మరో “సాక్షి” దిశగా జగన్ అడుగులు.. ఆ ప్రచారం సరిపోవడం లేదా?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు అనుకూలంగా సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఉన్నాయనే సంగతి తెలిసిందే. అటు సాక్షి పత్రికలో కానీ ఇటు సాక్షి టీవీలో కానీ వైసీపీకి వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా రాదు. తెలుగులో మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటున్న పలు న్యూస్ ఛానెళ్లు సైతం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. మరోవైపు జగన్ సర్కార్ ఏ పథకాన్ని అమలు చేసినా ఆ పథకానికి సంబంధించి యాడ్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

అయితే సీఎం జగన్ మాత్రం తమ పార్టీకి ఈ ప్రచారం సరిపోవడం లేదని భావిస్తున్నారని తెలుస్తోంది. మరో “సాక్షి” దిశగా జగన్ అడుగులు వేస్తుండటం గమనార్హం. ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం కొత్త న్యూస్ ఛానెల్ ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. జగన్ రిలేటివ్ అయిన గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి ప్రస్తుతం ఫైబర్ నెట్ కు ఛైర్మన్ గా పని చేస్తుండటం గమనార్హం.

ప్రస్తుతం న్యూస్ ఛానెళ్లు ఏ విధంగా పని చేస్తున్నాయో ఈ ఛానెల్ కూడా అదే విధంగా పని చేస్తుందని తెలుస్తోంది. అభివృద్ధి చేయకుండా ఎన్ని న్యూస్ ఛానెళ్లు ఉన్నా ప్రయోజనం ఉండదని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు జగన్ తన స్పీచ్ లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారే తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయబోతున్నారో చెప్పడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ మూడు రాజధానుల నిర్ణయం వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అమరావతి మాత్రమే రాజధానిగా ఉండి ఉంటే ఈపాటికి అమరావతి అభివృద్ధి జరిగి ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రజలు రాష్ట్ర రాజధాని ఏదనే ప్రశ్నకు సైతం సమాధానం చెప్పే పరిస్థితి లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ అభివృద్ధిపై దృష్టి పెడితే మాత్రమే వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అలా జరగని పక్షంలో వైసీపీ అధికారంలోకి రావడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.