fbpx
Home Politics పవన్ కు వేరే దారి లేదా ?

పవన్ కు వేరే దారి లేదా ?

రాష్ట్ర రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాన్ ఆటలో అరటిపండు లాగ తయారైపోయారు. ఎంతలా అయిపోయారంటే చంద్రబాబునాయుడు అవసరానికి దగ్గరకు వెళ్ళి అవసరం తీరి విసిరేస్తే దూరంగా పడిపోయేంతగా. విచిత్రమేమిటంటే చంద్రబాబుకు దగ్గరగా వెళ్ళటానికి కానీ మళ్ళీ దూరంగా జరగటానికి కానీ పవన్ ఏమాత్రం సిగ్గు పడటం లేదు.

నిజానికి రాష్ట్ర రాజకీయాల్లో తాను చక్రం తిప్పేయబోతున్నట్లు పవన్ తన గురించి తాను చాలా ఎక్కువగా ఊహించుకున్నారు. పొరుగునే ఉన్న కర్నాటకలో అందరికన్నా తక్కువ సీట్లు తెచ్చుకుని కూడా ముఖ్యమంత్రి అయిపోయిన కుమారస్వామినే పవన్ ఆద్శంగా పెట్టుకున్నారు. అయితే పవన్ మరచిపోయిన విషయం ఏమిటంటే కర్నాటక రాజకీయాల్లో కుమారస్వామి పెద్ద ఫోర్స్.

అదే ఏపి విషయానికి వస్తే పవన్ ఆటలో అరటిపండు లాంటి వాడే అనటంలో ఎవరికీ సందేహం లేదు. ఎందుకంటే పవన్ ఫుల్ టైం పొలిటిషియన్ కాడు అన్నదే జనాల అభిప్రాయం. దానికి తగ్గట్లే కొన్ని రోజులు చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతారు. మరి కొన్ని రోజులు వ్యతిరేకిస్తారు. తర్వాత చంద్రబాబుకు వ్యతిరేకమో లేకపోతే మద్దతుదారో కూడా అర్ధంకానట్లు మాట్లాడుతారు.

ఈ కారణాలతోనే జనాలు మొన్న పవన్ ను దారుణంగా తిరస్కరించారు. పోటి చేసిన రెండు నియోజకవర్గాల్లోను ఓడిపోయారంటే అర్ధమేంటి ? ఇప్పటికైనా పవన్ ఓ నిర్ణయం తీసుకోవాలి. ఉంటే చంద్రబాబుకు పూర్తి మద్దతుదారుడిగా ఉండాలి. లేకపోతే పూర్తిగా వ్యతిరేకమన్నా చేయాలి. చంద్రబాబుతో నేరుగా పొత్తు పెట్టుకుంటే పవన్+చంద్రబాబును అభిమానించే వాళ్ళు ఓట్లు పడతాయి. లేదూ పూర్తిగా వ్యతిరేకిస్తే జగన్+చంద్రబాబును వ్యతిరేకించే వాళ్ళ ఓట్లయినా పవన్ కు పడతాయి. తాను ఎటుండాలో నిర్ణయం తీసుకుంటేనే పవన్ కు భవిష్యత్తుంటుంది. లేకపోతే…

 

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ