇక్కడ అందిస్తున్నాం.

జనసేన మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ 

అత్యున్నత పర్వతమూ
అతి దీర్ఘ నదీప్రవాహమూ
అతి లోతైన స‌ముద్ర‌ము
అతి దూరపు నక్షత్రము
ఉన్నప్పుడు అత్యుత్తుమ‌
మానవుడెందుకు ఉండడు ..?

 


అని ప్రముఖ కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు తన ఆధునిక మహా భారతం గ్రంధంలో రాశారు. ఇటువంటి అత్యున్న‌త మ‌హానీయులైన మాన‌వులు ఉండబ‌ట్టే మ‌నం స్వాతంత్ర్యాన్ని సాధించుకోగ‌లిగాము. బ‌ల‌మైన రాజ్యాంగాన్ని తీసుకురాగ‌లిగాము. ఎంతోమంది మ‌హ‌నీయులు, వారి జీవితాన్ని అర్పించి మ‌న దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చేటట్టు చేసి, బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుండి మనందిరికీ విముక్తి కలిగించారు. మ‌హోన్న‌త‌మైన గుణాలను కలిగిన మేధావులు ఎన్నో సంవత్సరాలు పాటు మధించి, శోధించి 1950 లో భారత రాజ్యాంగాన్ని ర‌చించి, భావి తరాలకు ద‌శ దిశల‌ను, విధివిధానాలను పొందుప‌రిచారు. మేధోసంప‌న్నుడు, దూర‌దృష్టి గ‌ల డాక్ట‌ర్ బి.ఆర్ అంబేద్కర్ సార‌ధ్యంలో ఎంద‌రో నిష్ణాతులు రాజ్యాంగ ర‌చ‌నా క్ర‌తువులో పాల్గొని మ‌న‌దేశానికి రూపురేఖ‌లు తీర్చిదిద్దారు. భారత రాజ్యాంగ ల‌క్ష్యం మ‌రియు సిద్ధాంతాలను ప్రియాంబుల్ ( ప్రవేశిక ) లో ఈ క్రింది విధంగా పొందుప‌రిచారు.
భారతదేశపు ప్రజలమైన మేము భారతదేశాన్నిఈ విధంగా తీర్చిదిద్దుతాము:

• సార్వభౌమత్వం : స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దేశం
• సామ్యవాదం : ఉత్పత్తి అయిన సంప‌ద సమాన పంపిణీ
• లౌకికం : మతపరమైన వివ‌క్ష లేని దేశం
• ప్రజాస్వామ్యం : ప్రజల చేత, ప్రజల కోసం ప్రభుత్వం ఎన్నుకోబడుతుంది
• గణతంత్రం : నాయకుడు వంశపారంప‌ర్యంగా వచ్చే వ్యక్తి కాదు. ఎన్నిక ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తి
• న్యాయం : సామాజిక, ఆర్దిక, రాజకీయ న్యాయం ప్ర‌జ‌లంద‌రికీ స‌మానం
• స్వేచ్ఛ : భావ వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం మరియు ఆరాధ‌న‌ స్వేచ్ఛను అంద‌రూ కలిగి ఉంటారు
• సమానత్వం : హోదా, అవకాశాలలో సమానత్వం మరియు వాటిని ప్రోత్సహించడం
• కూటమి : వ్యక్తి గౌరవం మ‌రియు దేశం యొక్క ఏకత్వం, సమగ్ర తలకు భరోసా


కానీ వాస్తవానికి ప్రభుత్వాలు, వివిధ రాజకీయ పక్షాలవారు ప్రియాంబుల్ కు తూట్లు పొడిచారు. సంపూర్ణ‌మైన అభివృద్ధి నుంచి ప్ర‌జ‌ల‌ను దూరం చేశారు.

ప్ర‌జ‌ల‌ను ఆర్థికంగా, సామాజికంగా, రాజ‌కీయంగా విడ‌దీశారు. కులాలు, మ‌తాలు, ప్రాంతాల పేరిట ప్ర‌జ‌ల మ‌ధ్య భేద‌భావాల‌ను సృష్టించారు. భిన్న‌త్వంలో ఏక‌త్వం అనే స్ఫూర్తిని కాల‌రాశారు. చెప్పింది చేయం.. చేసేది చెప్పం అన్న రీతిలో పాల‌కులు వంచ‌న రాజ‌కీయాల‌తో దేశాన్ని ఏలుతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆర్భ‌టంగా మేనిఫెస్టోని ప్ర‌క‌టించే రాజ‌కీయ ప‌క్షాలు.. ఎన్నిక‌ల త‌ర్వాత వాటిని మొక్కుబ‌డిగానైనా అమ‌లు చేయ‌క‌పోవ‌డం ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేయ‌డ‌మే.

రాజ‌కీయ జ‌వాబుదారీత‌నం ఏ రాజ‌కీయ నాయ‌కుడులోనూ వీస‌మెత్తు గోచ‌రించ‌దు. మేనిఫెస్టో అమ‌లును అతిక్ర‌మించ‌డం వ‌ల్ల సంప‌ద అంద‌రికి స‌మానంగా చేర‌డం లేదు. కొన్ని కుటుంబాలు, వారి బంధువులు, వారి క‌నుస‌న్న‌ల్లో మెలిగే సిండికేట్లు వేల‌కోట్ల రూపాయ‌ల‌ను వెన‌కేసుకుంటున్నారు. అభివృద్ధి ఫ‌లాలు అతి కొద్ది మందికే చేర‌డంతో ఆర్థికంగా బ‌ల‌మైన వారు మ‌రింత బ‌ల‌వంతులుగా, ఆర్థికంగా బ‌ల‌హీనంగా ఉన్న‌వారు మ‌రింత బ‌ల‌హీనులుగా మారి కుల‌, మ‌త‌, ప్రాంత వివ‌క్ష‌ల‌తో కూన‌రిల్లుతున్నారు. దీనికి చ‌ట్ట‌స‌భ‌ల‌కు ప్రాతినిద్యం వ‌హిస్తున్న ప్ర‌జాప్ర‌తినిధులే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది.

పార్ల‌మెంటుకు ప్రాతినిద్యం వ‌హిస్తున్న ఎంపీలు అయితేనేమి, శాస‌న‌స‌భ‌, శాస‌న‌మండ‌లికి ప్రాతినిద్యం వ‌హిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితేనేమి వ్య‌క్తిగ‌తంగా, స‌మిష్టిగా బాధ్య‌త వ‌హించాల్సి ఉంది. ప్ర‌జాస్వామ్యానికి పీఠాలైన చ‌ట్ట స‌భ‌ల్లో శాస‌న‌క‌ర్త‌లు కొద్దిమంది బాగుకోసం కోట్లాది మంది ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెట్ట‌డం జాతికే తీర‌ని ద్రోహం.

ఏ పార్టీ మేనిఫెస్టో చూసినా అది కొన్ని వ్యాఖ్య‌ల సమ్మేళ‌నంలా ఉంటోంది. రాజ‌కీయ‌ విలువలు ఈ రోజు ఏవిధంగా దిగజారిపోయాయంటే ఒక రాజ‌కీయ పార్టీ త‌న మేనిఫెస్టో లో ప్ర‌క‌టించిన వాగ్ధానాల‌ను ఎన్నిక‌ల త‌ర్వాత క‌నీసం మాట మాత్రానికైనా గుర్తుకు తెచ్చుకోదు. గ‌ద్దెనెక్కే స‌మ‌యంలో చ‌ట్టాల‌కు కట్టుబడి ఉంటామ‌ని ప్ర‌మాణం చేస్తారు. ఆచరణలో చ‌ట్టాల‌కు తూట్లు పొడుస్తారు. ఉదాహరణకు భూసేకరణ చట్టం – 2013ను టీడీపీ ప్రభుత్వం నీరుగార్చేసింది. రైతులను భూమిలేని వారిగా చేసింది. అదేవిధంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామ‌ని వాగ్ధానం చేసి ఆ త‌ర్వాత వెన్నుపోటు పొడిచింది. ఇది ఏ ర‌కం రాజ్యాంగ స్ఫూర్తి..?

నేను డ్యాము లెందుకు కడుతున్నానో
భూము లెందుకు దున్నుతున్నానో
నాకు తెలీదు !
నా బ్రతుకొక సున్న కానీ నడుస్తున్నా !
వ్రేళ్ళు కాళ్ళయి నడిచే చెట్టు మనిషి
చెట్టుగా ఉంటే ఏడాదికొక
వసంతమన్నాదక్కేది
మనిషినై అన్ని వసంతాలూ కోల్పొయాను !

అంటారు శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు త‌న ఆధునిక మహా భారతం గ్రంధంలో…
ఈ పరిస్థితుల నుండి ప్రజలను రక్షించాలి. వారికి మంచి ప్ర‌మాణాల‌తో కూడిన జీవ‌నాన్ని అందించాలి. తాగడానికి పరిశుద్ధమైన నీరు, కలుషితంకాని గాలి, ఆరోగ్యకరమైన పరిసరాలు.. ఇవి ప్రతి ఒక్కరికీ దక్కేలా జనసేన పాటు పడుతుంది. ప్ర‌జ‌లంద‌రికీ ముఖ్యంగా ఆడ‌ప‌డుచుల‌కు పూర్తి భ‌ద్ర‌త‌తో కూడిన పౌర స‌మాజాన్ని నిర్మించాలి… ఇది జనసేన దృఢ సంక‌ల్పం. మాన‌వాళి నిరాశ, నిసృహ‌ల‌కు లోనుకాకుండా వారి జీవితాల్లో వసంతం తీసుకురావడం మా ల‌క్ష్యం. ఈ దిశలోనే జ‌న‌సేన‌ మేనిఫెస్టో ఉండబోతుంది. సార్వ‌జ‌నీనకంగా ఉండే మేనిఫెస్టో సంపూర్ణ ప్ర‌తిని త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తాం. ఈ నాటి ఈ ప్ర‌తి కేవ‌లం విజ‌న్ డాక్యూమెంట్ మాత్ర‌మే. మేనిఫెస్టోలోని కొన్ని మ‌చ్చుతున‌క‌లు ఇవి..

 

1. మ‌హిళ‌ల‌కు 33% రాజ‌కీయ రిజ‌ర్వేష‌న్లు
2. గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలెండ‌ర్లు
3. రేష‌న్ కు బ‌దులుగా మ‌హిళ‌ల ఖాతాల్లో 2500 – 3500 వ‌ర‌కు న‌గ‌దు
4. బీసీల‌కు అవ‌కాశాన్ని బ‌ట్టి 5% వ‌ర‌కు రిజ‌ర్వేష‌న్లు పెంపుద‌ల‌
5. చ‌ట్ట‌స‌భ‌ల్లో బీసీల‌కు రాజ‌కీయ రిజ‌ర్వేష‌న్లు
6. కాపుల‌కు 9వ షెడ్యూల్ ద్వారా రిజ‌ర్వేష‌న్లు
7. SC వ‌ర్గీక‌ర‌ణకు సామ‌ర‌స్య ప‌రిష్కారం
8. ఆర్థికంగా వెనుక‌బ‌డిన అగ్ర‌వ‌ర్ణాల కోసం కార్పొరేష‌న్
9. ఆర్థికంగా వెనుక‌బ‌డిన అగ్ర‌వ‌ర్ణాల విద్యార్ధుల‌కు వ‌స‌తిగృహాలు
10. ముస్లింల అభివృద్ధికి స‌చార్ క‌మిటీ విధానాలు
11. ప్ర‌భుత్వ ఉద్యోగుల CPS విధానం ర‌ద్దు
12. వృద్ధుల కోసం ప్ర‌భుత్వ ఆశ్ర‌మాలు

మేము చెప్పే విషయాలు సాహసోపేత నిర్ణయాలని తెలుసు. కాని మ‌న‌సుంటే మార్గ‌ముంటుంది అని బ‌లంగా విశ్వ‌సిస్తున్నాను. ఈ చిరుదీపం కోట్లాది మందికి వెలుగునిస్తుంద‌ని ఆశిస్తూ …

మీ
పవన్ కళ్యాణ్
ప్రెసిడెంట్ – జనసేన పార్టీ

తెలుగురాజ్యం ప్రత్యేకం

విజయ్ ఆంటోనీ ‘కిల్లర్’ ట్రైలర్ రివ్యూ!

  ‘బిచ్చగాడు’ విజయ్ ఆంటోనీ ‘కిల్లర్’ ట్రైలర్ విడుదలయ్యింది. తమిళంలో ‘కలైగరన్’ (హంతకుడు) గా నిర్మించి తెలుగులోకి డబ్ చేసిన ‘కిల్లర్’ కి ఆండ్రూ లూయిస్దర్శకత్వం వహించాడు. ఇతను 2012 లో కొత్త వాళ్లతో...

బాబు గారి ‘Is It not వివక్షత’ కి ఈసీ కౌంటర్?

చంద్ర బాబు గారు ఎలక్షన్ కమిషన్ ని కలిసిన తర్వాత మాట్లాడుతూ పోలింగ్ జరిగిన 30 రోజుల తర్వాత ఎలా రీపోలింగ్ నిర్వహిస్తారని , is this not వివక్షత అంటూ ప్రశ్నించారు....

‘ఎబిసిడి’ రివ్యూ – చిన్న మహర్షి అవుదామనుకుంటే…

ఐదు సినిమాల అల్లుశిరీష్ యువహీరోగా నిలదొక్కుకోవడానికి స్ట్రగుల్ చేస్తున్నాడు. ఆరో సినిమాగా నాలుగక్షరాల ‘ఎబిసిడి’ కొచ్చాడు. రీమేక్ తో, కొత్త దర్శకుడితో ఒక ప్రయోగం చేస్తున్నట్టు చెప్పాడు. అట్టహాసంగా 600 పై చిలుకు...

అత్యంత ప్రజాధారణ

తాజా వార్తలు

‘సీత’వివాదం: తేజ క్షమాపణ చెప్పాల్సిందే,లేదా కేసు

వివాదం లేనిదే పెద్ద సినిమా ఉండదా అనే విధంగా ప్రతీ సారి ఏదో వివాదం చెలరేగుతూనే ఉంది. తాజాగా తేజ దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా.. కాజల్ అగర్వాల్ టైటిల్ పాత్రలో నటించిన ‘సీత’...

‘టిక్‌ టాక్‌’ టాప్ సెలబ్రిటీని దారుణంగా చంపేసారు

ఇండియాలో పాపులర్ అయిన టిక్ టాక్ యాప్‌‌లో లక్షల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న మోహిత్ మోర్ అనే 24ఏళ్ల యువకుడు హత్యకు గురవ్వడం ఢిల్లీలో సంచలనంగా మారింది. ముగ్గురు గుర్తు తెలియని...

‘జబర్దస్థ్’ లో సడెన్ ట్విస్ట్… సీన్ లోకి సీనియర్ కమిడియన్

తెలుగు టీవీ రంగంలో బాగా పాపులర్ అయిన కామెడీ షో 'జబర్దస్థ్' అనేది ఎవరూ కాదనిలేని సత్యం. ఆ పోగ్రాం సక్సెస్ అవటంతో ఎక్స్ ట్రా జబర్ధస్త్ కూడా మొదలు పెట్టారు. అదీ...

న్యూడ్ ఫొటోలు పంపి షాక్ ఇచ్చిన సింగర్ చిన్మయి

గత కొంతకాలంగా చిన్మయి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ముఖ్యగా మీటూ అంటూ తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ సంఘటనను వెలుగులోకి తెచ్చింది. అందులో భాగంగా ప్రముఖ తమిళ పాటల...

బాబూ బెల్లంకొండ ఏంటీ కామెడీ,నవ్వుకుంటున్నారు

బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ అనేది పడలేదు. అయితే తనకు హిందీలో పెద్ద మార్కెట్ ఉందని అంటున్నారు బెల్లంకొండ శ్రీనివాస్. తన తాజా చిత్రం సీత ప్రమోషన్ లో...

అదనపు బలగాలపైనా మండిపోవటమేనా ?

కౌంటింగ్ సందర్భంగా గురువారం రాష్ట్రంలో అల్లర్లు జరుగుతాయన్న అనుమానంతో కేంద్ర ఎన్నికల కమీషన్ అదనపు బలగాలను మోహరించింది. అదనపు బలగాలను మోహరించటంపైన కూడా చంద్రబాబునాయుడు మండిపోతున్నారు. ఎలక్షన్ కమీషన్ చేసే ప్రతీ పనినీ...

జపాన్ లో రానా తుఫాన్

అవును ..ఇప్పుడు జపాన్ లో దగ్గపాటి రానా సినిమాల తుఫాను వస్తోంది అక్కడ వరస పెట్టి ఆయన సినమాలు అన్నీ రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా బాహుబ‌లి ఫ్రాంచైజ్‌లో వ‌చ్చిన చిత్రాలు జపాన్‌లో విడుద‌ల...

వెయ్యి కోట్లకు చేరుకున్న బెట్టింగులు ?

రాష్ట్రంలో బెట్టింగుల జోరుతో మారు మోగిపోతోంది. పోలింగ్ ముగిసిన వెంటనే పందెం రాయళ్ళు బరిలోకి దిగినా తర్వాత మెల్లిగా ఊపు తగ్గిపోయింది. పోలింగ్ ముగిసిన రోజు నుండి దాదాపు పది రోజులు బెట్టింగ్...

ఓడిపోతే….అందుకే సాకులు వెతుక్కుంటున్నారా ?

చూడబోతే  అలాగే ఉంది చంద్రబాబునాయుడు వ్యవహారం.   పదే పదే ఈవిఎంలుని వివి ప్యాట్లని ఒకటే దేశవ్యాప్తంగా చంద్రబాబు చేస్తున్న గోల చూస్తుంటే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు వాదనను కోర్టులు కొట్టేస్తున్న మళ్ళీ...

ఈ మంత్రి గెలుపు కష్టమేనా ?

చంద్రబాబునాయుడు క్యిబినెట్ లో మంత్రులందరూ రెండోసారి పోటీ చేశారు. అయితే వీరిలో ఎంతమంది గెలుస్తారనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. సరే మిగిలిన మంత్రుల సంగతి పక్కన పెడితే ఒక మంత్రి గెలుపోటముల విషయంలో మాత్రం...
 Nate Gerry Jersey