Home TR Lounge Arts & Literature శర్మగాడు..మసాలా దోశ!

శర్మగాడు..మసాలా దోశ!

(సయ్యద్ సలీమ్ బాష)

కర్నూల్ బి క్యాంపు ఎలిమెంటరీ స్కూలు గురించి తెలియనివారెవ్వరూ ఉండరు. అప్పట్లో అదొకటే స్కూలు. కాలనీలోని ఏ పిల్లవాడు అయినా సరే అదే స్కూల్లో చదవాల్సిందే. ఇంకా ప్రైవేటు స్కూల్స్ పెద్దగా లేని కాలమది. అందువల్ల కాలనీలో చిన్నపిల్లలందరికి అదే ఏకైక స్కూల్.

నేనూ అక్కడే చదూకున్నా, ఒకటి నుంచి ఐదు దాకా నా క్లాసు లో నా పక్కనే గచ్చు మీద కూర్చునే వాళ్లలో శర్మ గాడంటే నాకు ఫాసినేషన్  రెవరెన్స్ రెండూ ఉండేవి. శర్మ గాడి తో పాటు నాకు లెఫ్ట్ సైడ్ కూర్చునేది  లొడ్డా( ఎడమచేతి వాటం అన్నమాట) వెంకటేష్ గాడు. శర్మ  గాడేమో సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన వాడు నేనేమో సాయిబు కాని సాయిబును. నాకు అప్పట్లో మతం గురించి పెద్దగా తెలీదు తెలియదు. ఆ మాటకొస్తే ఇప్పుడు కూడా తెలీదు అది వేరే విషయం! చిత్రమేమిటంటే నాకు దగ్గరగా ఉన్న ఇద్దరూ సనాతన బ్రాహ్మణ కుటుంబాల నుంచి వచ్చిన వారే!

మా శర్మ గాడి దగ్గర చాలా టాలెంట్లు ఉండేవి. చదువులో వాడు ఫస్టు. అప్పట్లోనే వాడి దగ్గర నాయకత్వ లక్షణాలు పుష్కలం, కానీ తెలుగు పద్యాల్లో నేనే ఫస్ట్! (మా తాతగారు తెలుగులో నిష్ణాతులు కదా) అదొక్కటి వాడి కొంచెం బాధగా ఉండేది అనుకుంటా. బహుశా దాని వల్లనే నేనంటే వాడికి కొంత గౌరవం ఉండి ఉండవచ్చు. వాడికున్నటాలెంట్ లలో అతి ముఖ్యమైన టాలెంట్ ఒకటి ఉంది. పకడ్బందీగా ప్యాక్ చేసిన దోశ పార్సిల్ లోంచి చాకచక్యంగా కూర, చట్నీ దొంగిలించడం. మళ్ళీ యాజ్ ఇటీజ్ గా పార్సెల్ చేయటం. దోశ చట్నీ చౌర్యం అప్పట్లో ఒక రహస్యం గా ఉండిపోయింది నా దగ్గర. అదో పెద్ద హకల్ బెరీ ఫిన్ స్టోరీ లాంటిది అంటే అడ్వంచరస్ మిస్టరీ అన్నమాట ! మా టీచర్ ఒక ఆమెకి దోశ అంటే బాగా ఇష్టం. అది మా స్వామి హోటల్లో ఘుమఘుమలాడే  ఆలు కూర, చెట్నీ తోనే ఉండాలి. ఆ రోజుల్లో స్వామి హోటల్ అంటే ఫేమస్. ఇప్పుడున్న సిల్వర్ జూబిలీ హాస్టల్ పక్కనే ఉండేది. పొడవైన కొట్టంలో సిమెంట్ చప్టాలు, చెక్క కుర్చీలు, కౌంటరు మీద రేడియో, ఇది హోటల్ లోపలి దృశ్యం. అప్పట్లో దోశ పావలానే అనుకుంటా. ఆ దోశకి భలే డిమాండ్ ఉండేది. బీ.ఎడ్ కాలేజ్ స్టూడెంట్స్, బీ.క్యాంప్ స్కూల్ టిచర్లు, కొంత డబ్బులున్న బీ.క్యాంపు వాసులకి అదంటే చాలా ఇష్టం.   ఆ హోటల్లో సిమెంట్ చప్టా పైన పెద్దాళ్ళ సరసన కూచుని వేడివేడి దోశ తినాలన్న కోరిక ఉన్నా తిన లేకపోయాను. ప్రతీ సారి మా టీచర్ శర్మగాడినే దోశ తేవటానికి పురమాయించటంలో ఆశ్చర్యం ఎమీ లేదు. వాడు క్లాస్ లీడర్ మరి. దోశ కోసం వెళ్ళేప్పుడు వాడితో పాటు ఎవర్నైనా తోడు తీసుకెళ్ళే ఒక సౌకర్యం ఉండేది వాడికి.  నాకు మాత్రం భలే టెన్షన్ గా ఉండేది..నన్ను తీసుకెళ్తాడో లేదోనని. కాని చిత్రంగా వాడు ప్రతిసారీ నన్నే ఎంచుకునేవాడు.

కర్నూలుకు గుర్తు, కొండారెడ్డి బురుజు

          ఇక అడ్వంచర్ మొదలు. మా స్కూలుకీ, స్వామి హోటల్ కి మధ్య మహా అయితే ఓ ఫర్లాంగ్ ఉండేదేమో. ఏడెనిమిదేళ్ళ వయసులో అప్పట్లో అది పెద్ద జర్నీనే! ముళ్ళ కంపల మధ్య దారిలోనుండి ఇప్పుడున్న గర్ల్స్ స్కూల్ గ్రౌండ్ దాటి స్వామి హోటల్ చేరటం భలే బావుండేది. నాకు అక్కడి వాతావరణం, పెద్దవాళ్ళూ భయాన్ని కలిగిస్తే, మా శర్మగాడు మాత్రం కేర్ లెస్ గా, పైలా పచ్చీసుగా ఉండేవాడు. నేరుగా కౌంటర్ దగ్గరకెళ్ళి, ” స్వామీ, మా టిచర్ కి ఒక దోశ పార్సిల్” అంటూ పావలా బిళ్ళ టేబుల్ పై పెట్టటం నాకు ఇంకా గుర్తుంది. అందుకే నాకు వాడ్ని చూస్తే ఫ్యాసినేటింగా ఉండేది.  

 ఇక కథ మొదలు. మా ప్రభాకర్ (స్వామి హోటల్లో అతనే సర్వర్, క్లీనర్, మేనేజర్) “ఒక్క దోసెయ్” అని మళయాళీ యాసలో అరవటం, పెనం మీద ‘సుయ్” అన్నా శబ్దం, ఆనక వచ్చే ఆలూ కూర, కొబ్బరి చేట్నీ వాసన ఇప్పటికి నానుంచి పోలేదు. అయిటే మా వాడు మాత్రం నిశితంగా హోటల్ని, మనుషులనీ అబ్జర్వ్ చేసేవాడు.

ఇక  ఓ పేపర్ పైన విస్తరాకు పరిచి, దానిపై దోశను పెట్టి, అలవోకగా మడిచి, రెండు చివర్లు లోపలికి నొక్కి పార్సిల్ తయరు చేయటం ప్రభాకర్ తప్ప వేరెవరూ చెయ్యలేరని నాకు అనిపించేది. ఆ స్పీడూ, ఆ స్కిల్లూ భలే థ్రిల్లింగా ఉండేది. కానీ, ప్రభాకర్ దోశను పార్సిల్ చెయ్యటం కన్నా మా  వాడు మధ్య దారిలో పార్సిల్ విప్పీ, కొంచె కూరా, చెట్నీ తినేసి, మళ్ళీ యాజ్ ఇటీజ్ గా పార్సిల్ చేయ్యగలిగే టాలెంటే గొప్పదని నా అభిప్రాయం. 

ఇదంతా నాకు తెలిసినా నేను ఎవ్వరికీ చెప్పలేకపోయే వాడ్ని. కారణం వాడు నాను ఇంకోసారి తీసుకెళ్ళడని.అంతే! ఈ అడ్వెంచర్ ని మిస్ కావటం నాకు ఇష్టం లేదు. పైగా టీచర్ కి దోశ తీసుకు రావటం మనకు ఒక ప్రివిలేజ్ చిన్నప్పుడు. అందుకే వాడి చేట్నీ చౌర్యం బైట పడలేదు. దానికి తోడు శర్మగాడు నాకు ఇచ్చిన వార్నింగ్! ఇంతా చేసి ఆ చౌర్యంలో నాకు భాగాం లేకపోవటం వల్ల కొంత ఉక్రోషంగాను, వాడి మీద కొంత కోపంగానూ ఉండేది. దాంతో వాడ్ని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం లేకుండా పోయింది. చౌర్యం బయట పడ్డా వాడు మేనేజ్ చెయ్యగలిగే వడని నా నమ్మకం.

          వాడు చాలా స్వార్థపరుడు. ఎవ్వరికీ ఏమీ ఇచ్హే వాడు కాదు. నాకు మాత్రం బుడ్డల గట్టాలు, నిమ్మప్పులు కాకి ఎంగిలి చేసి కొంత ఇచ్చేవాడు. ఉప్పు శనగలు, బఠాణీలు, సీమ చింత కాయలు, చిటి మిటి పండ్లు వాడే తినే వాడు.

అలా ఎప్పుడు  ఎవరికి ఏమి ఇవ్వని శర్మ గాడు ఓ రోజు స్కూలు మొత్తానికి ఇచ్చాడు, సెలవు..

ఆరోజు నాకు బాగా గుర్తుంది మేమంతా ఆనందంగా కేకలు పెట్టుకుంటూ ఆనందంగా పరిగెత్తుకుంటూ ఇళ్లకు వెళ్ళిపోయాము.

 

ఆరోజు నాకు బాగా గుర్తుంది. మా అహ్మద్  సారు ” ఒరేయ్! ఈరోజు స్కూల్ లేదు. అందరూ వెళ్లిపోండి.” అన్నారు. అందరము ఆనందంగా వెళ్లిపోయాం. ఎందుకు సెలవు అని అడిగే వయసు కాదు. పెద్దవాళ్లు  అనుకుంటుంటే  తెలిసింది శర్మ గాడు చనిపోయాడని. ఒకరు చచ్చిపోతే స్కూల్ కి సెలవిస్తారు అప్పుడు తెలిసింది. 2 రోజుల క్రితం ఎర్ర తేలు కుట్టిందట. సోమవారం ఉదయాన్నే వాడు వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఏడవలేదు. బాధపడలేదు. కానీ ఇప్పుడు తలచుకుంటే ఎక్కడో కలుక్కుమంటుంది .వాడు బతికుంటే కచ్చితంగా ఏ డాక్టర్ సైంటిస్టో అయి ఉండేవాడని నా నమ్మకం.  వాడి పొగరు,ధైర్యం, టాలెంటు, రోజు నుదుటి మీద పెట్టుకునే బొట్టు నేను మర్చిపోలేదు!

స్కూలు (బాగా మారిపోయింది) ఇంకా ఉంది. ఇంకా రెండు “సీ” టైపు ఇళ్ళూ ఉన్నాయి.వాటి వెనక ఉచ్చ వాసన లేదు. ఎదురుగా కానుగ చెట్టు లేదు.. స్వమి హోటల్ లేదు.. స్వామీ లేడు. ముళ్ళ దారీ లేదు. బీ.టీ కాలేజ్ ఉంది.. గర్ల్స్ స్కూల్ ఉంది.. గ్రౌండూ ఉంది..

శర్మగాడే లేడు. ఆ పక్క వెళ్ళినపుడు గుర్తొస్తాడు.. అంతే.

ఎప్పుడు ఎవ్వరికీ ఏమీ ఎవ్వని వాడు అందరికీ సెలవిచ్చి సెలవు తీసుకున్నాడు.

                                                                   ***

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

చిరు ఆటోబ‌యోగ్ర‌ఫీ రాస్తున్నారు!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌జీవితం స్థంభించిపోయింది. దేశాల‌న్నీ అనూహ్యంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో సామాన్యుల నుంచి సెల‌డ్రిటీలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయారు. అయినా ఖాలీగా కూర్చోవ‌డం లేదు. ఎవ‌రికి తోచిన ప‌ని వారు...

క్వారెంటైన్‌లో ఇలా కూడా వుంటారా?

బాలీవుడ్ చిత్రం `ద‌స్త‌క్‌` చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది విశ్వ‌సుంద‌రి సుస్మితాసేన్‌. తొలి సినిమా ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. న‌ట‌న రాద‌ని విమర్శ‌లు వినినించాయి. ఆ త‌రువాత సినిమాల్లో న‌టించే ప్ర‌య‌త్నం చేసినా...

ఆ న‌టితో ఎఫైర్ నిజ‌మే.. ఒప్పుకున్నజ‌గ్గూభాయ్!

జ‌గ్గూభాయ్ ఉరాఫ్ జ‌గ‌ప‌తిబాబు తాజాగా ఓ క్రేజీ హీరోయిన్‌తో త‌న‌కున్న ఎఫైర్‌ని బ‌య‌ట‌పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌త కొన్నేళ్ల క్రితం జ‌గ‌ప‌తిబాబు అప్ప‌ట్లో బెంగ‌ళూరుకు చెందిన స్టార్ హీరోయిన్‌తో అత్యంత స‌న్నిహితంగా మెలిగిన...

మండే ఎండ‌లో క‌రోనా మంట‌ల్లా!

ఓవైపు క‌రోనా క‌ల్లోలం.. మ‌రోవైపు స‌మ్మ‌ర్ ఎటాక్. న‌డిమ‌ధ్య‌లో ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు. క‌రోనా కోర‌లు చాచి విజృంభిస్తుంటే..భానుడు ప్ర‌తాపాన్ని చూపిస్తున్నాడు. భార‌త్ లో న‌మోద‌వుతున్న ఉష్ణోగ్ర‌త‌ల‌కి క‌రోనా కాస్త కంట్రోల్ లోనే ఉంటుంది....

`ఆహా` కోసం సీన్‌లోకి ట్ర‌బుల్ షూటర్!

అల్లు అర‌వింద్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన ఓటీటీ `ఆహా`. భారీ రేంజ్‌లో ప్లాన్‌లు వేసి ఈ ఓటీటీని తెర‌పైకి తీసుకొచ్చారు. లాంచింగ్ కి ఏడాది నుంచే ప్లాన్‌లు గీసినా అది ప్రాక్టిక‌ల్‌గా మాత్రం అస్స‌లు...

ప్చ్‌.. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కెరీర్ డైల‌మాలో!

ఆర్.ఎక్స్ -100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి కెరీర్ డైల‌మా ఇప్ప‌ట్లో క్లియ‌ర‌వ్వ‌దా? మ‌హాస‌ముద్రం ప్రాజెక్ట్ ఏడాది కాలంగా చ‌ర్చ‌ల‌ ద‌శ‌లోనే న‌లుగుతున్న సంగ‌తి తెలిసిందే. తొలుత ఈ ప్రాజెక్ట్ నాగ‌చైత‌న్య ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం...

#క‌రోనా: స‌్టార్ హీరోల‌తో నిర్మాత‌ల అత్య‌వ‌స‌ర భేటీ?

లాక్ డౌన్ నేప‌థ్యంలో షూటింగ్‌లేవీ అనుకున్న స‌మ‌యంలో పూర్తికాలేదు. షూటింగులు సహా రిలీజ్ ల‌ షెడ్యూల్స్ త‌ల‌కిందులైపోయాయి. అయితే దీనివ‌ల్ల అంద‌రి కంటే ఎక్కువ‌గా న‌ష్ట‌పోయేది నిర్మాత‌లే. ఒక రోజు షూటింగ్ నిలిచిపోయిందంటేనే...

క‌రోనా: సాయంలో ఆ న‌లుగురు డ‌మ్మీయేనా?

తెలుగు ప్ర‌జ‌లు విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు ప్ర‌తిసారీ టాలీవుడ్ స్పందించే తీరు ప్ర‌శంస‌లు అందుకుంటూనే ఉంది. ఒక ర‌కంగా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో విప‌త్తులు వ‌చ్చినా మ‌న స్టార్లు ఉదారంగా విరాళాలు అందిస్తూ...

లాక్ డౌన్ ఉల్లంఘించి పిల్ల‌ర్ ని గుద్దిన హీరోయిన్

దాదాపు దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14 వ‌ర‌కూ గుమ్మం దాట‌డానికి వీల్లేని స్థితి. ముఖ్యంగా మెట్రో పాలిట‌న్ సిటీల్లో లాక్ డౌన్ ప‌క్కాగా అమ‌ల‌వుతోంది. అయినా కొన్ని చోట్ల...

పృథ్వీరాజ్ ఫేస్ బుక్ పోస్ట్ వైర‌ల్‌!

క‌రోనా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న వేళ మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ జోర్డాన్‌లో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. `ఆడుజీవితం` సినిమా షూటింగ్ కోసం 58 మంది యూనిట్ స‌భ్యుల‌తో జోర్డాన్ వెళ్లిన ఈ చిత్ర...