Home TR Lounge Tech గూగల్ మ్యాప్స్ లో అదిరిపోయే గ్రూప్ ప్లానింగ్ ఫీచర్

గూగల్ మ్యాప్స్ లో అదిరిపోయే గ్రూప్ ప్లానింగ్ ఫీచర్

(అహ్మద్ షరీఫ్*)

 

సెప్టెంబర్ 26, 2018 గూగుల్ సంస్థ , తమ “గూగుల్ మ్యాప్స్” అప్ లో “గ్రూప్ ప్లానింగ్” అనే నూతన అంశాన్ని జోడించింది.  ఏమిటి ఈ గ్రూప్ ప్లానింగ్ ప్రత్యేకత ?

ఓ నలుగురు స్నేహితులు కలిసి ఓ మంచి రెస్టారెంట్ లో బర్త్ డే పార్టి చేసుకో వాలను కున్నారను కుందాం. ఏ రెస్టారెంట్ కి వెళ్ళాలి? అనే నిర్ణయం తీసుకోవాలి. ఒక్కొక్కోరికి ఒక్కో రకమైన ఇష్టా లుంటాయి. అందరి ఇష్టాలు ఏకీ భవించేట్లు ఒక   రెస్టారెంట్ ని సెలెక్ట్ చేయాలి.

 

అ నలుగురు స్నేహితులు ఓ రూమ్ లో కుర్చుని “అక్రాస్ ది టేబుల్” మాట్లాడుకో గల్గితే ఇదేమంత పెద్ద సమస్య కాదు. ఓ రెస్టారెంట్ ను సెలెక్ట్   చేయడం కోసం ఎక్కడే క్కడో వుండే నలుగురు స్నేహితులు కనీసం పది నిముషాలు ఒక చోట చేరి మఖా ముఖి మాట్లాడుకోవడం ఈ రోజుల్లో సంభవమేనా ?

 

ఇలా ఓ రెస్టారెంట్ ను సెలెక్ట్   చేయడం కోసం ప్రస్తుతం ఎవరైనా ఎం చేస్తారు? ఓ కాన్ఫరెన్సు కాల్ చేయవచ్చు. ఇదికూడా అంత  సుళువు కాదు. అందరికి ఫ్రీ టైం వుండాలి. అందరి సమయాలు కలవాలి. ఇక రెండో ప్రత్యామ్నాయం మెసేజ్ లు పంపుకోవడం .

 

ఒక్కొక్కోరికి మెసేజి లు పెట్టటం వారి జవాబులు సేకరించడం, ఎవరి ఇష్టమేమిటో గుర్తుపెట్టుకుంటూ, వారి వారి కన్ఫర్మేషన్ లు తీసుకుంటూ, ఒక్కొక్కోరి మెసేజి కోసం ముందుకి వెనక్కి వెళుతూ వివరాలన్నింటిని ఓ కొలిక్కి తీసుకురావడం  –  ఇదంతా చాల శ్రమ తో కూడుకున్న ప్రక్రియ.

“గ్రూప్ ప్లానింగ్” ఈ ప్రక్రియను సులభతరం చేస్తుంది.  ఇది నలుగురు స్నేహితులు ఒక చోట చేరి ముఖా ముఖి మాట్లాడుకుని ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి అత్యంత దగ్గరి ప్రత్యామ్నాయంగా అనుకోవచ్చు. గ్రూప్ ప్లానింగ్ ద్వారా అందరికి నచ్చే ఒక మంచి రెస్టారెంట్ ను సులభంగా  ఎలా సెలెక్ట్ చేసుకో వచ్చో చూద్దాం

  1. రెస్టారెంట్ ల లిస్టు తయారు చేయడం  

గూగుల్ మ్యాప్స్ యాప్ ను ఆక్టివేట్ చేశాక, సెర్చి బార్ లో “రెస్టారెంట్” అనే పదాన్ని ఇస్తే, చుట్టుపట్ల వున్న రెస్టారెంట్ లన్ని  స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి .

.

వాటిలో ఒక్కో రెస్టారెంట్ ను పరిశీలించి మనకు నచ్చిన  రెస్టారెంట్ ఫోటో మీద వత్తిపట్టడం ద్వారా దాన్ని ఒక  లిస్టు లో చేర్చ వచ్చు . లిస్టు స్క్రీన్ కిందిభాగం లో ఎడమవైపు ఒక బుడగలా కనిపిస్తున్నది, ఈ లిస్టు లో రెండు రెస్టారెంట్ లను చేర్చిన ట్లు గమనించ  వచ్చు

 

  1. లిస్టు ను మిత్రులకి షేర్ చేయడం

ఇలా తయారైన లిస్టు ను షేర్ బటన్ నొక్కి,  “వాట్స్ ఆప్”, లేదా “ఇమెయిల్” లేదా, “ఎస్ ఎం ఎస్” లేదా మరేదయినా “టెక్స్ట్” ల ద్వారా మిత్రులకు పంపించ వచ్చు .

మిత్రులకు షేర్ చేసినపుడు ఈ క్రింది విధంగా మెసేజ్ వెళుతుంది

  1. వోటింగ్ ద్వారా ఇష్టాలు అయిష్టాలు తెలపడం

ఎవరైతే ఈ మెసేజ్ ను పొందుతారో వారు మెసేజ్ లో వున్న లింక్ ద్వారా క్రింద చూపిన విధంగా రెస్టారెంట్ ల లిస్టు ను పొందవచ్చు.  ఈ స్క్రీన్ లో పంపిన వారి వివరాలు ఒక్కో రెస్టారెంట్ మీద ఇష్టం ( ) అయిష్టం ( ) తెలపడానికి వీలుగా చిహ్నాలుంటాయి. ఒక్కో రెస్టారెంట్ మీద మన ఇష్టాలు అయిష్టాలు తెలిపిన తరువాత పైన వున్న షేర్ బటన్ నొక్కడం తో ఈ వివరాలు మిగత వారితో పంచుకోవచ్చు. చివరికి ఎవరెవరికి ఏమిష్టమో తెలియజెసే ఒక పూర్తి రెస్టారెంట్ ల లిస్టు ప్రతి ఒక్కరికి అందుబాటులో వుంటుంది. దీనితో ఆందరికీ నచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం సులువవుతుంది.

ఈ నూతన అంశం (ఫీచర్) వల్ల సమయం,  శ్రమ ఆదా చేసుకుంటూ సరియైన నిర్ణయం తీసుకోడం సులువవుతుంది. ఒకరికి నచ్చిన రెస్టరాంట్స్ మరొకరికి నచ్చకపోతే, ఆయన తనకు నచ్చిన దానిని యాడ్ చేయవచ్చు. ఇలాలిస్టు అంతిమంగా అందరికి నచ్చిన రెస్టరాంట్ల జాబితా తయారువుతుంది. ఏముంది అపుడు ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోవడం చాలా ఈజీ.

 

(*అహ్మద్ షరీఫ్,  కవి, రచయిత,  Conseco Data Services India Ltd మాజీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, ప్రస్తుతం PMP సర్టిఫకేషన్ కన్సల్టెంట్ గా ఉంటున్నారు)

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

పృథ్వీరాజ్ ఫేస్ బుక్ పోస్ట్ వైర‌ల్‌!

క‌రోనా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న వేళ మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ జోర్డాన్‌లో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. `ఆడుజీవితం` సినిమా షూటింగ్ కోసం 58 మంది యూనిట్ స‌భ్యుల‌తో జోర్డాన్ వెళ్లిన ఈ చిత్ర...

కింగ్ ట్విస్ట్‌: స్వ‌లింగ సంప‌ర్కుడితో హీరోయిన్ ఎఫైర్

ఒక‌రిని ప్రేమించి.. కొన్నాళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేసి.. అటుపై క‌ల‌త‌ల‌తో విడిపోతే.. అప్పుడు అత‌డిని హిజ్రా అంటూ అవ‌మానించ‌డం స‌రైన‌దేనా? అత‌డు హిజ్రా అయితే అది ముందే తెలుసు క‌దా? ఇంత‌కాలం ఎందుక‌ని...

ఆవిడ‌ అక్క అయితే.. ప్ర‌భాస్ బావ గారు!

డార్లింగ్ ప్ర‌భాస్ కి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అమెరికాలోనూ అత‌డికి వీరాభిమానులున్నారు. ఇక‌పోతే మిర్చి ఫేం రిచా గంగ‌పోధ్యాయ ప్ర‌స్తుతం అమెరికాలోనే ఉంటోంది. మిర్చి..మిర‌ప‌కాయ్..భాయ్ లాంటి సినిమాల్లో న‌టించిన...

లాక్ డౌన్ లో హీరోని అప్ప‌డిగిన హీరోయిన్!

ఎంకి చావు సుబ్బికొచ్చిన‌ట్టుగా ఉంది మ‌రి. ప్ర‌పంచం దేశాలు లాక్ డౌన్ సీన్ తో తీవ్రంగా న‌ష్ట‌పోయాయి. దీంతో అన్ని బిజినెస్ లు క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా సినిమా వినోద ప‌రిశ్ర‌మ‌లు ఖ‌తం...

RRR రిలీజ్ పై దాన‌య్య కాన్ఫిడెన్స్ ఏంట‌బ్బా!

లాక్ డౌన్ నేప‌థ్యంలో ఇండియాస్ మోస్ట్  అవైటెడ్ మూవీ RRR రిలీజ్ పై నీలి నీడ‌లు క‌మ్ముకున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా తాత్కలికంగా షూటింగ్ లు అన్నీ బంద్...

ప‌వ‌న్ – క్రిష్ సినిమాకు టైటిల్ ఫిక్స‌యిన‌ట్టేనా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ కెమెరా ముందుకొచ్చారు. జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల్లో బిజీగా గ‌డిపేసిన ప‌వ‌న్ మ‌రోసారి అభిమానులు కోరిక మేర‌కు మ‌ళ్లీ ఫేస్‌కి మేక‌ప్ వేసుకున్నారు. బాలీవుడ్ హిట్...

ప్చ్‌..! లాక్ డౌన్ ఎత్తేసినా ఆ డ‌జ‌ను రిలీజ్ డౌటే!

లాక్ డౌన్ పంచ్ కి థియేట‌ర్లు బంద్ అవ్వ‌డంతో సినిమాల రిలీజ్ ల‌న్నీ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లానే వినోద‌ప‌రిశ్ర‌మ అల్ల‌క‌ల్లోలం అయ్యింది. ప్ర‌స్తుతం మార్చిలో రిలీజ్ కావాల్సిన సినిమాల‌న్నీ...

గ‌ప్ చుప్‌: ప‌వ‌ర్ స్టార్ మూవీలో క‌రోనా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ లో ఉత్సాహం పెంచిన సంగ‌తి తెలిసిందే. వ‌కీల్ సాబ్ (పీ.ఎస్.పీ.కే 26) .. పీ.ఎస్.పీ.కే 27 చిత్రాలు సెట్స్...

స్టార్ డైరెక్టర్ల‌కు రాజ‌మౌళి చుక్క‌లు చూపిస్తున్నాడా?

బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 .. ఈ రెండు చిత్రాల‌తో టాలీవుడ్‌లో రాజ‌మౌళి స‌రికొత్త ట్రెండ్‌ని సెట్ చేశారు. దీన్ని బీట్ చేయాడం ఏ ద‌ర్శ‌కుడి వ‌ల్లా కావ‌డం లేదు. ఇదిలా వుంటే...

బ‌న్నీకి `బాహుబ‌లి 2` రిలీజ్ డేట్ కావాల‌ట‌!

అల్లు అర్జున్ `ఈ సంక్రాంతికి `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. దీంతో సంక్రాంతిని సెంటిమెంట్‌గా భావించిన బ‌న్నీ ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో చేస్తున్న‌ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మార్చిలో ప్రారంభించి...